Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ నెక్ట్స్ చిత్రానికి సంబంధించి మేకర్స్ ఓ క్రేజీ అప్ డేట్ ను వదిలారు. 'పాగల్' ఫేమ్ దర్శకుడు నరేష్ కుప్పిలి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా టైటిల్ ను సుడిగాలి సుధీర్ పుట్టినరోజు (మే 20) సందర్భంగా విడుదల చేశారు. దాంతో పాటు మూవీకి సంబంధించి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు.


Sudigali Sudheer New Movie : సుధీర్ బర్త్ డే హీరోగా రాబోతున్న ఈ సినిమాకు "GOAT" -GreatestOfAllTimes అనే టైటిల్ ను మేకర్స్ ఫిక్స్ చేశారు. ఈ సందర్భంగా రిలీజైన పోస్టర్ లో సుధీర్ సిగెరెట్ తాగుతూ... పొగను వదులుతుండగా... అతని ఫొటో కింద G.O.A.T అనే టైటిల్ రెడ్ కలర్ లో ఉంది. దాంతో పాటు గాజా, బిందు అనే పేర్ల మధ్య లవ్ సింబల్ తో పోస్టర్ పై అక్కడక్కడా కనిపిస్తోంది. No Rules, FLAMES, Challenge Accepted లాంటి పదాలు కూడా ఈ పోస్టర్ పై చూడవచ్చు. వీటితో హీరోకు ఏదో సంబంధం ఉందని ఈ పోస్టర్ ను బట్టి తెలుస్తోంది. ఈ ఇంట్రస్టింగ్ ఫస్ట్ లుక్ పై సుధీర్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


లక్కీ మీడియా, మహాతేజా క్రియేషన్స్ బ్యానర్స్ పై తెరకెక్కుతోన్న ఈ సినిమాలో సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తుండగా... దివ్య భారతి హీరోయిన్ గా నటిస్తోంది. చంద్ర శేఖర్ రెడ్డి మొగుళ్ళ, బెక్కం వేణుగోపాల్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ 'G.O.A.T - Greatest Of All Times' చిత్రం మంచి కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు తెలుస్తోంది. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుందని, సుడిగాలి సుధీర్ బర్త్ డే రోజున తమ "GOAT" సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ ను విడుదల చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని నిర్మాతలు చెప్పారు. తాము విడుదల చేసిన ఫస్ట్ లుక్.. విడుదల చేసిన కొద్ది నిమిషాల్లోనే ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాండ్ రావడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు. సినిమాకు తగ్గట్టే లియో మంచి మ్యూజిక్ అందిస్తున్నాడన్నారు. మంచి కథతో వస్తోన్న తమ సినిమాను ప్రేక్షకులందరూ సపోర్ట్ చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని ఈ సందర్భంగా వారు కోరారు. 






ఇలాంటి మంచి కాన్సెప్ట్ ఉన్న కథను చేసే అవకాశం ఇచ్చిన నిర్మాతలకు  ధన్యవాదాలని దర్శకుడు నరేష్ కుప్పిలి అన్నారు. ఈ సినిమా షూటింగ్ విషయంలో తమకు ఏది కావాలన్నా బడ్జెట్ విషయంలో ఎక్కడా కంప్రమైజ్ కాకుండా నిర్మిస్తున్నారని చెప్పారు. హీరో, హీరోయిన్ లు ఇద్దరూ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారన్న ఆయన.. లియో మాకు మంచి మ్యూజిక్ ఇచ్చారని తెలిపారు. మంచి కథతో వస్తున్న తమ సినిమాను ప్రేక్షకులందరూ ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని డైరెక్టర్ అన్నారు.


Also Read ఎన్టీఆర్ కాకుండా మరో హీరో అయితే 'టెంపర్' క్లైమాక్స్, 'కొమురం భీముడో' సాంగ్ చేసేవారా?


ఇక 'గాలోడు' సినిమాతో విజయం తర్వాత "G.O.A.T" ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సుడిగాలి సుధీర్.. ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఆయన ఫ్యాన్స్ కూడా ఈ సినిమా సుధీర్ కు మంచి విజయాన్ని తెచ్చి పెడుతుందని ఆకాంక్షిస్తున్నారు.


Read Also : కీర్తి సురేష్‌కు కాబోయే భర్త అతడేనా? వైరల్ అవుతోన్న ఫొటో