Sushmita Konidela Shares Funny Moment In Mega 157 Shooting: మెగాస్టార్ చిరంజీవి స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబో అవెయిటెడ్ మూవీ 'మన శంకర వరప్రసాద్ గారు'. రీసెంట్‌గా హీరోయిన్ నయనతార, చిరంజీవిపై ఓ సాంగ్ షూటింగ్ కూడా పూర్తైంది. అక్కడ జరిగిన ఓ ఫన్నీ మూమెంట్‌ను మూవీ ప్రొడ్యూసర్, మెగాస్టార్ కుమార్తె సుస్మిత కొణిదెల 'కిష్కింధపురి' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో షేర్ చేసుకున్నారు.

Continues below advertisement

ఈవెంట్‌లో యాంకర్ సుమ... 'సుస్మిత గారు మీకేంటంటే భయం మాకు తెలుసుకోవాలని ఉంది. అఫ్ కోర్స్ మన ఆడవాళ్లకు పెద్దగా భయాలుండవు.' అని అడగ్గా.. 'ఎస్ మన భయపెడతాం తప్ప భయపడం.' అని చెప్పారు.

డాడీ స్టెప్ మర్చిపోయారు

Continues below advertisement

అలాగే, 'నాన్న చిరంజీవికి అమ్మంటే చిన్న భయం ఏదైనా ఉంటుందంటారా?' అని అడగ్గా... 'ఇవాళే షూట్‌లో ఓ చిన్న ఇన్సిడెంట్ ఒకటి జరిగింది. మన శంకర వరప్రసాద్ గారు మూవీకి సాంగ్ షూట్ చేస్తున్నాం. మా అమ్మ సురేఖ షూట్‌కు స్పెషల్‌గా వచ్చారు. అప్పటివరకూ డ్యాన్స్ బాగానే చేసిన నాన్న అమ్మ సురేఖ వచ్చి కూర్చునే సరికి స్టెప్ మర్చిపోయారు. అమ్మను చూడడం వల్లే ఆయన స్టెప్ అలా కొంచెం తడబడిందేమే అని అనుకుంటున్నా.' అంటూ నవ్వుతూ చెప్పారు. దీనికి సుమ ఎంత మెగాస్టార్ అయినా భార్య అడుగుపెట్టేసరికల్లా... అంటూ ఫన్ చేశారు. 

Also Read: కట్టె కాలే వరకూ తెలుగు ఫిలిం ఇండస్ట్రీనే నా లైఫ్ - 'కిష్కింధపురి' అసలైన గూస్ బంప్స్ అన్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్

ఇక 'మన శంకర వరప్రసాద్ గారు' (Mana Shankara Vara Prasad Garu) విషయానికొస్తే వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. హిట్ మెషీన్ అనిల్ రావిపూడి అందుకు తగ్గట్లుగానే షెడ్యూల్స్ చేస్తున్నారు. రీసెంట్‌గా 2 సాంగ్స్ షూటింగ్ కంప్లీట్ కాగా... వీటి కోసం స్పెషల్ సెట్ వేశారు. ఈ పాటలు సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమంటూ మేకర్స్ తెలిపారు. చాలా ఏళ్ల తర్వాత మెగాస్టార్ వింటేజ్ లుక్ చూసిన ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. మూవీలో ఆయన రోల్ ఏంటనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. టైటిల్ గ్లింప్స్ బట్టి చూస్తే ఆయన ఓ పవర్ ఫుల్ ఆఫీసర్‌గా కనిపించనున్నట్లు అర్థమవుతోంది. అయితే, డ్రిల్ మాస్టర్‌గా కనిపించనున్నారంటూ గతంలో రూమర్స్ వచ్చాయి. 

మూవీలో చిరు సరసన నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా... వీరితో పాటే కేథరిన్, మురళీధర్ గౌడ్, వీటీవీ గణేష్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. విక్టరీ వెంకటేష్ ఓ స్పెషల్ రోల్‌ చేస్తున్నారు. అక్టోబర్ 5 నుంచి వెంకీ షూటింగ్ షెడ్యూల్‌లో జాయిన్ అవుతారని మేకర్స్ తెలిపారు. ''మన శంకర వరప్రసాద్ గారు' ఈ సంక్రాంతికి వచ్చేస్తున్నారు.' అంటూ వెంకీ వాయిస్‌తో టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేయడం విశేషం. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సుస్మిత కొణిదెల, సాహు గారపాటి నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నారు.