ఇండియా వ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా పాన్ ఇండియా సినిమాలే కనిపిస్తున్నాయి. ఏమాటకామాట ఏదేమైనా కరోనా తర్వాత సినిమా ఇండస్ట్రీలో భాషా భేదాలు తగ్గాయనే చెప్పాలి. అదీ ఇదీ అని లేకుండా కంటెంట్ ఉంటే ఏ భాష సినిమా అయినా చూసేస్తున్నారు మూవీ లవర్స్. కొన్ని సినిమాను పాన్ ఇండియాను దృష్టిలో ఉంచుకొని భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంటే మరికొన్ని సినిమాలు తక్కువ బడ్జెట్ తో తెరకెక్కి భారీ హిట్ ను అందుకున్న తర్వాత మిగిలిన భాషల్లో కూడా విడుదల చేస్తున్నారు. అందుకే ఇప్పుడు అందరూ పాన్ ఇండియా సినిమాల మీద దృష్టి పెడుతున్నారు. తెలుగులో ‘బాహుబలి’ లాంటి సినిమాల తర్వాత పాన్ ఇండియా సినిమాలకు క్రేజ్ మొదలైందనే చెప్పొచ్చు. అంతగా ఈ సినిమా దేశవ్యాప్తంగా సక్సెస్ ను అందుకుంది. ఈ సినిమా తర్వాత అనేక పాన్ ఇండియా సినిమాలు అన్ని భాషల్లోనూ వస్తున్నాయి. తాజాగా తమిళ స్టార్ నటుడు సూర్య కూడా ఓ పాన్ ఇండియా సినిమా చేయడానికి రెడీ అయిపోయారు.


తమిళ దర్శకుడు శివ దర్శకత్వంలో సూర్య ‘సూర్య 42’(ఇంకా పేరు పెట్టని) సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఈ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ సినిమా ‘ఆర్ఆర్ఆర్’, ‘కేజీఎఫ్’, ‘బాహుబలి’ సినిమాల తరహాలో ఉంటుందని చెప్పుకొచ్చారు. అయితే ఈ మూవీలో సూర్య ఓ యోధుడి పాత్రలో కనిపించనున్నారని, 16 వ శతాబ్దానికి చెందిన ఓ కథాంశంతో మూవీ తెరకెక్కనుందని చెప్పారు. బడ్జెట్ విషయంలో సూర్య ఇప్పటి వరకూ నటించిన సినిమాల బడ్జెట్ కంటే రెండింతలు ఎక్కువే ఉంటుదని చెప్పుకొచ్చారు. తెలుగు నుంచి ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ కన్నడ నుంచి ‘కేజీఎఫ్’ సినిమాలు చూశారని, ఇప్పుడు సూర్య వంతు వచ్చిందని చెప్పారు. ఆ సినిమాల స్థాయికి ‘సూర్య 42’ ఏ మాత్రం తగ్గదని తెలిపారు. ఎందుకంటే ఈ సినిమా విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని అన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి.


వాస్తవానికి నటుడు సూర్య కు తమిళ్ తో పాటు ఇతర భాషల్లోనూ మంచి గుర్తింపు ఉంది. ఆయన అన్ని సినిమాలు తెలుగులో కూడా విడుదల అవుతూ ఉంటాయి. ఆయన ఈ మధ్య కాలంలో నటించిన ‘జైభీమ్’, ‘విక్రమ్’ సినిమాల్లో ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది. దీంతో సూర్య పాన్ ఇండియా బాగానే వర్కౌట్ అవుతుందని అంచనా వేస్తున్నారు మేకర్స్. ఈ సినిమాను 10 భాషల్లో రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. సినిమా ప్రమోషన్స్ ను కూడా భారీ స్థాయిలో చేయడానికి ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. తమిళ్ లో ఇదే భారీ బడ్జెట్ సినిమా అని టాక్ కూడా నడుస్తోంది. మూవీ ‘ఆర్ఆర్ఆర్’ ‘కేజీఎఫ్’ ల తరహా లో ఉంటుదని ప్రచారం చేస్తున్నారు. మరి ఆ రేంజ్ లో సినిమా ఉంటుందో లేదో చూడాలి అంటే ఇంకొన్నాళ్లు వేచి చూడాల్సిందే. అయితే సినిమాకు సంబంధించి పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు మేకర్స్.


Read Also: ఇండస్ట్రీలో నానికి పోటీనిచ్చే హీరో లేడట! ‘దసరా’ బాగా తీయలేదంటూ నేచురల్ స్టార్ వ్యాఖ్యలు