సుహాస్ (Suhas)పై, ఆయన ఎంపిక చేసుకునే కథలపై ప్రేక్షకులలో మంచి నమ్మకం ఏర్పడింది. హీరోగా పరిచయమైన 'కలర్ ఫోటో' నుంచి మొదలు పెడితే... ఆ తర్వాత చేసిన 'రైటర్ పద్మభూషణ్', 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్', 'ప్రసన్న వదనం', 'జనక అయితే గనక' సినిమాలతో డిఫరెంట్ కంటెంట్ బేస్డ్ సినిమాలు చేశారు. ప్రామిసింగ్ స్టార్ అనిపించుకున్నారు. 


హీరోగా తనకంటూ ఒక స్పేస్ క్రియేట్ చేసుకున్నారు సుహాస్. అయితే... ఈ స్పేస్, ప్రేక్షకులలో నమ్మకం ఒక్క రోజులో రాలేదు. దీని వెనుక కొన్నేళ్ల కష్టం ఉంది. ఈ రోజు ఈ స్థాయికి రావడానికి పునాది యూట్యూబ్‌లో పడింది. తొలుత సుహాస్ షార్ట్ ఫిలిమ్స్ చేసిన సంగతి తెలిసిందే. అక్కడ నుంచి సినిమాల్లోకి వచ్చారు. హీరో కావడానికి ముందు కొన్ని సినిమాల్లో హీరో ఫ్రెండ్ రోల్స్ చేశారు. ఆ సినిమాలు ఏమిటి? ఆ క్యారెక్టర్లు ఏమిటి? అనేది ఒక్కసారి చూడండి. 


రష్మిక సిక్స్ కొడితే... సుహాస్ సర్‌ప్రైజ్!
'లిల్లీ సిక్స్ కొట్టిందిరా...' - 'డియర్ కామ్రేడ్'లో సుహాస్ చెప్పిన డైలాగ్ పాపులర్. కానీ ఆ వాయిస్ వినిపించే సమయంలో స్క్రీన్ మీద అతని ఫేస్ కనిపించదు. రష్మిక సిక్స్ కొట్టడం, తర్వాత విజయ్ దేవరకొండ ఎక్స్‌ప్రెషన్స్ కనిపిస్తాయి. తర్వాత సుహాస్ కనిపిస్తారు. అదొక్కటే కాదు... 'డియర్ కామ్రేడ్'లో చాలా సన్నివేశాల్లో సుహాస్ తన ఉనికి చాటుకున్నారు.



కామ్రేడ్‌కు ముందు పడి పడి లేచే మనసులో!
సుహాస్ సిల్వర్ స్క్రీన్ డెబ్యూ 'డియర్ కామ్రేడ్' కాదు! శర్వానంద్, సాయి పల్లవి జంటగా నటించిన 'పడి పడి లేచే మనసు'. అందులో హీరో స్నేహితులతో సుహాస్ ఒకరు. ప్రియదర్శి అండ్ గ్యాంగులో ఉంటారు. అందులో సుహాస్ కొన్ని డైలాగ్స్ చెప్పారు. అయితే పెద్దగా రిజిస్టర్ కాలేదు.


నాగ చైతన్య 'మజిలీ'తో నటుడిగా మేలు మలుపు!
నటుడిగా సుహాస్ (Suhas Movies As Character Artist)కు మంచి గుర్తింపు, పేరు తెచ్చిన సినిమా అయితే 'మజిలీ'. అందులో అక్కినేని నాగ చైతన్య స్నేహితుడిగా సుహాస్ కనిపిస్తారు. స్కూల్ నుంచి కాలేజీ వరకు, తర్వాత జీవితంలో... వివిధ దశల్లో సాగే కథలో సుహాస్ క్యారెక్టర్ కూడా ఉంటుంది. చైతూతో పాటు లుక్ పరంగా సుహాస్ కూడా వేరియేషన్ చూపించారు.


Also Readరాజమౌళిని హీరో చేయాలనుకున్న పెదనాన్న... బాలకృష్ణుడిగా జక్కన్న... శివ‌శ‌క్తి ద‌త్తా దర్శకత్వంలో ఆగిపోయిన మైథ‌లాజిక‌ల్ మూవీ ఏదో తెలుసా?



కామెడీతో పండగ... సాయి దుర్గా తేజ్ సినిమాలో!
సుహాస్ కామెడీ టైమింగ్ స్క్రీన్ మీదకు బాగా తీసుకు వచ్చిన సినిమా 'ప్రతిరోజూ పండగే'. అమెరికా నుంచి రాజమండ్రి వచ్చిన హీరో సాయి దుర్గా తేజ్ తోడుగా ఉండే క్యారెక్టర్ చేశారు సుహాస్. 'నీ లవ్ స్టోరీని గౌతమ్ మీనన్ టైపులో చిన్న థ్రెడ్ పట్టుకుని సాగదీయలేం...' అంటూ ట్రైలర్‌లో అతడి డైలాగ్‌కు చోటు ఇచ్చారు దర్శకుడు మారుతి. సుహాస్ పాత్రతో మంచి వినోదం పండించారు.



'కలర్ ఫోటో'తో హీరోగా మారిన సుహాస్... దానికి ముందు సత్యదేవ్ 'ఉమా మహేశ్వర ఉద్రరూపస్య', నవీన్ పోలిశెట్టి 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' సినిమాల్లో యాక్ట్ చేశారు. నితిన్ 'రంగ్ దే'లోనూ నటించారు. అడివి శేష్ 'హిట్ 2'లో విలన్ రోల్ చేశారు. ఇప్పుడు తమిళ సినిమా 'మండాడి'లోనూ నెగెటివ్ షేడ్ ఉన్న రోల్ చేస్తున్నట్లు సమాచారం.


Also Readపాన్ ఇండియా బాక్సాఫీస్ మీద టాలీవుడ్ దండయాత్ర - 2025 సెకండాఫ్‌లో ప్రతి నెల రెండు భారీ సినిమాలు... స్టార్ హీరోల సినిమా రిలీజ్ డేట్స్ లిస్ట్ ఇదిగో