ఎంతోమంది సీనియర్ నటీనటులు, కనుమరుగయిపోయిన ఆర్టిస్టులు 2023తో కమ్‌బ్యాక్ ఇచ్చారు. అంతేకాదు, గుర్తుండిపోయే హిట్స్‌ను తమ ఖాతాలో వేసుకున్నారు. అందులో ఒకరు శ్రియా రెడ్డి. ఒకప్పుడు పలు సినిమాల్లో హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించిన శ్రియా రెడ్డి.. వెండితెరపై మెరిసి ఎంతోకాలం అయ్యింది. ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కిన బ్లాక్‌బస్టర్ హిట్ ‘సలార్’తో శ్రియా కమ్‌బ్యాక్ ఇచ్చింది. అంతే కాకుండా తన ఖాతాలో మరో పాన్ ఇండియా చిత్రం కూడా ఉంది. అదే ‘ఓజీ’. పవన్ కళ్యాణ్, సుజీత్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ఓజీ’ గురించి పలు ఆసక్తికర విషయాలు బయటపెట్టింది ఈ సీనియర్ నటి. 


సగం యాక్షన్.. సగం ఎమోషన్స్


‘సలార్’లో రాధా రమ మానార్ పాత్రలో కనిపించింది శ్రియా రెడ్డి. హీరోయిన్‌గా నటించిన శృతి హాసన్ గురించే శ్రియా చేసిన పాత్ర గురించే ప్రేక్షకులు ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. ఈ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్ అవ్వడంతో పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటోంది శ్రియా. అదే సమయంలో తన అప్‌కమింగ్ మూవీ ‘ఓజీ’ గురించి పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకుంది. ‘‘మీకు ‘ఓజీ’ సినిమా చాలా షాకింగ్‌గా అనిపిస్తుంది. మీరంతా ఇది ఒక కమర్షియల్ సినిమా అనుకుంటున్నారు కానీ కాదు. ఇదొక ఎమోషనల్ రోలర్‌కోస్టర్‌లాగా ఉంటుంది. సినిమాలో 50 శాతం యాక్షన్ ఉంటే.. 50 శాతం ఎమోషన్స్ ఉంటాయి’’ అని ‘ఓజీ’ జోనర్ ఏంటని బయటపెట్టింది శ్రియా రెడ్డి.


పవన్ కళ్యాణ్ కళ్లు చాలా పవర్‌ఫుల్


‘‘సుజీత్ ఆ ఎమోషన్స్ అన్నీ చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి అనుకున్నాడు. ఆ విషయంలో తను చాలా స్ట్రాంగ్‌గా నిలబడ్డాడు. ఓజీలో ప్రకాశ్ రాజ్, అర్జున్ దాస్, ఇమ్రాన్ హష్మీ లాంటి అద్భుతమైన క్యాస్ట్ ఉంది. వీరంతా వచ్చి తమ నటనా ప్రతిభను చూపిస్తే ఎలా ఉంటుందో మీరు ఊహించుకోవచ్చు. పవన్ కళ్యాణ్ ఒక మంచి నటుడు. తను చాలా స్వీట్. తన కళ్లు చాలా పవర్‌ఫుల్‌గా ఉంటాయి’’ అంటూ ‘ఓజీ’ గురించి, అందులో పనిచేసే నటీనటుల గురించి ప్రశంసలు కురిపించింది శ్రియా. ఈ మూవీలో పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తోంది. డీవీవీ దానయ్య ‘ఓజీ’కి నిర్మాతగా వ్యవహరిస్తుండగా.. ఎస్ఎస్ తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.


రాధా రమ మానార్


ప్రస్తుతం ‘సలార్’ ఇంకా థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్‌ను కొనసాగిస్తుండగా.. రాధా రమ పాత్రలో నటించిన శ్రియా గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. తన పెర్ఫార్మెన్స్ మాత్రమే కాదు.. తన స్టైలింగ్‌కు కూడా ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. సింపుల్ శారీలతో.. ఎక్కువగా మేకప్ లేని లుక్‌తోనే స్క్రీన్‌ను బ్రైట్‌గా మార్చింది అంటూ శ్రియాను నెటిజన్లు తెగ పొగిడేస్తున్నారు. కానీ తను అలా కనిపించడానికి, తన పాత్రకు అంత ఆదరణ లభించడానికి కారణం దర్శకుడు ప్రశాంత్ నీల్ అని చెప్తూ.. క్రెడిట్ మొత్తం తనకే ఇచ్చేసింది. అంతే కాకుండా సినిమాకు ముందు జరిగిన ఫోటోషూట్‌కు సంబంధించిన ఫోటోలను కూడా తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.


Also Read: హ్యపీ బర్త్ డే సల్లూ భాయ్: సల్మాన్ ఖాన్‌కు అరుదైన వ్యాధి - రోజుకు 35 రోటీలు, బాత్రూమ్‌లో అవి ఉండాల్సిందేనట!