iBOMMA Movie Piracy Web Site Opening Controversies : iBOMMA... ఈ పేరు తెలియని వారుండరు. అటు సినీ ఇండస్ట్రీకి ఇటు పోలీసులకు ముచ్చెమటలు పట్టించింది. ఎలాంటి స్టార్ హీరో సినిమా అయినా, ఏ లాంగ్వేజ్ అయినా, వెబ్ సిరీస్ అయినా థియేటర్స్, ఓటీటీల్లోకి వచ్చిన మరుక్షణమే పైరసీ HD ప్రింట్‌ను ఈ సైట్‌లోకి అందుబాటులోకి తెచ్చేది. సుదీర్ఘ విచారణ తర్వాత 'iBOMMA' నిర్వాహకుడు ఇమ్మడి రవిని పోలీసులు అరెస్ట్ చేశారు. రీసెంట్‌గానే కోర్టు అతనికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

Continues below advertisement

మళ్లీ iBOMMA

ఇమ్మడి రవి అరెస్టుతో iBOMMA కథ ముగిసినట్లేనని ఇండస్ట్రీ పెద్దలు ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత 'iBOMMA one' అనే వెబ్ సైట్ వచ్చినా అందులో మూవీ రివ్యూస్ తప్ప కొత్త సినిమాలు ఏమీ లేవని... iBOMMA క్లోజ్ అయ్యిందని పోలీసులు కన్ఫర్మ్ చేశారు. కానీ రీసెంట్‌గా మళ్లీ iBOMMA మళ్లీ ప్రత్యక్షం కావడం ఇండస్ట్రీ వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది.

Continues below advertisement

'ibppam tv'గా పేరు మార్చుకుని iBOMMA ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమైందని... ఇందులో కొత్త సినిమాలు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో బుధవారం నుంచి తెగ ప్రచారం సాగుతోంది. కొందరు ఆ సైట్ ఓపెన్ చేసి అందులో సినిమాల స్క్రీన్ షాట్స్‌ను కూడా నెట్టింట పోస్ట్ చేస్తున్నారు. అయితే, ఇంతవరకూ దీనిపై పోలీసులు ఎలాంటి ప్రకటన చేయలేదు.

Also Read : వారణాసికి వారణాసి టీం - ఆధ్యాత్మిక నగరంలో భారీ యాక్షన్ సీక్వెన్స్?

ఓపెన్ చేస్తే...

iBOMMA వెబ్ సైట్ ఓపెన్ చేస్తే వెరీ డేంజరస్ అని అంటున్నారు సైబర్ నిపుణులు. కొత్త సినిమాలను ఎరగా వేసి మన వ్యక్తిగత సమాచారాన్ని దోచేసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఒకసారి ఆ సైట్ ఓపెన్ చేసి 'I Agree'పై క్లిక్ చేస్తే మన ఫోన్ వారి చేతిలో ఉన్నట్లేనని అంటున్నారు. కేవలం iBOMMA మాత్రమే కాదని, ఇతర పైరసీ వెబ్ సైట్స్ సెర్చ్ చేయడం కూడా చాలా ప్రమాదమని అంటున్నారు.

మన ఫోటోస్, పర్సనల్ డేటాతో పాటు బ్యాంక్ సమాచారం కూడా వారి చేతుల్లోకి వెళ్లే ఛాన్స్ ఉందని అలాంటి ప్రలోభాలకు లోను కావొద్దని పోలీసులతో పాటు సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. అంతే కాకుండా iBOMMA సైట్ ఓపెన్ చేయడంతోనే ఇల్లీగల్ బెెట్టింగ్ యాప్స్, ఎన్నో లోన్ యాప్స్ ప్రమోషన్స్ యాడ్స్ రూపంలో కనిపిస్తాయని వీటిపై క్లిక్ చేసినా వెరీ డేంజర్ అంటూ వార్నింగ్ ఇస్తున్నారు. 

Also Read : సెకండ్ ప్లేస్‌లో దళపతి సీఎం విజయ్ - IMDb లిస్ట్‌లో టాప్ ఇండియన్ సెలబ్రిటీగా రికార్డ్

ఓటీటీ సబ్ స్క్రిప్షన్స్ తీసుకోలేరా?

ఈ రోజుల్లో మినిమమ్ రూ.100 నుంచి రూ.150 మధ్యే అన్నీ ప్రముఖ ఓటీటీల నెలవారీ సబ్‌స్క్రిప్షన్స్ ఉంటున్నాయని... రూ.99లకు కూడా సబ్‌స్క్రిప్షన్ దొరుకుతుందని నిపుణులు సూచిస్తున్నారు. థియేటర్లలో అంత రేట్ పెట్టుకుని వెళ్లలేం అనుకునే వారు ఓటీటీలో వచ్చేంత వరకూ వెయిట్ చేసి అందులో మూవీస్ చూడాలని అంటున్నారు. అఫీషియల్‌గా ఓటీటీల్లో చూస్తే... ఫుల్ సేఫ్ అని పైరసీ వెబ్ సైట్స్‌లో సినిమాలు చూసినా, డౌన్ లోడ్ చేసినా ఎప్పటికైనా రిస్కేనని చెబుతున్నారు. iBOMMA లాంటి ఇల్లీగల్ సైట్స్‌ను ఎంకరేజ్ చేయకూడదని వార్నింగ్ ఇస్తున్నారు. 

Also Read : పవర్ కిల్స్ జస్టిస్ - జ్యోతిక, సోనాక్షి సిన్హా ఈ సిస్టమ్ మారుస్తారా?

Note : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.