Suriya - Venky Atluri Movie : సూర్య ఫస్ట్ తెలుగు మూవీలో హీరోయిన్ ఫిక్స్ - కొత్త హీరోయిన్‌కు గోల్డెన్ ఛాన్స్

Suriya - Venky Atluri Movie : సూర్య మొదటి తెలుగు సినిమాలో హీరోయిన్ ఫిక్స్ అయ్యిందనే వార్తలు విన్పిస్తున్నాయి. కొత్త హీరోయిన్ ఈ గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిందని అంటున్నారు.

Continues below advertisement

Suriya Venky Atluri Movie Heroine Fix: టాలీవుడ్‌లో స్ట్రాంగ్ మార్కెట్ ఉన్న తమిళ స్టార్ హీరోల్లో సూర్య కూడా ఒకరు. ఆయన డైరెక్ట్ తెలుగు మూవీ గురించి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు అభిమానులు. అయితే తాజాగా సూర్య తొలి తెలుగు మూవీ ఫిక్స్ అయిందన్న వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ మూవీలో సూర్య సరసన నటించబోయే హీరోయిన్ కూడా కన్ఫర్మ్ అయిందనే వార్త వైరల్ అవుతోంది.

Continues below advertisement

సూర్య ఫస్ట్ తెలుగు మూవీలో హీరోయిన్ 
'లక్కీ భాస్కర్' ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య హీరోగా ఓ మూవీ తెరపైకి రాబోతుందని పుకార్లు షికార్లు చేస్తున్న సంగతి తెలిసిందే. సూర్య, వెంకీ అట్లూరి చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జీవి ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ వెలువడే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన కథా చర్చలు నడుస్తుండగా, హీరోయిన్‌ను కన్ఫర్మ్ చేశారని టాక్ నడుస్తోంది. ఆ టాక్ ప్రకారం... సూర్య ఫస్ట్ తెలుగు మూవీలో లక్కీ ఛాన్స్ కొట్టేసిన హీరోయిన్ మరెవరో కాదు భాగ్యశ్రీ బోర్సే. ఫిలింనగర్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ బ్యూటీ ఇప్పటివరకూ ఒక్క హిట్ కూడా కొట్టకుండానే, సూర్యతో నటించే అద్భుతమైన అవకాశాన్ని కొట్టేసిందని తెలుస్తోంది. 

ప్రస్తుతం భాగ్యశ్రీ విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న 'కింగ్డమ్' సినిమాతో పాటు రామ్‌తో మరో కొత్త మూవీ కూడా చేస్తుంది. ఇలాంటి టైంలో సూర్య లాంటి స్టార్ హీరోతో కలిసి నటించే అవకాశం రావడం నిజంగా లక్కీనే. అయితే ఈ మూవీ గనక హిట్ అయితే భాగ్యశ్రీ స్టార్ హీరోయిన్  రేస్‌లో చేరడానికి ఎక్కువ టైం ఏమీ పట్టదు. 

Also Read: 'జాతీయ అవార్డు అందుకోవాలని ఎంతో ఆశగా ఉంది' - సాయిపల్లవి అమ్మమ్మ చీర సెంటిమెంట్ నెరవేరుతుందా?

సూర్య సినిమాలో మరో స్టార్ హీరో కూడా నటిస్తాడని, ఇదొక మల్టీ స్టారర్ అని ప్రచారం జరుగుతోంది. ఇందులో ధనుష్ లేదా దుల్కర్ సల్మాన్‌లను హీరోగా తీసుకోబోతున్నారని ఇన్‌సైడ్ వర్గాల టాక్. ఇప్పటికే వీరిద్దరితో వెంకీ అట్లూరి వర్క్ చేశాడు. కాబట్టి ఎవరో ఒకరిని సెలెక్ట్ చేసుకుంటారని అంటున్నారు. ఇక మరోవైపు ఈ మూవీ దొంగతనం నేపథ్యంలో సాగుతుందనే ఇంట్రెస్టింగ్ వార్తలు వినిపిస్తున్నాయి. సూర్య హీరోగా మనీ హిస్ట్ లాంటి బ్యాంకు దొంగతనం బ్యాక్ డ్రాప్‌లో మూవీ అంటే అంచనాలు పెరగడం ఖాయం. 

వరుసగా తెలుగు దర్శకులతో... 
మరోవైపు సూర్య వరుసగా తెలుగు దర్శకులతో కలిసి పని చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే వెంకీ అట్లూరితో ప్రాజెక్ట్ గురించి పుకార్లు షికార్లు చేస్తుండగా, రీసెంట్‌గా తమిళ్ మూవీతో సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకున్న యంగ్ డైరెక్టర్ చందూ మొండేటి - సూర్య కాంబినేషన్లో మరో మూవీ రాబోతోందని అంటున్నారు. ఇప్పటికే చందూ మొండేటి ఓ పీరియాడిక్ స్టోరీని సిద్ధం చేసి సూర్యకు వినిపించగా, ఈ ప్రాజెక్టు చర్చల దశలో ఉన్నట్టు తెలుస్తోంది.

Also Read: బాలీవుడ్‌లో శ్రీలీల ఫస్ట్ మూవీ - రొమాన్స్ డోస్ పెంచేసిందిగా.. ఫస్ట్ లుక్ చూశారా!

Continues below advertisement