తెలుగు ప్రేక్షకులను సైతం ఆకట్టుకున్న కన్నడ సినిమా 'కాంతార'. రిషబ్ శెట్టి (Rishab Shetty) కథానాయకుడిగా నటించడంతో పాటు దర్శకత్వం వహించిన చిత్రమది. తొలుత కన్నడలో చేసిన ఆ సినిమాను తర్వాత తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల చేయగా... అన్నీ భాషల్లో విజయం సాధించింది. ఆ సినిమాకు ప్రీక్వెల్ 'కాంతార: ఏ లెజెండ్' (Kantara Chapter 1) తెరకెక్కింది.
'కాంతార 2'లో పాడిన దిల్జిత్ సాంగ్!రిషబ్ శెట్టి హీరోగా నటించడంతో పాటు దర్శకత్వం వహించిన సినిమా 'కాంతార 2' (Kantara 2). గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేశారు. త్వరలో ప్రమోషనల్ యాక్టివిటీస్ స్టార్ట్ చేయనున్నారు.
పంజాబీ గాయకుడు, కథానాయకుడు దిల్జిత్ దోశాంజ్ (Diljit Dosanjh) తెలుసుగా! హిందీ సినిమాల్లోనూ హీరోగా నటిస్తున్నారు. ఇప్పుడు ఆయన 'కాంతార 2' కోసం ఓ పాట పాడారు. ఆ విషయం సోషల్ మీడియాలో దిల్జిత్ దోశాంజ్ తెలిపారు.
వరాహ రూపం సాంగ్ చూసి ఎమోషనల్ అయ్యా''రిషబ్ శెట్టి పెద్దన్నయ్య లాంటి వారు. మాస్టర్ పీస్ 'కాంతార' తీసినందుకు ఆయనకు సెల్యూట్. నాకు ఆ సినిమాకు పర్సనల్ కనెక్షన్ ఉంది. అది బయటకు చెప్పలేను. కానీ, అందులో 'వరాహ రూపం...' సాంగ్ వచ్చినప్పుడు నేను ఎమోషనల్ అయ్యాను. థియేటర్లలో ఏడ్చాను. ఇప్పుడు 'కాంతార'లో సాంగ్ పాడటం సంతోషంగా ఉంది'' అని చెప్పారు.
నైజాంలో రిలీజ్ చేస్తున్న మైత్రీ డిస్ట్రిబ్యూషన్!నైజాంలో 'కాంతార 2'ను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థకు చెందిన డిస్ట్రిబ్యూషన్ హౌస్ రిలీజ్ చేస్తోంది. ఈ సినిమాకు అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు. ఇందులో రిషబ్ శెట్టి సరసన రుక్మిణీ వసంత్ హీరోయిన్ రోల్ చేశారు. కన్నడతో పాటు తెలుగు, తమిళ్, మలయాళ, హిందీ భాషలు మాత్రమే కాదు... ఇంగ్లీష్, బెంగాలీ భాషల్లో కూడా సినిమా రిలీజ్ కానుంది.