తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల దగ్గర భారీ పోటీ నెలకొంది. 'బింబిసార' (Bimbisara Movie), 'సీతా రామం' (Sita Ramam Movie), 'కార్తికేయ 2' (Karthikeya 2 Movie) సినిమాలకు థియేటర్లలో స్పందన బావుంది. వచ్చే వారం 'లైగర్' (Liger Movie) రానుంది. అందుకని, ఈ వారం థియేటర్లలోకి భారీ, మీడియం సినిమాలు ఏవీ రావడం లేదు. దాంతో చిన్న సినిమాలు క్యూ కట్టాయి.
ఈ వారం మొత్తం ఏడు సినిమాలు విడుదల అవుతున్నాయి. అందులో 18వ తేదీన వస్తున్న ధనుష్ 'తిరు'... 19వ వస్తున్న 'వాంటెడ్ పండు గాడ్', 'తీస్ మార్ ఖాన్', 'కమిట్‌మెంట్' తప్పిస్తే మిగతావన్నీ చిన్న చిత్రాలే!
'తిరు' - ధనుష్ హీరో... రాశీ ఖన్నా, నిత్యా మీనన్ హీరోయిన్లుతెలుగులో ఈ వారం వస్తున్న చిత్రాల్లో చెప్పుకోదగ్గది 'తిరు' (Thiru Telugu Movie). తమిళ సినిమా 'తిరుచిత్రాంబళం' (Thiruchitrambalam Movie)కు తెలుగు అనువాదమిది. గురువారం (ఆగస్టు 18న) విడుదలవుతోంది. ఇందులో ధనుష్ (Dhanush) హీరో. రాశీ ఖన్నా, నిత్యా మీనన్ హీరోయిన్లు. హీరో తండ్రి పాత్రలో ప్రకాష్ రాజ్ నటించారు. తెలుగు ప్రేక్షకులకు తెలిసిన ముఖాలు సినిమాలో ఉన్నాయి. అయితే... తెలుగులో ఆశించిన రీతిలో ప్రమోషన్స్ చేయడం లేదు. అనిరుధ్ సంగీతం అందించిన పాటలు, ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది. 'తిరు' తప్పిస్తే... మిగతా సినిమాలన్నీ ఆగస్టు 19న విడుదల అవుతున్నాయి.
బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ 'కమిట్‌మెంట్'ఆగస్టు 19న వస్తున్న మరో తెలుగు సినిమా 'కమిట్‌మెంట్' (Commitment Telugu Movie). ఇందులో తేజస్వి మదివాడ, అన్వేషి జైన్, రమ్య పసుపులేటి, అమిత్ తదితరులు నటించారు. మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులు, ఇతరత్రా అంశాలతో సినిమా రూపొందిందని ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. సమాజానికి సందేశం ఇస్తున్నా... ప్రచార చిత్రాల్లో శృంగారాత్మక సన్నివేశాలే హైలైట్ అవుతున్నాయి.
Also Read : ఫ్లాప్ ఇచ్చిన రోజు హిట్ కొట్టడానికి వస్తున్న ప్రభాస్ - ‘సలార్’ రిలీజ్ డేట్ ఫిక్స్ 'మాటరాని మౌనమిది', 'అం అః', 'లవ్ 2' అనే మరో మూడు సినిమాలు కూడా ఆగస్టు 19న విడుదల అవుతున్నాయి. చివరి రెండు సినిమాలు అయితే చాలా మంది ప్రేక్షకులకు తెలియవు కూడా! ఈ ఏడు సినిమాల్లో ఏది విజయం సాధిస్తుందో చూడాలి.