Charmme Kaur Emotional Post: ఛార్మీ కౌర్, తెలుగు సినీ అభిమానులకు ఆమె గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. 'లక్ష్మీ', 'స్టైల్', 'మాస్', 'రాఖీ' లాంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ‘అనుకోకుండా ఒక రోజు’, ‘మంత్ర’ లాంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం దర్శకుడు పూరి జగన్నాథ్ తో కలిసి పూరి కనెక్ట్స్ బ్యానర్ లో సినిమాలు నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ సంస్థ నుంచి ‘ఇస్మార్ట్ శంకర్’, ‘లైగర్’ సహా పలు సినిమాలు తెరకెక్కాయి. అటు పూరి జగన్నాథ్, ఛార్మి మధ్య ప్రేమాయణం నడుస్తోందంటూ పలు వార్తలు వచ్చాయి. వీరి రిలేషన్ కారణంగా పూరి భార్య కూడా చాలా ఇబ్బంది పడిందనే టాక్ వినిపించింది. అయితే, ఈ విషయం గురించి అటు ఛార్మి గానీ, ఇటు పూరి గానీ ఎలాంటి వివరణ ఇవ్వలేదు.
సోషల్ మీడియాలో ఛార్మి ఎమోషనల్ పోస్టు
కాసేపు ఛార్మి ఇతర విషయాల గురించి పక్కన పెడితే, తాజాగా సోషల్ మీడియా వేదికగా ఆమె పెట్టిన ఓ ఎమోషనల్ పోస్టు బాగా వైరల్ అవుతోంది. ఇంతకీ ఆమె తన పోస్టులో ఏం రాసిందంటే? “నువ్వు దూరమై రెండు సంవత్సరాలు అవుతోంది. నీ హగ్, నీ లవ్ ను మిస్ అవుతున్నాను. నువ్వు నాకు ఎంతో ఇష్టం. మళ్లీ నా జీవితంలోకి తిరిగి రా. నువ్వు లేకుండా నా జీవితం అసంపూర్ణం అవుతుంది” అని ఛార్మి ఆవేదన వ్యక్తం చేసింది. ఈ పోస్టును చూసి చాలా ఛార్మి ఎవరి గురించి బాధ పడుతుందో? అని ఆరా తీస్తున్నారు. నిజానికి ఛార్మి తన పెట్ డాగ్ ను గుర్తు చేసుకుని ఈ పోస్టు పెట్టింది. తను ఇష్టంగా పెంచుకున్న బుజ్జి డాగ్ గురించి రాసుకొచ్చింది. ఆమె అల్లారు ముద్దుగా చూసుకున్న తన పెట్ రెండు సంవత్సరాల క్రితం చనిపోయింది. ఆ విషయాన్ని మరోసారి తలుచుకుంటూ ఈ పోస్టు పెట్టింది. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు ఆమె పెట్ డాగ్ మృతి పట్ల సంతాపాన్ని తెలుపుతున్నారు.
‘డబుల్ ఇస్మార్ట్’ పనుల్లో బిజీ బిజీ
అటు విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్, ఛార్మి కలిసి నిర్మించిన ‘లైగర్’ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా మిగిలింది. ఈ సినిమాకు సంబంధించిన లావాదేవీల విషయంలో ఈడీ కేసులను కూడా ఎదుర్కొన్నారు. ఆ తర్వాత సోషల్ మీడియాకు దూరం అయ్యింది. తాజాగా మళ్లీ యాక్టివ్ అవుతోంది. ప్రస్తుతం ఛార్మి, పూరి జగన్నాథ్ తో కలిసి ‘డబుల్ ఇస్మార్ట్’ అనే సినిమా చేస్తున్నారు. రామ్ పోతినేని హీరోగా తెరకెక్కిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా రూపొందుతోంది.
Read Also: 50 ఏళ్ల వయసులో మాస్టర్స్ డిగ్రీ - భార్య ట్వింకిల్ ఖన్నాకు అక్షయ్ కుమార్ అభినందనలు