Ajith Kumar Shuts down Rumours Of Alleged Rivalry With Vijay : తమిళ  స్టార్ హీరోలు అజిత్ కుమార్, దళపతి విజయ్ మధ్య శతృత్వం ఉందంటూ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. మూవీస్ విడుదలైన సందర్భాల్లోనూ ఆ హీరోల ఫ్యాన్స్ ఒకరిని ఒకరు విమర్శించుకుని పోస్టులు పెడుతుంటారు. ఈ ఫ్యాన్ వార్స్ ఆ వార్తలకు మరింత బలం చేకూర్చాయి. తాజాగా దీనిపై హీరో అజిత్ కుమార్ స్పందించారు. తనకు ఎవరితోనూ వైరం లేదంటూ క్లారిటీ ఇచ్చారు.

Continues below advertisement

ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు

కొందరు కావాలనే తమ మధ్య లేని పోని అపోహలు సృష్టిస్తున్నారని చెప్పారు హీరో అజిత్. 'ఇలాంటి రూమర్లను చూసి ఫ్యాన్స్ ఒకరితో ఒకరు గొడవ పడుతున్నారు. అలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయాలనుకునే వారంతా సైలెంట్‌గా ఉంటే అందరికీ బాగుంటుంది. నేను ఎప్పుడూ విజయ్‌కు మంచి జరగాలనే కోరుకుంటాను. ఎప్పటికీ కోరుకుంటూనే ఉంటాను.' అంటూ ఆ రూమర్లకు చెక్ పెట్టారు. గతంలో వీరిద్దరికీ వైరం ఉందనే వార్తలపై అజిత్ మేనేజర్ సైతం రియాక్ట్ అయ్యారు. వాళ్లిద్దరూ మంచి ఫ్రెండ్స్ అని చెప్పారు. అజిత్‌కు పద్మభూషణ్ వచ్చినప్పుడు ఫస్ట్ విష్ చేసింది విజయ్ అంటూ గుర్తు చేశారు. 

Continues below advertisement

Also Read : ది ఫ్యామిలీ మ్యాన్ 3 ట్రైలర్ వచ్చేసింది - తెలుగులోనూ యాక్షన్ థ్రిల్లర్ సిరీస్... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?

కరూర్ ఘటనపై!

ఇక రీసెంట్‌గా తమిళనాడు కరూర్ తొక్కిసలాట ఘటనపైనా రీసెంట్‌గా ఓ పాడ్ కాస్ట్‌లో రియాక్ట్ అయిన అజిత్... ఈ అంశంపై ఫస్ట్ టైం స్పందించారు. ఈ ఘటనకు విజయ్‌‌ది మాత్రమే బాధ్యత కాదని... మనందరిదీ కూడా అంటూ కామెంట్ చేశారు. ఎవరినీ తక్కువ చేయడం తన ఉద్దేశం కాదని... ఇలాంటి గందరగోళ పరిస్థితులు కేవలం సినీ తారల సభల్లోనే ఎక్కువగా జరుగుతున్నాయని అన్నారు. ఇటీవల ఇలాంటి ఘటనలు ఎక్కువయ్యాయని అన్నారు. ఇప్పటివరకూ ఈ అంశంపై తమిళ స్టార్ హీరోలు ఎవరూ రియాక్ట్ కాలేదు. కానీ, తొలిసారి విజయ్‌ది మాత్రమే బాధ్యత కాదంటూ అజిత్ చెప్పడం వైరల్ అయ్యింది. కాగా, సెప్టెంబర్ 27న టీవీకే అధినేత విజయ్ కరూర్ వద్ద నిర్వహించిన బహిరంగ సభలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మృతి చెందారు.