Raashii Khanna Solid Update On Ustaad Bhagat Singh Update: పవర్ స్టార్ పవన్ కల్యాణ్, స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబోలోని పవర్ ఫుల్ మాస్ ఎంటర్‌టైనర్ 'ఉస్తాద్ భగత్ సింగ్'. ఈ మూవీలో పవన్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనుండగా ఇప్పటికే రిలీజ్ అయిన లుక్స్ వింటేజ్ పవన్‌ను గుర్తు చేస్తున్నాయి. తాజాగా ఈ మూవీ షూటింగ్‌పై కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది.
పవన్‌తో సెల్ఫీ దిగుతూనే...
ఈ మూవీలో పవన్ సరసన బ్యూటీ శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తుండగా తాజాగా షూటింగ్‌పై సాలిడ్ అప్డేట్ ఇచ్చారు బబ్లీ బ్యూటీ రాశీ ఖన్నా. షూటింగ్ సెట్‌లో పవన్‌తో సెల్ఫీ దిగిన ఆమె ఆయనతో వర్క్ చేయడం తన లైఫ్‌లో ఓ బెస్ట్ మూమెంట్‌గా ఎప్పటికీ గుర్తుండిపోతుందని అన్నారు. 'పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ గారికి ఓ మెసేజ్. ఈ చిత్రాన్ని ఆయనతో పంచుకోవడం అద్భుతంగా ఉంది. ఇది నాకు నిజమైన గౌరవం. నేను ఎల్లప్పుడూ గుర్తుంచుకునే జ్ఞాపకం.' అంటూ రాసుకొచ్చారు. పవన్‌తో సెల్ఫీని పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది. ఈ అప్డేట్‌తో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.
Also Read: తల్లి కాబోతోన్న హీరోయిన్ - ప్రకృతి ఒడిలో భర్తతో కలిసి బేబీ బంప్‌తో ఫోటో షూట్
'గబ్బర్ సింగ్' తర్వాత సూపర్ హిట్ కాంబో రిపీట్ కావడంతో 'ఉస్తాద్ భగత్ సింగ్'పై భారీ హైప్ క్రియేట్ అవుతోంది. పవన్ వీరాభిమానిగా ఆడియన్స్ ఆయన్ను ఎలా చూడాలనుకుంటున్నారో ఉస్తాద్‌లో అలానే చూపించనున్నట్లు తెలుస్తోంది. పవన్ బర్త్ డే సందర్భంగా రీసెంట్‌గా రిలీజ్ చేసిన వింటేజ్ లుక్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. పవర్ స్టార్‌ను స్టైలిష్ స్టార్‌గా చూసిన ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. చాలా రోజుల తర్వాత ఆయన్ను ఇలా చూశామంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఓ పెద్ద క్లాక్ బ్యాక్ డ్రాప్‌లో త్రీ పీస్ సూట్ వేసుకుని స్టైల్‌గా ఓ డ్యాన్స్ స్టెప్ వేస్తున్నట్లుగా ఉన్న పోస్టర్ అదిరిపోయింది. ఈ మూవీ రిలీజ్ కోసం వరల్డ్ వైడ్‌గా మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ మూవీలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా పవన్ కనిపించనున్నారు. ఫోటోగ్రాఫర్ పాత్రలో రాశీ ఖన్నా నటించనుండగా... వీరితో పాటే కేఎస్ రవికుమార్, పార్థిబన్, నవాబ్ షా, కేజీఎఫ్ ఫేం అవినాష్, రాంకీ, టెంపర్ వంశీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. రాకింగ్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తుండగా... మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇక 'సాహో' ఫేం సుజీత్ దర్శకత్వంలో పవన్ లేటెస్ట్ గ్యాంగ్ స్టర్ డ్రామా 'OG' ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.