Tamil Journalist Controversy About Vijay Deverakonda Kingdom Movie: యంగ్ హీరో విజయ్ దేవరకొండ లేటెస్ట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ 'కింగ్‌డమ్' బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ మూవీపై తాజాగా సోషల్ మీడియాలో ఓ వివాదం రేగుతోంది. తమిళులను చెడుగా చూపించారంటూ ఓ తమిళ జర్నలిస్ట్ మూవీపై నెట్టింట విమర్శలు చేస్తున్నారు.

అసలు స్టోరీ ఏంటి?... వివాదం ఏంటి?

మూవీలో శ్రీలంకకు వలస వెళ్లిన భారతీయులను అక్కడ స్మగ్లింగ్ మాఫియా తమ అదుపాజ్ఞల్లో ఉంచుకుంటుంది. జాఫ్నాలో కొందరు తమిళులు వలస కూలీలను ఇబ్బంది పెట్టినట్లు చూపించారని... జాఫ్నా తమిళులను స్మగ్లర్లుగా చిత్రీకరించారంటూ తమిళ జర్నలిస్ట్ ప్రశాంత్ రంగస్వామి సోషల్ మీడియా వేదికగా విమర్శించారు.

మేం ప్రశ్నిస్తాం

'కింగ్డమ్' ఇంటర్వెల్ సీక్వెన్స్‌లో జాఫ్నా తమిళులను... శ్రీలంకకు వలస వచ్చిన భారతీయులను అణచివేసిన దుష్ట వ్యక్తులుగా చిత్రీకరించారని ప్రశాంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 'ఇలా ఎందుకు చేస్తారు? మరి మీరు ఈ సినిమాను ప్రమోట్ చేయడానికి తమిళనాడుకు వచ్చారా? మేం తమిళులం సోదరులం. వాళ్లు మమ్మల్ని చెడుగా చూపిస్తే కచ్చితంగా మేము దాన్ని ప్రశ్నిస్తాం.' అంటూ 'X'లో ట్వీట్ చేశారు. 

మూవీని ప్రశంసిస్తూనే...

'కింగ్డమ్' మూవీని ఓ వైపు ప్రశంసిస్తూనే డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరిపై విమర్శలు గుప్పించారు ప్రశాంత్. ఇది ఒక్క సంఘటన మాత్రమే కాదని... మూవీస్‌లో అప్పుడప్పుడూ తమిళులను బ్యాడ్‌గా చూపిస్తున్నారంటూ కామెంట్స్ చేశారు. ''కింగ్డమ్' చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ అత్యుత్తమమైన మూవీ. ఈ సినిమా హార్ట్ సినిమాటోగ్రఫీ. కానీ తమిళులను స్మగ్లర్లుగా చెడుగా చూపించడం దర్శకుడు చేసిన చెత్త పని.' అంటూ ఘాటుగా విమర్శించారు. దీనిపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు జర్నలిస్టుకు సపోర్ట్ చేస్తూ కామెంట్స్ చేస్తుంటే... మరికొంతమంది మూవీని మూవీగానే చూడాలంటూ పేర్కొంటున్నారు.

Also Read: తండ్రి సొంతింటి కల కొడుకు నెరవేర్చాడా? - నెల రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేసిన '3 BHK'... ఎందులో స్ట్రీమింగ్ అంటే?

ఈ మూవీకి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించగా... విజయ్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించారు. సత్యదేవ్ కీలక పాత్ర పోషించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థల బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య మూవీని నిర్మించారు.