Sudhakar Komakula: తెలుగు చిత్రపరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు సుధాకర్ కోమాకుల. 2012లో వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాతో ఒక వెలుగు వెలిగిన సుధాకర్, గత దశాబ్ద కాలంలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటూనే తన పంథాను మార్చుకుంటూ ముందుకు సాగుతున్నాడు. కేవలం నటనకే పరిమితం కాకుండా, సినిమా నిర్మాణంలో సాంకేతిక మెళకువలను అందిపుచ్చుకొని రాణించే ప్రయత్నంలో ఉన్నాడు. 

Continues below advertisement

ప్రమాదం కారణంగా నటుడిగా మారిన సుధాకర్

సుధాకర్ కోమాకుల 1989లో విశాఖ పట్నంలో జన్మించాడు. చిన్నతనం నుంచే ఆయనకు కళల పట్ల, ముఖ్యంగా డ్యాన్స్, నటన పట్ల ఇష్టం ఏర్పడింది. ఆయన తండ్రి కారణంగానే రంగస్థలంపై మక్కువ పెరిగింది. విశాఖలో ఒక డ్యాన్స్ గ్రూప్‌లో సభ్యుడిగా ఉంటూ వచ్చిన సుధాకర్ డ్యాన్స్ మాస్టర్ అవుదామని హైదరాబాద్ వచ్చాడు. హైదరాబాద్‌ సెంట్రల్ యూనివర్శిటీలో పీజీ డిప్లొమా ఇన్ కొరియోగ్రఫీ కోర్సు చేశాడు. అయితే ఒక ప్రమాదం ఆయన జీవితాన్ని మార్చేసింది. ప్రమాదంలో తగిలిన గాయాలు కారణంగా డ్యాన్స్ మాస్టర్ అవుదామనే కలకు గుడ్‌బై చెప్పేశాడు. తన సెకండ్ ప్రయార్టీ లిస్ట్‌లో ఉన్న నటనవైపు వచ్చాడు. 

Also Read: జగద్ధాత్రి సీరియల్ నటి దీప్తి మన్నే గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్‌! ఫ్రెండ్‌తో ఆడిషన్‌కు వెళ్లి సీరియల్ ఆఫర్ ఎలా కొట్టేసింది!

అనుకున్నట్టుగానే సినిమాల్లో పాత్రలు వచ్చేస్తే కిక్ ఏం ఉంటుంది. అందుకే ఫొటోలు పట్టుకొని పది ఆఫీస్‌లు తిరగాల్సి వచ్చింది. ఇంతలో బతకడానికి హైదరాబాద్‌లో ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తూ వచ్చాడు. పగటి పూట ఆఫీసులకు వెళ్లి ఆడిషన్లు ఇవ్వడం, రాత్రి షిప్టుల్లో ఆఫీస్‌లో పని చేస్తూ వచ్చాడు. 2002లో మనసుతో చిత్రంలో చిన్న పాత్ర లభించింది. 2006లో ఒక విచిత్రంలో సహాయ నటుడిగా కనిపించినప్పటికీ అనుకున్న బ్రేక్ రాలేదు. 

Continues below advertisement

Also Read: భార్య పేరు కలిసి వచ్చేలా... ప్రొడక్షన్‌ హౌస్‌ స్టార్ట్‌ చేసిన హీరో

నాగరాజ్ పాత్రతో సంచలనం 

2012లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్‌ సుధాకర్ కెరీర్‌ అతి పెద్ద మలుపు. ఇందులో ఆయన పోషించిన నాగరాజ్‌ పాత్ర, తెలంగాణ యాసలో సాగే సంభాషణలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. వాస్తవికమైన నటనతో ఆయన తెలుగులోని చాలా ఇళ్లల్లో నాగరాజ్‌గానే గుర్తుండిపోయాడు. ఈ చిత్రం థియేటర్‌లలో యావరేజ్‌గా ఆడినా ఆన్‌లైన్, టీవీ ప్లాట్‌ఫామ్‌లలో మాత్రం దుమ్మురేపుతోంది.

అంతర్జాతీయ వేదికపై "నువ్వ తోపురా"

సుధాకర్ నటించిన "నువ్వు తోపురా" సినిమా ఆయన కెరీర్‌లోనే మైలురాయి. ఈ చిత్రం 70 శాతం అమెరికాలోని ఉటాలో చిత్రీకరించారు. ఒక అక్రమ వలసదారుడు అమెరికాలో ఎదుర్కొనే సవాళ్లను వాస్తవికంగా చూపించిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. 

Also Read: విరోష్ కపుల్ గ్లోబల్ ట్రెండింగ్ - నేషనల్ క్రష్ రష్మిక లేటెస్ట్ పోస్ట్ ఏంటంటే?

ఈ చిత్రానికి సుధాకర్‌కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. 2020 ఉటా ఫిల్మ్ ఫెస్టివల్‌లో మేడ్ ఇన్ ఊటా కేటగిరిలో బెస్ట‌పిక్చర్ అవార్డు గెలుచుకుంది. హాలీవుడ్ జ్యూరీ సభ్యులు సుధాకర్‌ నటనను, చిత్ర నిర్మాణ విలువలను ప్రశంసించారు. ఈ సినిమాతోనే ఆయన గాయకుడిగా కూడా మారి ఒగ్గు కథ, పోరీలంటే బిపి షుగర్ లాంటి పాటలు పాడారు. 

నిర్మాతగా ప్రయాణం ప్రారంభం 

కేవలం అవకాశాల కోసం వేచి చూడకుండా తన భార్య హారికతో కలిసి సుఖ మీడియా అనే నిర్మాణ సంస్థను స్థాపించిన సుధాకర్ నిర్మాతగా మారారు. దీని ద్వారా వినూత్నమైన కథలను ప్రేక్షకులకు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. 

Also Read:iBOMMA ఓపెన్ చేస్తున్నారా - ఇది మీ కోసమే!

సుఖ మీడియా నిర్మాణంలోనే నారాయణ అండ్ కో సినిమాను 2023లో విడుదల చేశాడు. క్రైమ్ కామెడీ చిత్రానికి అమెజాన్‌లో మంచి లభించింది. జీడీ పేరుతో దేశంలోనే మొదటి ఫౌండ్ ఫుటేజ్‌ యాక్షన్ థ్రిల్లర్‌ తీశారు. ఒక కారులో ఆరుగురు స్నేహితులు ప్రయాణం చుట్టూ తిరిగే ప్రయోగాత్మక చిత్రం త్వరలో విడుదల కానుంది. 

2026లో ప్రైమ్ వీడియో కోసం రూపొందుతున్న ఇసకపట్నం సిరీస్‌లో సుధాకర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. గ్యారీ బీహెచ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్టులో ఐశ్వర్య రాజేష్‌, సముద్రఖని వంటి ప్రముఖులు నటిస్తున్నారు. అడవి శేష్ చేతుల మీదుగా విడుదలైన మెమొరీస్ మల్టీలింగ్యువల్‌ మ్యూజిక్‌ వీడియో సుధాకర్ నిర్మాణంలో శాన్‌ఫ్రానిస్కోలో చిత్రీకకరించారు. సుధాకర్‌ భార్య పేరు హారిక. వారికి ఒక బాబు ఉన్నాడు. పేరు రుద్ర. 

మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.