కోలీవుడ్ సూపర్ స్టార్ ధనుష్ (Dhanush)కు తెలుగులోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. 'కుబేర'తో ఈ ఏడాది ఆయన బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నారు. ఆయన లేటెస్ట్ సినిమా 'ఇడ్లీ కడై'. ఇందులో ఆయన హీరోగా నటించడంతో పాటు దర్శకత్వం వహించారు. ఈ సినిమాను తెలుగులోకి 'ఇడ్లీ కొట్టు'గా డబ్బింగ్ చేశారు. డాన్ పిక్చర్స్, వండర్ బార్ ఫిల్మ్స్ సంస్థలపై ఆకాష్ బాస్కరన్ నిర్మించిన ఈ సినిమాను తెలుగులో వేదాక్షర మూవీస్ పతాకంపై రామారావు చింతపల్లి విడుదల చేస్తున్నారు.
అక్టోబర్ 1న 'ఇడ్లీ కొట్టు' విడుదలIdli Kottu Movie Release Date: దర్శకుడిగా ధనుష్ నాలుగో సినిమా 'ఇడ్లీ కొట్టు'. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి అక్టోబర్ 1న సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ రోజు తమిళంలో ఆడియో విడుదల చేశారు. త్వరలో తెలుగు పాటలు విడుదల చేయడంతో పాటు హైదరాబాద్ సిటీలో ఈవెంట్ చేయనున్నారు.
Idli Kottu Telugu Producer: 'ఇడ్లీ కొట్టు' సినిమా తెలుగు డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కోసం చాలా మంది పోటీ పడ్డారు. చివరకు ధనుష్ కెరీర్‌లో హైయ్యస్ట్ రేట్ ఇచ్చి మరీ శ్రీ వేదాక్షర మూవీస్ తెలుగు రైట్స్ సొంతం చేసుకుంది. తెలుగులో ఈ చిత్రాన్ని భారీ ఎత్తున విడుదల చేయడానికి నిర్మాత రామారావు చింతపల్లి సన్నాహాలు చేస్తున్నారు.
నిర్మాత రామారావు చింతపల్లి మాట్లాడుతూ... ''అక్టోబర్ 1న ధనుష్ గారి కెరీర్‌లో ఎక్కువ థియేటర్లలో భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. త్వరలో ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తాం. ఈ సినిమా తెలుగు డిస్ట్రిబ్యూషన్ రైట్స్ మాకు ఇచ్చినందుకు ధనుష్ గారికి, చిత్ర బృందానికి థాంక్స్'' అని చెప్పారు.
Idli Kottu Movie Cast And Crew: ధనుష్ సరసన నిత్యా మీనన్ కథానాయికగా నటించిన 'ఇడ్లీ కొట్టు' సినిమాలో అరుణ్ విజయ్, షాలిని పాండే, సత్యరాజ్, రాజ్ కిరణ్ ఇతర కీలక తారాగణం. ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్, ఛాయాగ్రహణం: కిరణ్ కౌశిక్, కూర్పు: ప్రసన్న జీకే, ప్రొడక్షన్ డిజైనర్: జాకీ, యాక్షన్ కొరియోగ్రఫీ: పీటర్ హెయిన్, నిర్మాణ సంస్థలు: డాన్ పిక్చర్స్ - వండర్‌బార్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్, తెలుగులో విడుదల: రామారావు చింతపల్లి 'శ్రీ వేదక్షర మూవీస్', నిర్మాతలు: ఆకాష్ బాస్కరన్ - ధనుష్, దర్శకత్వం: ధనుష్.