Sunil Mollywood Debut - Turbo Movie : తెలుగు ప్రేక్షకులకు సునీల్ అంటే చాలా ఇష్టం! ఎందుకంటే... సిల్వర్ స్క్రీన్ మీద ఆయన అంత అలా ఎంటర్టైన్ చేశారు. వెండితెరపై విపరీతంగా నవ్వులు పంచారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ వరకు సునీల్ మొదట ఓ హాస్య నటుడు. కొన్నేళ్ల పాటు కామెడీతో కితకితలు పెట్టారు. అయితే... కమెడియన్ నుంచి హీరోగా సునీల్ టర్న్ తీసుకున్నారు. హీరో అనిపించుకోవడం కోసం సిక్స్ ప్యాక్ చేశారు కథానాయకుడిగా కొన్ని సినిమాలు చేసిన తర్వాత మళ్లీ కమెడియన్ క్యారెక్టర్ల వైపు తిరిగి చూశారు. అయితే సునీల్ యాక్టింగ్ జర్నీలో పుష్ప పెద్ద మార్పు తీసుకు వచ్చింది.


సునీల్ గెటప్ నుంచి యాక్టింగ్ వరకు ప్రతి విషయంలోనూ ఓ మార్పు చూపించారు లెక్కల మాస్టారు సుకుమార్. 'పుష్ప' సినిమాతో సునీల్ నటనలో కొత్త కోణాన్ని బయటకు తీసుకు వచ్చారు వచ్చారు క్రియేటివ్ జీనియస్ సుక్కు. దాంతో ఇప్పుడు తమిళ, మలయాళ దర్శక రచయితలు సునీల్ వెంట పరుగులు తీస్తున్నారు. తమ సినిమాలలో సునీల్ కోసం ప్రత్యేకంగా కొత్త కొత్త క్యారెక్టర్లు డిజైన్ చేయిస్తున్నారు  అక్కడి హీరోలు, నిర్మాతలు.


సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడుగా నటించిన భారీ బ్లాక్ బస్టర్ సినిమా 'జైలర్'లో సునీల్ క్యారెక్టర్ ప్రేక్షకులు అందరినీ ఎంటర్టైన్ చేసింది. అయితే ఆ సినిమా కంటే ముందు శివ కార్తికేయన్ హీరోగా నటించిన 'మావీరన్' (తెలుగులో మహావీరుడు పేరుతో విడుదల అయింది) సినిమాతో తమిళ చలన చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. ఇప్పుడు మలయాళ చిత్ర పరిశ్రమకు సునీల్ పరిచయం అవుతున్నారు.


మెగాస్టార్ మమ్ముట్టి 'టర్బో'లో సునీల్!
మలయాళ చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయకుడు, మెగాస్టార్ మమ్ముట్టి హీరోగా నటిస్తున్న తాజా సినిమా 'టర్బో'. అందులో సునీల్ కీలక పాత్రలో నటిస్తున్నట్లు శుక్రవారం వెల్లడించారు. వైశాఖ దర్శకత్వం వహిస్తున్న 'టర్బో' సినిమాపై మలయాళ పరిశ్రమలో మంచి అంచనాలే ఉన్నాయి. వాటికి తోడు మమ్ముట్టి సినిమా కావడంతో సునీల్ మాలీవుడ్ ఎంట్రీ ఘనంగా ఉంటుందని చెప్పవచ్చు.


Also Read శ్రీదేవి టు జయసుధ - స్టార్ హీరోయిన్లకు ఫస్ట్ హీరో చంద్ర మోహనే... ఆయన పక్కన నటిస్తే టాప్‌ హీరోయిన్‌ పొజిషన్‌ గ్యారంటీ






గెటప్ మారుతుందా? సేమ్ ఉంటుందా?'టర్బో' సినిమాలో అయినా సరే సునీల్ గెటప్ మారుతుందా? లేదంటే 'పుష్ప' తర్వాత నుంచి తమిళ సినిమాల్లో కనిపిస్తున్నట్లు ఆ బాల్డ్ గెటప్ ఉంటుందా? అని తెలుగులో ఆయన అభిమానులు డిస్కస్ చేసుకుంటున్నారు. 'పుష్ప'లో సునీల్ ఎలా కనిపించారో... తమ సినిమాల్లో కూడా అటువంటి గెటప్ ఉండేలా తమిళ దర్శకులు జాగ్రత్తలు తీసుకున్నారు. 


Also Read : మరణించిన మూడో రోజున చంద్రమోహన్ అంత్యక్రియలు - రెండు రోజులు ఆలస్యానికి కారణం ఏమిటంటే?



ఇప్పుడు తెలుగులో కూడా సునీల్ బిజీ బిజీ. 'పుష్ప : ది రూల్' (Pushpa The Rule) సినిమాలో నటిస్తున్నారు. అది కాకుండా మరో నాలుగైదు సినిమాలు ఉన్నాయి. చిన్న చిన్న సినిమాల్లో క్యారెక్టర్లు వచ్చినా వద్దనకుండా చేయడంతో ఆయన చేతిలో ఎప్పుడూ సినిమాలు ఉంటున్నాయి.