కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష నటించిన రీసెంట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ రెడీ అయింది. ఆహా తమిళం ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. ఇంతకీ ఆ మూవీ పేరేంటి? ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడు? అనే వివరాల్లోకి వెళితే.. చెన్నై బ్యూటీ త్రిష కోలీవుడ్లో రీసెంట్ గా 'ది రోడ్'(The Road) అనే మూవీలో నటించింది. క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ మూవీ నెల రోజుల కింద థియేటర్స్ లో విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. కానీ కమర్షియల్ గా అంతగా సక్సెస్ అవ్వలేకపోయింది. అరుణ్ వసీగరన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం కొన్ని నిజజీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కగా, ఇందులో త్రిష లీడ్ రోల్ పోషించింది.
సంతోష్ ప్రతాప్, షబ్బీర్, మియా జార్జ్, ఎమ్. ఎస్. భాస్కర్ ముఖ్యపాత్రల్లో కనిపించారు. ఓ హైవే పై ఒకే చోట వరుసగా ప్రమాదాలు జరుగుతుండడం, వాటి వెనుక ఉన్న మిస్టరీని ఛేదించే అమ్మాయిగా త్రిష ఈ సినిమాలో తన నటనతో ఆకట్టుకుంది. అక్టోబర్ 10న థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ మూవీ ఆడియన్స్ నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ ని అందుకోగా సరిగ్గా విడుదలైన నెల రోజులకు ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. వచ్చే శుక్రవారం నవంబర్ 10 నుంచి 'ది రోడ్' ఆహా తమిళ ఓటీటీలో స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని మేకర్స్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
ఇక 'ది రోడ్' మూవీ గురించి చెప్పాలంటే.. క్రైమ్ మిస్టరీ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో డైరెక్టర్ అరుణ్ వసీగరన్ ఈ మూవీని తెరకెక్కించాడు. ఫేక్ ఆక్సిడెంట్ కు పాల్పడుతూ ప్రజలను దోచుకుంటున్న ఓ ముఠా గుట్టును ఒక సాధారణ యువతి ఎలా కనిపెట్టింది? తన భర్త, కొడుకు మరణం పై ఏ విధంగా ప్రతీకారం తీర్చుకుంది? అనే పాయింట్ తో ఈ మూవీ ఉంటుంది. ఓ సింపుల్ స్టోరీని డిఫరెంట్ స్క్రీన్ ప్లే తో కొత్తగా స్క్రీన్ పై ప్రజెంట్ చేసే ప్రయత్నం చేశాడు డైరెక్టర్ అరుణ్ వశీకరణన్. ఓ పెద్ద క్రైమ్ వెలికి తీసే సాధారణ యువతిగా త్రిష బెస్ట్ పెర్ఫార్మెన్స్ తో సినిమాకి వన్ ఉమెన్ షో గా నిలిచింది. ముఖ్యంగా కొన్ని ఎమోషనల్ సీన్స్‌లో బాగా మెప్పించింది.
త్రిషతోపాటు అమాయకుడి నుంచి విలన్‌గా మారే యువకుడిగా షబీర్ నటన కూడా ఆకట్టుకుంటుంది. త్రిష స్నేహితురాలిగా మియా జార్జ్, కానిస్టేబుల్ పాత్రలో భాస్కర్ ప్రాధాన్యమున్న పాత్రల్లో కనిపించి మెప్పించారు. మరోవైపు ఈ దసరాకి దళపతి విజయ్ తో కలిసి త్రిష నటించిన 'లియో'(Leo) మూవీ బాక్సాఫీస్ వద్ద ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. సినిమాకి మిశ్రమ స్పందన వచ్చినా కూడా కలెక్షన్స్ మాత్రం అదిరిపోయాయి.
లియో మొదటి రోజే వరల్డ్ వైడ్ గా రూ.140 కోట్ల కలెక్షన్స్ అందుకొని ఇండియాలోనే అత్యధిక కలెక్షన్స్ అందుకున్న చిత్రంగా సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేశారు. సినిమాలో విజయ్ భార్యగా త్రిష తన అందంతో పాటు నటనతోనూ ఆకట్టుకుంది. ఇక లియో సక్సెస్ తో ఫుల్ ఫామ్ లో ఉన్న త్రిష ప్రస్తుతం కోలీవుడ్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోతోంది.
Also Read : మెగాస్టార్ సిగ్నేచర్ స్టెప్ గుర్తుపట్టలేకపోయిన డాక్టర్ బాబు
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial