Suhas Clarified On Mandaadi Speculated Rumours: టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ (Suhas).. 'మండాడి' మూవీతో తమిళంలో ఎంట్రీ ఇవ్వనున్నారు. ఈ సినిమాలో ఆయన విలన్ రోల్ చేస్తుండగా.. తాజాగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ ఆకట్టుకుంటోంది. అటు కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్ ఆడియన్స్ సైతం ఆయన డిఫరెంట్ మాస్ లుక్‌కు ఫిదా అవుతున్నారు. అయితే, ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో రానుండగా.. తెలుగులో రోల్స్‌పై పలు రూమర్స్ హల్చల్ చేశాయి.
సుహాస్ క్లారిటీ
'మండాడి' (Mandaadi) మూవీపై వస్తోన్న రూమర్లపై సోషల్ మీడియా వేదికగానే సుహాస్ క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా తెలుగు వెర్షన్‌లో తాను హీరోగా నటిస్తున్నట్లు వస్తోన్న వార్తలపై క్లారిటీ ఇచ్చారు. 'నా రాబోయే తమిళ చిత్రం 'మండాడి' గురించి ఓ చిన్న వివరణ. ఇది తెలుగులో కూడా రిలీజ్ అవుతుంది. ఈ సినిమాలో నేను విలన్ రోల్ మాత్రమే చేస్తున్నాను. సూరి అన్న హీరోగా నటిస్తున్నారు. స్ప్రెడ్ అవుతున్న రూమర్లలో ఎలాంటి నిజం లేదు.' అని తెలిపారు. దీంతో సూరి హీరోగా.. సుహాస్ విలన్‌గా చేస్తున్నారని ఫుల్ క్లారిటీ వచ్చింది. మహిమా నంబియార్ హీరోయిన్‌గా కనిపించనున్నారు.
Also Read: టూరిస్ట్ బస్సులో మోహన్ లాల్ హిట్ మూవీ 'తుడరుమ్' - సైబర్ పోలీసులకు ప్రొడ్యూసర్ కంప్లైంట్
ఆ రూమర్స్ ఏంటంటే?
ఈ సినిమా తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కుతుండగా.. తమిళంలో సూరి హీరో.. విలన్‌గా సుహాస్ చేస్తున్నారని.. తెలుగులో హీరోగా సుహాస్.. విలన్‌గా సూరి నటించనున్నారని రూమర్స్ వినిపించాయి. ప్రతీ సీన్ రెండు వెర్షన్లలో తీస్తారనే టాక్ వినిపించింది. ఇది నిజం కాదని.. తాను విలన్‌గా చేస్తున్నానని.. హీరోగా సూరి అన్న చేస్తున్నారని క్లారిటీ ఇచ్చారు సుహాస్.
ఫస్ట్ లుక్ అదుర్స్
నెరిసిన జుట్టు, గుబురు గెడ్డం, లుంగీ ధరించి జెర్సీ వేసుకుని 'సునామీ రైడర్స్' బృందంతో సముద్ర తీరంలో ఉన్న సుహాస్ డిఫరెంట్ మాస్ లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది. మరో పోస్టర్‌లో సూరి, సుహాస్ ఇద్దరూ చెరో పడవ నడుపుతూ కోపంగా కనిపించడం ఇంట్రెస్ట్ పెంచేసింది. స్పోర్ట్ బ్యాక్ డ్రాప్ ప్రధానాంశంగా ఈ సినిమా తెరకెక్కనున్నట్లు పోస్టర్‌ను బట్టి అర్థమవుతోంది.
ఈ సినిమాకు 'సెల్ఫీ' ఫేం మథిమారన్ పుగళేంది దర్శకత్వం వహిస్తుండగా.. సుహాస్‌తో పాటు సత్యరాజ్, కేజీఎఫ్, కాంతార విలన్ అచ్యుత్ వంటి నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆర్ఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత ఎల్రెడ్ కుమార్ తన 16 ప్రాజెక్టుగా 'మండాడి' నిర్మిస్తుండగా.. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం వహిస్తున్నారు. ఇక సుహాస్ లేటెస్ట్ మూవీ 'ఓ భామ అయ్యో రామ' ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతోనే మలయాళ బ్యూటీ మాళవిక మనోజ్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్నారు.