Janaka Aithe Ganaka Teaser Is Out Now: ఈరోజుల్లో చాలావరకు యంగ్ హీరోలు డిఫరెంట్ కంటెంట్ ఉన్న కథలను మాత్రమే కాకుండా ఎక్కువమంది ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే చిత్రాలను ఎంచుకోవడంలోనే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. అలాంటి హీరోల్లో సుహాస్ కూడా ఒకడు. తన సినిమా కథలు ఎక్కువశాతం ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా ఉంటాయి. దాంతో పాటు తన యాక్టింగ్ కూడా చాలా బాగుంటుందని ఇప్పటికే గుర్తింపు సాధించుకున్నాడు. అందుకే బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. తాజాగా తన అప్‌కమింగ్ మూవీ ‘జనక అయితే గనక’ టీజర్ విడుదలయ్యింది.
మిడిల్ క్లాస్..
తనకు వచ్చిన గుర్తింపు క్యాష్ చేసుకోవాలని బ్యాక్ టు బ్యాక్ చిత్రాలను ఓకే చేస్తున్నాడు సుహాస్. ప్రస్తుతం తన చేతిలో దాదాపు అరడజను సినిమాలు ఉన్నాయి. అందులో ‘జనక అయితే గనక’ కూడా ఒకటి. సందీప్ బండ్లా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీకి సంబంధించిన టీజర్ తాజాగా విడుదలయ్యింది. ఈ టీజర్ చూస్తుంటే మరోసారి ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యే కథతో సుహాస్ వస్తున్నాడని అర్థమవుతుంది. ‘‘ఆ ఒక్క నిర్ణయం నా లైఫ్‌ను మార్చేసింది’’ అంటూ సుహాస్ చెప్పే డైలాగ్‌తో ‘జనగ అయితే గనక’ టీజర్ మొదలవుతుంది. ఇందులో సుహాస్ ఒక స్కూటర్ మీద తిరిగే మిడిల్ క్లాస్ ఉద్యోగిగా కనిపిస్తాడు.
బెస్ట్ ఇవ్వాలి..
ఆర్థికంగా చాలా కష్టాల్లో ఉంటాడు సుహాస్. ‘‘నేను ఒకవేళ తండ్రినైతే నా పిల్లలను సిటీలో ఉన్న బెస్ట్ హాస్పిటల్‌లో చూపించాలి. నా పిల్లలను బెస్ట్ స్కూల్‌లో చదివించాలి. బెస్ట్ కాలేజ్‌లో చదివించాలి. వాళ్లకు బెస్ట్ లైఫ్ ఇవ్వాలి. బెస్ట్ ఇవ్వలేనప్పుడు పిల్లలను కనకూడదు’’ అని సుహాస్ చెప్పే డైలాగ్‌తో తనకు పెళ్లి అయినా కూడా ఇంకా పిల్లలు లేరనే క్లారిటీ వస్తుంది. కానీ వాళ్ల బామ్మ మాత్రం సుహాస్‌కు పిల్లలు పుట్టాలని పూజలు చేస్తుంటుంది. ‘‘ఏంట్రా నీ ప్రాబ్లమ్ పిల్లలంటే పారిపోతావు’’ అంటూ సుహాస్ తండ్రి తనను ప్రశ్నిస్తాడు. అప్పుడే సుహాస్.. ‘‘నా చదువుకు నువ్వు ఎంత ఖర్చుపెట్టావు. నువ్వు పెద్ద ఆలోచించే నెంబర్ ఏం కాదు. అటు ఇటుగా రౌండ్ ఫిగర్ 25 వేలు పెట్టుంటావు’’ అంటూ తన తండ్రిని ఒక స్మశానవాటిక దగ్గరకు తీసుకెళ్తాడు సుహాస్.
డిఫరెంట్ టైటిల్..
‘‘స్మశానానికి ఎందుకు తీసుకొచ్చావు, ఎవరు పోయారు’’ అని తండ్రి అడగగా.. ‘‘ఆ ఫీజులు అన్ని కట్టేలోపు నేనే పోతాను’’ అంటాడు. అక్కడే ఉన్న వ్యక్తిని అంత్యక్రియలు ఎంత ఖర్చు అవుతుంది అని అడుగుతాడు. అప్పుడు అతడు రూ.70 వేలు అని సమాధానమిస్తాడు. అది విన్న సుహాస్ తండ్రి ‘‘రూ.70 వేలు అంటే LKG కంటే తక్కువే’’ అంటాడు. చివర్లో జడ్జి పాత్రలో రాజేంద్ర ప్రసాద్, హీరో ఫ్రెండ్‌గా వెన్నెల కిషోర్ కనిపించడంతో ‘జనక అయితే గనక’ టీజర్ ముగుస్తుంది. టైటిల్ చూసి ఇది చాలా డిఫరెంట్‌గా ఉంది అనుకున్నవాళ్లకి టీజర్ చూస్తే సినిమా కాన్సెప్ట్‌పై క్లారిటీ వచ్చేస్తుంది. ఈరోజుల్లో పిల్లల చదువుకు అయ్యే ఖర్చుపై సెటైరికల్‌గా చిత్రాన్ని తెరకెక్కించాడు సందీప్ బండ్లా.
Also Read: నెటిజన్ నుంచి శృతి హాసన్‌కి అలాంటి ప్రశ్న - ఇలాంటి చెత్త ప్రశ్నలు అడగడం మానేయండి..