Shobha Raju About Samantha Raj Nidimoru Wedding : స్టార్ హీరోయిన్ సమంత, డైరెక్టర్ రాజ్ నిడిమోరు ఇటీవలే వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్ వద్ద లింగ భైరవి ఆలయంలో అతి కొద్దిమంది, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. ఈ వేడుకకు సమంత ఫ్రెండ్, ఫ్యాషన్ డిజైనర్ శిల్పారెడ్డి హాజరయ్యారు ఇప్పటికే ఫోటోలతో పాటు పలు ఆసక్తికర విషయాలు షేర్ చేశారు. తాజాగా రాజ్‌కు పిన్ని అయిన శోభారాజు మరిన్ని విషయాలు పంచుకున్నారు.
అన్నమాచార్య సంకీర్తనలతో పాటు మ్యూజిక్ డైరెక్టర్‌గా మంచి పేరు సంపాదించుకున్నారు శోభారాజు. 2010లో ఈమెను పద్మశ్రీ పురస్కారం వరించింది. ఈమె అక్క రమాదేవి కొడుకే రాజ్ నిడిమోరు. పెళ్లికి ముందు అప్పటి సంభాషణలు గుర్తు చేసుకుంటూ సమంత గురించి కొన్ని విషయాలు పంచుకున్నారు.
'పక్కన కూర్చోవాలంటే సిగ్గేసింది'
సన్నగా ఉన్న సమంత పక్కన తాను కూర్చోవాలంటే తనకు సిగ్గేసేదని సరదాగా చెప్పారు శోభారాజు. బరువు తగ్గేందుకు సామ్ చెప్పే సూచనలు, సలహాలు ఫాలో కావాలన్నా భయమేసేదని అన్నారు. 'ఫుడ్ విషయంలో సమంత చాలా డిసీప్లీన్‌గా ఉంటుంది. మూడు నెలలకోసారి ఈషా యోగా కేంద్రానికి వెళ్లి ధ్యానం చేస్తుంటుందని ఓ సందర్భంలో విన్నా. ఆ తర్వాత అది నిజమని తేలింది. రాజ్ అంటే నాకు చాలా ఇష్టం. వాడికి స్పిరిచ్యువాలిటీ కూడా ఎక్కువే.
సమంతకు కూడా ఆధ్యాత్మిక మార్గంపై ఆసక్తి ఉంది. రాజ్ లైఫ్‌లోకి సమంత రావడం సంతోషంగా ఉంది. రాజ్ కూడా ఫుడ్, వ్యాయామం, యోగా, ధ్యానం ఇలా అన్నింటిలోనూ క్రమశిక్షణతో ఉంటాడు. బాల్యంలో డివోషనల్ సాంగ్స్ పాడేవాడు. వీరి వివాహ పద్ధతిలో 'క్లేశ నాశన' ఓ భాగం. నేచరల్ పర్ ఫ్యూమ్స్ గిఫ్ట్‌గా ఇచ్చారు. పెళ్లి దుస్తుల్లో సమంత చాలా బాగుంది.' అని చెప్పారు.
Also Read : శశిరేఖ, ప్రసాద్ క్యూట్ లవ్ సాంగ్ - యురేఖా... నిజంగా కేక పుట్టించే లిరిక్స్