కోలీవుడ్ కథానాయకుడు, పాన్ ఇండియా స్థాయిలో ఫాలోయింగ్ ఉన్న సూర్య (Suriya Sivakumar)తో సినిమా చేసే అవకాశం అందుకున్నారు మలయాళ దర్శకుడు జీతూ మాధవన్ (Jithu Madhavan). మాలీవుడ్ స్టార్ ఫహాద్ ఫాజిల్ హీరోగా 'ఆవేశం', అంతకు ముందు సౌబిన్ షాహిర్ 'రోమాంచితం' తీశారు జీతూ మాధవన్. ఇప్పుడు సూర్య 47 (Suriya 47 Movie)కు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ రోజు చెన్నైలో పూజతో సినిమా మొదలు అయ్యింది. 

Continues below advertisement

సూర్యకు జంటగా నజియా నజీమ్!Naziya Nazim Pairs Up With Suriya: జీతూ మాధవన్ దర్శకత్వంలో సూర్య హీరోగా నటించనున్న సినిమాలో నజియా నజీమ్ హీరోయిన్. తెలుగులో న్యాచురల్ స్టార్ నాని సరసన 'అంటే సుందరానికి' సినిమాలో నటించారు ఆవిడ. అంతకు ముందు ఆర్య 'రాజా రాణీ' కూడా ఆమెకు మంచి గుర్తింపు తెచ్చింది. సూర్య, నజియా నజీమ్ జంటగా నటిస్తున్న మొదటి చిత్రమిది.

Also Read: Suriya 47 Pooja Ceremony Photos: పూజతో మొదలైన సూర్య - నజియా సినిమా... జ్యోతిక నవ్వుల్ చూడండి

Continues below advertisement

సూర్య 47లో 'ప్రేమలు', 'కొత్త లోక' సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన యంగ్ మాలీవుడ్ హీరో నస్లీన్ కె గఫూర్ (Naslen K Gafoor) ఓ కీలక పాత్రలో నటించనున్నారు. ఆయన సైతం పూజకు హాజరు అయ్యారు.

2డీ స్థానంలో సూర్య కొత్త సంస్థ!సూర్య కథానాయకుడు మాత్రమే కాదు... ఆయన నిర్మాత కూడా! ఇంతకు ముందు 2డీ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థను స్థాపించి కొన్ని సినిమాలు నిర్మించారు. అయితే జీతూ మాధవన్ సినిమా కోసం కొత్త నిర్మాణ సంస్థ 'జాగారం స్టూడియోస్' (Zhagaram Studios Suriya) ప్రారంభించారు. ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో సూర్య నటించనున్నారు. ప్రస్తుతం తమిళ దర్శకుడు ఆర్.జె బాలాజీతో 'కరుప్పు', తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరితో మరొక సినిమా చేస్తున్నారు సూర్య.

Also ReadAkhanda 2 Postponed Effect: 'అఖండ 2' వాయిదాను క్యాష్ చేసుకున్న హిందీ సినిమా!