Tamilnadu Deputy CM Udhyanidhi Stalin Review About Coolie Movie: తమిళ సూపర్ స్టార్, తలైవా రజినీకాంత్ లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'కూలీ' గురువారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఇండస్ట్రీలోనూ అటు సోషల్ మీడియాలోనూ రజినీ మేనియా నడుస్తోంది. తాజాగా ఈ మూవీని చూసిన తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ రజినీపై ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్ చేశారు.
ప్రతీ సీన్... గూస్ బంప్స్
'కూలీ' మూవీని ముందుగా చూసే ఛాన్స్ ఇచ్చినందుకు టీంకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు ఉదయనిధి. 'ఇండస్ట్రీలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న రజినీకాంత్‌కు ప్రత్యేక అభినందనలు. గురువారం రిలీజ్ కానున్న కూలీ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. దీన్ని ముందుగానే చూసే ఛాన్స్ వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. పవర్ ఫుల్ మాస్ ఎంటర్‌టైనర్‌లో ప్రతీ యాక్షన్ సీన్‌ను ఎంతో ఎంజాయ్ చేశా.
రిలీజ్ అయిన ప్రతీ ప్రాంతంలోనూ ఈ మూవీ కచ్చితంగా విజయం సాధిస్తుంది. రజినీ ఫ్యాన్స్‌తో పాటు మూవీ లవర్స్ అందరి మనసులు దోచుకుంటుంది.' అంటూ రాసుకొచ్చారు. ఈ ట్వీట్‌పై రియాక్ట్ అయిన డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్... 'మూవీ మీకు నచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉంది.' అంటూ ట్వీట్ చేశారు.
Also Read: కూలీ vs వార్ 2... బిజినెస్‌లో ఎవరిది అప్పర్ హ్యాండ్? మార్కెట్టులో ఎవరి సినిమా క్రేజ్ ఎక్కువ?
ప్రీ బుకింగ్స్‌లో రికార్డు
ఈ మూవీకి మంగళవారం సాయంత్రం అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ ఓపెన్ కాగా కొన్ని గంటల్లోనే ప్రపంచవ్యాప్తంగా రికార్డు ఓపెనింగ్స్ జరిగాయి. ఇప్పటివరకూ 10,322 షోలకు 12.24 లక్షల టికెట్స్ అమ్ముడుపోగా... రూ.27.01 కోట్లు వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో రూ.3.38 కోట్లు వసూలు చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ నెంబర్స్ చూస్తుంటే కోలీవుడ్ రికార్డ్ ఓపెనర్‌గా నిలిచే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
మరోవైపు... థియేటర్స్ వద్ద తలైవా ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. కొన్ని గంటల్లో రజినీ పవర్ ఫుల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్‌ను చూసేందుకు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అసలు ట్రైలర్, లుక్స్‌తోనే భారీ హైప్ క్రియేట్ చేశారు డైరెక్టర్ లోకేశ్. జైలర్ తర్వాత అంతటి స్థాయిలో రజినీ హిట్ అందుకోలేదు. ఈ మూవీలో మరోసారి ఇండస్ట్రీ రికార్డులు తిరగరాయాలని అంతా ఆకాంక్షిస్తున్నారు. కింగ్ నాగార్జున, బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ కీలక రోల్స్ పోషిస్తుండడం మూవీకే హైలెట్ అవుతోంది. సైమన్ విలన్ రోల్‌లో ఫస్ట్ టైం నాగార్జున నటిస్తుండడంతో తెలుగు ఆడియన్స్ సైతం ఆసక్తి కనబరుస్తున్నారు. పోర్ట్ ఏరియాలో జరిగే స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్‌లో మూవీ తెరకెక్కించినట్లు ప్రచారం సాగుతున్నా అసలు స్టోరీ ఏంటి అనేది సస్పెన్స్‌గానే ఉంది. మరి ఈ ఉత్కంఠకు తెర పడాలంటే రిలీజ్ వరకూ ఆగాల్సిందే.