Sunisith Apologies to Upasana : సునిశిత్‌ను చితకబాదిన మెగా ఫ్యాన్స్ - ఉపాసనకు సారీ

యూట్యూబ్ ఇంటర్వ్యూల్లో సంచలన వ్యాఖ్యలు చేసే సునిశిత్ మీద మెగా ఫ్యాన్స్ ఎటాక్ చేశారు. అతడితో ఉపాసనకు క్షమాపణలు చెప్పించారు. ఎందుకంటే?

Continues below advertisement

సాక్రిఫైజింగ్ స్టార్ సునిశిత్ (Sunisith)... యూట్యూబ్ ఇంటర్వ్యూస్ & మీమ్స్ ఫాలో అయ్యే ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. స్టార్ హీరోలు, వాళ్ళ కుటుంబ సభ్యులు, పేరున్న రాజకీయ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఫేమ్ తెచ్చుకునే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు అతనికి మెగా అభిమానులు  దేశశుద్ధి చేశారు. అతను ఎక్కడ ఉన్నాడో తెలుసుకుని మరీ చితకబాదారు. ఎందుకు? ఏమిటి? అనే వివరాలోకి వెళితే... 

Continues below advertisement

ఉపాసనతో గోవా వెళ్ళాను!
ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన సునిశిత్ తనకు ఉపాసన కొణిదెల (Upasana Konidela) క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పుకొచ్చాడు. అంతే కాదు... ఆమెతో కలిసి లాంగ్ డ్రైవ్ కి వెళ్ళానని పేర్కొన్నాడు. 

''ఉపాసనకు ఆడి ఎలక్ట్రిక్ వెహికల్ ఉంది. ఒకసారి నేను, ఉపాసన కలిసి గోవా వెళ్ళి వచ్చాం'' అని సునిశిత్ సంచనల వ్యాఖ్యలు చేశారు. అతడిని ఇంటర్వ్యూ చేసే అమ్మాయి... ''ఇప్పుడు అభిమానులు వచ్చి కొట్టినా కొడతారు. అవన్నీ ఎందుకు లేండి'' అని ఆ మాటలకు అడ్డుకట్ట వేయబోతే ''ఏం కొట్టరు. ఎందుకు అంటే... రామ్ చరణ్ నాకు ఫ్రెండ్. ఒకసారి ఉపాసనతో చాట్ చేస్తుంటే అతనే చేయమని, ప్రేమలో పడేయమని ఫ్రెండ్లీగా చెప్పాడు'' అని సునిశిత్ కంటిన్యూ చేశాడు. మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుస్మితా కొణిదెలతో కూడా లాంగ్ డ్రైవ్ కి వెళ్లినట్లు చెప్పుకొచ్చాడు. 

మెగా ఫ్యామిలీ మీద సునిశిత్ కామెంట్స్ చేయడంతో అభిమానులు ఆగ్రహావేశాలకు గురి అయ్యారు. 'మా వదిన మీద కామెంట్స్ చేస్తావా?' అంటూ అతడిని గట్టిగా కొట్టారు. అతడి చేత ఉపాసనకు క్షమాపణలు చెప్పించారు.  

నేను తప్పుడు వ్యాఖ్యలు చేశా! - సునిశిత్
''నమస్తే అండీ! నా పేరు సునిశిత్! నేను ఒక ఛానల్ ఇంటర్వ్యూలో నేను తప్పుడు వ్యాఖ్యలు చేశా. నాది పొరపాటు. ఇంకోసారి ఇటువంటి తప్పుడు వ్యాఖ్యలు చేయను. ఆ విధంగా మాట్లాడినందుకు బాధ పడుతున్నాను'' అని సునిశిత్ క్షమాపణలు చెప్పారు. 

Also Read 'న్యూసెస్' వెబ్ సిరీస్ రివ్యూ : జర్నలిస్టులు డబ్బుకు దాసోహం అయితే?

ఒక సమయంలో యూట్యూబ్ అంతా సునిశిత్ వీడియో ఇంటర్వ్యూలే కనిపించేవి. లావణ్యా త్రిపాఠికి, తనకు పెళ్లి అయ్యిందని... శృతి హాసన్ తనతో కొన్నాళ్ళు డేటింగ్ చేసిందని... 'పుష్ప'లో హీరోగా సుకుమార్ ముందు తనను సెలెక్ట్ చేస్తే అల్లు అర్జున్ ఆ అవకాశాన్ని తనకు దక్కకుండా లాక్కున్నాడని... ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్ తనను తొక్కేస్తున్నారని, చిరంజీవితో మందు కొడతానని... ఒక్కటి కాదు, నోటికి ఇష్టం వచ్చినది వచ్చినట్లు వాగడం సునిశిత్ స్టైల్.

సునిశిత్ మతిస్థిమితం సరిగా లేదని పరిశ్రమ ప్రముఖులతో పాటు ప్రేక్షకులు కూడా భావించారు. చాలా మంది స్టార్స్ అతడిని లైట్ తీసుకున్నారు. ఒకరు ఇద్దరు అయితే కేసులు పెట్టారనుకోండి. అది వేరే విషయం! ఇప్పుడు ఈ సునిశిత్ ప్రస్తావన ఎందుకు అంటే... ఆ మధ్య మంచు బ్రదర్స్ మధ్య జరిగిన గొడవలో అతడు వేలు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. 'విష్ణు... నువ్వు ఇంక మారావా?' అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 

Also Read బోయపాటి మాస్ లుక్‌లో రామ్ పోతినేని - భారీ ప్లాన్ బాసూ!

Continues below advertisement