Mohanlal Thurdarum Movie Played Illegally In Tourist Bus: ఇటీవల కొత్త సినిమాలను పైరసీ భూతం వెంటాడుతోంది. నాగచైతన్య తండేల్ మూవీ నుంచి రీసెంట్ బ్లాక్ బస్టర్ నాని 'హిట్ 3' వరకూ ఆన్ లైన్ లీక్స్ బారిన పడ్డాయి. తాజాగా.. మలయాళ స్టార్ మోహన్ లాల్ (Mohanlal) రీసెంట్ బ్లాక్ బస్టర్ 'తుడరుమ్' (Thudarum) సైతం పైరసీ బారిన పడింది. ఓ టూరిస్ట్ బస్సులో ఈ మూవీని ప్రదర్శించగా.. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

సైబర్ పోలీసులకు ప్రొడ్యూసర్ కంప్లైంట్

కేరళ మలప్పురానికి చెందిన ఓ టూరిస్ట్ బస్సులో 'తుడరుమ్' (Thudarum) మూవీ పైరసీని ప్రదర్శించారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నిర్మాత ఎం.రంజిత్ చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతూ.. సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేరళ మంత్రి సాజిచెరియన్ స్పందిస్తూ.. సరైన ఆధారాలు చూపితే కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

Also Read: మెగా ఫ్యామిలీ నుంచి గుడ్ న్యూస్ వచ్చేసింది - ఫోటోతో విషయం చెప్పిన వరుణ్ తేజ్ - లావణ్య దంపతులు

రికార్డు కలెక్షన్లు

'తుడరుమ్' మూవీకి తరుణ్ మూర్తి దర్శకత్వం వహించగా.. రెజపుత్ర విజువల్ మీడియా బ్యానర్‌పై ఎం.రంజిత్ నిర్మించారు. మోహన్ లాల్ సరసన సీనియర్ నటి శోభన (Shobana) నటించారు. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కిన మూవీలో మోహన్ లాల్.. ఓ సాధారణ భర్తగా, ట్యాక్సీ డ్రైవర్‌గా నటించారు. భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ రికార్డు కలెక్షన్లు సాధించింది. 

రిలీజ్ అయిన ఫస్ట్ రోజు నుంచే హౌస్ ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతోన్న ఈ మూవీ 11 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.160 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. కేవలం ఇండియాలోనే రూ.75 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ముఖ్యంగా మలయాళంలో అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రాల జాబితాలో చేరింది. దాదాపు 38 ఏళ్ల తర్వాత మోహన్ లాల్, శోభన జంటగా నటించి మెప్పించారు. మోహన్ లాల్ వరుసగా బ్లాక్ బస్టర్స్ అందుకుంటూ ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఇటీవలే విడుదలైన 'ఎల్ 2: ఎంపురాన్' సైతం బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లు రాబట్టింది. దీంతో ఆయన ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.