Sudigali Sudheer's GOAT Movie Song: ముందుగా బుల్లితెరపై మ్యాజిషియన్‌గా తన కెరీర్‌ను ప్రారంభించాడు సుడిగాలి సుధీర్. ఆ తర్వాత జబర్దస్త్ అనే కామెడీ షోలో కమెడియన్‌గా పరిచయమయ్యాడు. ఇప్పుడు ఏకంగా సినిమాల్లో హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటికే సుధీర్ హీరోగా పలు చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అందులో కొన్ని యావరేజ్ హిట్స్‌గా నిలిచాయి కూడా. ప్రస్తుతం హీరోగా సుధీర్ చేతిలో మరొక సినిమా ఉంది. అదే ‘గోట్’ (GOAT Telugu Movie). దివ్యభారతి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీ నుండి మంచి మెలోడీ డ్యూయెట్ సాంగ్ బయటికొచ్చింది. ‘అయ్యో పాపం సారు’ అంటూ సాగే ఈ పాటకు మ్యూజిక్ లవర్స్ ఫిదా అవుతున్నారు.
హీరో హీరోయిన్ల కెమిస్ట్రీకి ఓట్లు..
సుడిగాలి సుధీర్ హీరోగా తెరకెక్కుతున్న ‘గోట్’ (GOAT Movie Telugu Songs)ను నరేష్ కుప్పిలి తెరకెక్కిస్తున్నాడు. విశ్వక్ సేన్ హీరోగా నటించిన ‘పాగల్’తో దర్శకుడిగా పరిచయమయ్యాడు నరేశ్. ఫస్ట్ మూవీతోనే కామెడీ సినిమాలను బాగా హ్యాండిల్ చేయగలడు అని ప్రశంసలు అందుకున్నాడు. ఇక రెండో చిత్రం సుడిగాలి సుధీర్‌తో అని అనౌన్స్ చేసి... దానికి ‘గోట్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇప్పటి వరకు ఈ మూవీ నుండి పెద్దగా అప్డేట్స్ బయటికి రాకపోయినా... తాజాగా విడుదలయిన ‘అయ్యో పాపం సారు’ అనే పాట మాత్రం అందరినీ ఆకట్టుకుంటోంది. ఇందులో హీరో హీరోయిన్లుగా సుధీర్, దివ్యభారతి కెమిస్ట్రీ బాగుందంటూ ప్రేక్షకులు కామెంట్స్ పెడుతున్నారు.
అందమైన మెలోడీ..
మహాతేజ క్రియేషన్స్ అండ్ జైష్ణవ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ‘గోట్’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చంద్రశేఖర్ రెడ్డి మొగుళ్ళ నిర్మాతగా వ్యవహరించారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లోనే ‘గోట్’ షూటింగ్ సాగుతోంది. లియోన్ జేమ్స్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఇప్పటికే విడుదలయిన ‘అయ్యో పాపం సారు’ సాంగ్‌తో లియో జేమ్స్ మ్యూజిక్‌కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. సురేష్ బనిశెట్టి ఈ సాంగ్‌కు లిరిక్స్‌ను అందించగా... సీన్ రోల్డాన్ తన స్వరంతో ఈ పాటను అందరికీ నచ్చేలా పాడారు. ఇక ఈ సాంగ్ లాంచ్ సమయంలో నిర్మాత మాట్లాడుతూ ‘గోట్’ గురించి మరిన్ని అప్డేట్స్ ప్రేక్షకులకు అందించారు.
సుధీర్ కెరీర్‌లో మైల్‌స్టోన్ సినిమా..
‘అయ్యో పాపం సారు’ సాంగ్ లాంచ్‌లో మూవీ యూనిట్ పాల్గొన్నారు. ఆ సందర్భంగా నిర్మాత చంద్రశేఖర్ రెడ్డి మొగుళ్ళ మాట్లాడుతూ.. ప్రస్తుతం హైదరాబాద్‌లో విరామం లేకుండా షూటింగ్ జరుగుతోందని అప్డేట్ ఇచ్చారు. హీరో సుధీర్, హీరోయిన్ దివ్యభారతిలపై కొన్ని కీలక సన్నివేశాలతో పాటు యాక్షన్ ఎపిసోడ్స్ కూడా చిత్రీకరిస్తున్నామని తెలిపారు. ఖర్చు విషయంలో ఎక్కడా రాజీపడకుండా చాలా రిచ్‌గా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని అన్నారు. టెక్నికల్‌గా కూడా చిత్రం ఉన్నతస్థాయిలో ఉంటుందని, సుడిగాలి సుధీర్ కెరీర్‌లో ఈ చిత్రం మైల్‌స్టోన్‌గా నిలుస్తుందని స్టేట్‌మెంట్ ఇచ్చారు నిర్మాత చంద్రశేఖర్ రెడ్డి. ఇక సుధీర్ హీరోగా నటించిన చివరి చిత్రం ‘కాలింగ్ సహస్ర’ ఇటీవల ప్రైమ్‌లో విడుదలయ్యి మిక్స్‌డ్ రివ్యూలను అందుకుంది.
Also Read: అనుష్క ప్రెగ్నెంట్ - రెండో బిడ్డకు విరుష్క దంపతులు రెడీ, కన్ఫర్మ్ చేసిన విరాట్ కోహ్లీ ఫ్రెండ్