Rajinikanth and Nagarjuna's Coolie Twitter Review USA Premieres Report: సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ 'కూలీ'. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించారు. టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ఫస్ట్ టైమ్ విలన్ రోల్ చేసిన చిత్రమిది. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్, కన్నడ స్టార్ ఉపేంద్ర, శృతి హాసన్, మలయాళ నటుడు సౌబిన్ షాహిర్ వంటి భారీ తారాగణం ఉండటంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మరి, ఫస్ట్ రివ్యూస్ ఏ టైంకి వస్తాయి? అమెరికాలో మొదటి షో ఎన్ని గంటలకు పడుతుంది? వంటి వివరాల్లోకి వెళితే...
అమెరికాలోని జార్జియాలో రాత్రి 7.30 గంటలకు...ఇండియన్ టైమింగ్ చూస్తే ఎన్ని గంటలకు అంటే?Coolie Release Date: ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 14న 'కూలీ' రిలీజ్. ముందు రోజు రాత్రి అమెరికాలో ప్రీమియర్ షోలు వేస్తున్నారు. యూఎస్‌ఏలోని జార్జియాలో ఆగస్టు 13న రాత్రి 7.30 గంటలకు మొదటి షో పడుతుంది.అమెరికాలోని జార్జియాకు, ఇండియాకు తొమ్మిదిన్నర గంటల వ్యత్యాసం ఉంది. ఈ లెక్కన ఇండియాలో ఉదయం మూడు, మూడున్నర గంటలకు షో పడొచ్చు. ఆ లెక్కన చూస్తే... ఇండియాలో తెల్లవాఱుజామున షోలు పడే సమయానికి అక్కడ నుంచి రివ్యూలు వస్తాయి.
'కూలీ' ఓవర్సీస్ రిపోర్ట్, ట్విట్టర్ టాక్ వచ్చేది ఎప్పుడంటే?Coolie Movie Runtime: 'కూలీ' రన్ టైమ్ 2.50 గంటలు. ఆల్మోస్ట్ ఆల్ మూడు గంటలు. అమెరికాలో మన ఇండియన్ టైమింగ్ ప్రకారం మూడున్నర గంటలకు షోలు పడితే ఇండియాలో ఆగస్టు 14న ఉదయం ఆరున్నర గంటలకు ప్రీమియర్స్ రిపోర్ట్, ట్విట్టర్ టాక్ వచ్చే అవకాశం ఉంది.
చెన్నై కంటే ఏపీలోని విజయవాడలో ముందుగా 'కూలీ' షోస్!తమిళనాడు, కర్ణాటకలో కంటే ఏపీలో 'కూలీ' ముందుగా విడుదల అవుతోంది. ప్రతి సినిమాకూ తమిళ ప్రభుత్వం ఒక విధమైన పద్ధతి పాటిస్తోంది. ఎవరి సినిమా అయినా సరే ప్రత్యేకమైన వెసులుబాటు ఇవ్వడం లేదు. ఉదయం తొమ్మిది గంటలకు మొదటి ఆట ప్రదర్శిస్తారు. సాధారణంగా బెంగళూరులో ఎర్లీ మార్నింగ్ షోస్ పడతాయి. అయితే 'కూలీ' షోలు ఉదయం ఆరున్నర గంటలకు మొదలు అవుతున్నాయి. ఏపీలో మాత్రం ఉదయం ఐదు గంటల నుంచి బెనిఫిట్ షోలు వేయడం మొదలు పెడుతున్నారు. సో, అమెరికా తర్వాత ఇండియాలో ఏపీ నుంచి ఫస్ట్ రివ్యూస్ వస్తాయి.
Also Read: అమెరికాలో ఎన్టీఆర్ 'వార్ 2' ఫస్ట్ షో ఎప్పుడు? USA Premier Show రిపోర్ట్, ట్విట్టర్ రివ్యూస్ వచ్చేది ఎప్పుడో తెలుసా? 'వార్ 2'తో కంపేర్ చేస్తే 'కూలీ'కి తెలుగు రాష్ట్రాల్లో బజ్ ఎక్కువ ఉంటోంది. ఏపీలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు సైతం రజనీకాంత్ సినిమాకు సపోర్ట్ చేస్తున్నాయి. ఆ సినిమా గురించి నారా లోకేష్ ట్వీట్ చేయడం కూడా కలిసొచ్చింది. 'వార్ 2' ఈవెంట్‌లో తాతయ్య తప్ప బాబాయ్ పేరు ఎన్టీఆర్ చెప్పకపోవడం వల్ల కొందరు అభిమానులు హార్ట్ అయ్యారు.
Also Read: కూలీ vs వార్ 2... బిజినెస్‌లో ఎవరిది అప్పర్ హ్యాండ్? మార్కెట్టులో ఎవరి సినిమా క్రేజ్ ఎక్కువ?