Teja Sajja's Mirai Making Video Out: చైల్డ్ ఆర్టిస్ట్‌గా తన నటనతో మెప్పించి 'హను మాన్' మూవీతో సూపర్ సక్సెస్ అందుకున్న యంగ్ హీరో తేజ సజ్జా. ఆయన లేటెస్ట్ సూపర్ యాక్షన్ అడ్వెంచర్ 'మిరాయ్'. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ మూవీ టీజర్, లుక్స్ ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ చేశాయి. ఈ మూవీలో తేజ సజ్జా సూపర్ యోధుడిగా ఓ డిఫరెంట్ రోల్‌లో కనిపించనుండగా... ఆయన పుట్టిన రోజు సందర్భంగా మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు మేకర్స్.


పవర్ ఫుల్ వారియర్


ఇప్పటివరకూ ఎన్నడూ చూడని ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌ ఆధారంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్లు టీజర్‌ను బట్టి అర్థమవుతోంది. తేజ బర్త్ డే సందర్భంగా తాజాగా రిలీజ్ చేసిన మేకింగ్ వీడియోలో సూపర్ యోధుడిగా తేజ సజ్జా విన్యాసాలు ఆకట్టుకుంటున్నాయి. 'సూపర్ యోధలు పుట్టరు. ధైర్య సాహసాలు, అప్పటి పరిస్థితులు, అజేయమైన స్ఫూర్తితో పుట్టుకొస్తారు.' అంటూ క్యాప్షన్ ఇచ్చారు మేకర్స్. 


స్టంట్ మాస్టర్ 'కేచ' (KECHA) ఆధ్వర్యంలో భారీ యాక్షన్ స్టంట్స్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. తెర వెనుక హీరో, మూవీ టీం ఎంత శ్రమించారో తెలుస్తోంది. వారియర్‌గా ఆయన చేసిన స్టంట్స్, విన్యాసాలు, యుద్ధం అన్నీ కళ్లకు కట్టేలా వీడియోలో చూపించారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.






Also Read: రొమాంటిక్ కామెడీ 'ర్యాంబో ఇన్ లవ్'... కోర్డ్ డ్రామా 'ది ట్రయల్' సీజన్ 2 - ఒకే ఓటీటీలో రెండు వెబ్ సిరీస్‌లు


విలన్‌గా మంచు మనోజ్


ఈ మూవీలో తేజ సరసన రితికా నాయక్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. విలన్‌గా మంచు మనోజ్ నటిస్తుండగా... జగపతిబాబు, శ్రియ, కౌశిక్ మెహతా కీలక పాత్రలు పోషిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్‌లో దాదాపు 8 భాషల్లో 2డీ, 3డీ ఫార్మాట్లలో సెప్టెంబర్ 5న రిలీజ్ చేయనున్నారు.


అసలేంటీ మిరాయ్?


'మిరాయ్' అంటే 'హోప్ ఫర్ ది ఫ్యూచర్... భవిష్యత్తుపై నమ్మకం' అని అర్థం. అశోకుడు కళింగ యుద్ధ పరిణామాల తర్వాత రాసిన గ్రంథాలు వాటిని తరతరాలుగా కాపాడుతూ వస్తోన్న 9 మంది యోధుల కథే ఈ మిరాయ్ అని టీజర్‌ను బట్టి తెలుస్తోంది. చెడును అంతం చేసి ధర్మాన్ని కాపాడేందుకు వచ్చే యోధుడి పాత్రలో తేజ సజ్జ కనిపించనున్నారు. అసలు ఆ గ్రంథాలు, భూమిని కాపాడేందుకు ఆ వారియర్ ఏం చేశాడు? అనేదే స్టోరీ. మంచు మనోజ్, తేజ సజ్జా మధ్య భారీ యాక్షన్ సీక్వెన్స్ ఉంటాయని టీజర్ చూస్తే తెలుస్తోంది. ఈ భారీ యాక్షన్ అడ్వెంచర్ చూడాలంటే సెప్టెంబర్ వరకూ వెయిట్ చేయాల్సిందే.