Taapsee Pannu about Relationship: టాలీవుడ్‌లో హీరోయిన్‌గా పరిచయమయ్యి.. ఆ తర్వాత బాలీవుడ్ నుంచి అవకాశాలు దక్కించుకొని అక్కడికే వెళ్లి సెటిల్ అయిపోయిన హీరోయిన్స్‌లో తాప్సీ పన్ను కూడా ఒకరు. తెలుగులో నటిగా అడుగుపెట్టిన తాప్సీకి కొంతకాలం వరకు టాలీవుడ్‌లో హిట్స్ దక్కినా.. ఆ తర్వాత అవకాశాలు కరువయ్యాయి. అప్పుడే బాలీవుడ్ నుంచి అవకాశాలు రావడం, కంటెంట్ ఉన్న కథల్లో నటించి హిట్ కొట్టడంతో ప్రస్తుతం బాలీవుడ్‌లోనే తాప్సీ బిజీ అయిపోయింది. ఇక ఈ భామ పర్సనల్ లైఫ్ గురించి ఎప్పుడూ పెద్దగా బయటపెట్టలేదు. కానీ తాజాగా తన బాయ్‌ఫ్రెండ్ ఎవరు, వారిద్దరూ ఎప్పటినుంచి కలిసుంటున్నారు లాంటి విషయాలపై ఆసక్తికర విషయాలు రివీల్ చేసింది.


11 ఏళ్ల రిలేషన్‌షిప్..
చాలాకాలం క్రితం తాప్సీ.. యూరోప్‌కు చెందిన బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బోతో ప్రేమలో ఉందని వార్తలు వచ్చాయి. ఈ విషయంపై తనను ప్రశ్నించగా.. రిలేషన్‌షిప్ విషయం నిజమే అని ఒప్పుకుంది కూడా. కొన్నాళ్లుగా మళ్లీ తన పర్సనల్ లైఫ్ గురించి పెద్దగా విషయాలు ఏమీ బయటికి రాలేదు. తాజాగా తన రిలేషన్‌షిప్ స్టేటస్ గురించి తాప్సీని ప్రశ్నించగా.. ‘‘నేను గత పదేళ్ల నుంచి ఒక్క మనిషితోనే ఉన్నాను. 13 ఏళ్ల క్రితం నేను యాక్టింగ్ ప్రారంభించాను. బాలీవుడ్‌లో నా డెబ్యూ సమయంలో తనను కలిశాను. అప్పటినుంచి ఇప్పటివరకు అదే వ్యక్తితో ఉన్నాను’’ అంటూ తన లాంగ్ టర్మ్ రిలేషన్‌షిప్ గురించి చెప్పుకొచ్చింది తాప్సీ.


అలాంటి ఆలోచన ఏమీ లేదు..
‘‘నాకు తనను వదిలేయాలని ఆలోచన లేదు. ఇంకొకరితో ఉండాలనే ఆలోచన కూడా లేదు. ఎందుకంటే ఈ రిలేషన్‌షిప్‌లోనే నేను చాలా సంతోషంగా ఉన్నాను’’ అంటూ మథియాస్ బోతో తన రిలేషన్‌షిప్ చాలా బాగుందని బయటపెట్టింది తాప్సీ. కొన్నాళ్ల క్రితం మథియాస్‌తో పెళ్లి అంటూ రూమర్స్ వైరల్ అయ్యాయి. ఆ రూమర్స్‌పై సోషల్ మీడియాలో ఘాటుగా స్పందించింది ఈ భామ. ‘‘నేను ఇంకా ప్రెగ్నెంట్ కాదు. కాబట్టి ఇప్పట్లో పెళ్లి చేసుకోను. నాకు పిల్లలు కావాలి అనిపించినప్పుడు మాత్రమే పెళ్లి చేసుకుంటాను’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఇది మాత్రమే కాదు.. చాలా సందర్భాల్లో, చాలా విషయాలపై తాప్సీ స్పందన ఇలాగే ఉంటుంది. అందుకే ఎప్పుడూ తాప్సీ పేరు ఏదో ఒక కాంట్రవర్సీలో వినిపిస్తూనే ఉంటుంది.


ఫోటోగ్రాఫర్లంతా ఎప్పుడూ గొడవే..
మామూలుగా బాలీవుడ్ సెలబ్రిటీలు కనిపించగానే.. ఫోటోగ్రాఫర్లంతా వారి చుట్టూ చేరి ఫోటోలు తీస్తుంటారు. కానీ తాప్సీకి అది అస్సలు నచ్చదు. ఈ విషయంపై వారితో చాలాసార్లు వాగ్వాదానికి కూడా దిగింది. అలా తాప్సీ పేరు బాలీవుడ్ కాంట్రవర్సీల్లో ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటుంది. ఇక సినిమాల విషయానికొస్తే.. చాలాకాలంగా లేడీ ఓరియెంటెడ్ కథలతోనే బిజీ అయిన తాప్సీ.. తాజాగా షారుఖ్ ఖాన్‌తో కలిసి ‘డంకీ’ అనే మూవీలో స్క్రీన్ షేర్ చేసుకుంది. రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘డంకీ’లో మను పాత్రలో తాప్సీ నటన అద్భుతంగా ఉందని ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు. పైగా షారుఖ్ లాంటి సీనియర్ హీరోతో మొదటిసారి జతకట్టినా కూడా వీరిద్దరి కెమిస్ట్రీ ఆడియన్స్‌ను ఆకట్టుకుంది.


Also Read: నీ హగ్, నీ లవ్ మిస్ అవుతున్నా, మళ్లీ లైఫ్‌లోకి రమ్మంటూ ఛార్మి ఎమోషనల్ పోస్ట్