HBD Salmankhan: ఎన్నో ఏళ్లుగా బాలీవుడ్ ప్రేక్షకులను తన సినిమాలతో అలరిస్తున్న సీనియర్ హీరో సల్మాన్ ఖాన్. కండల వీరుడిగా, బాలీవుడ్ భాయ్‌జాన్‌గా పేరు తెచ్చుకున్న సల్మాన్.. ఎన్నో బాక్సాఫీస్ రికార్డులకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచాడు. దాదాపు 3 దశాబ్దాల నుంచి బీటౌన్‌లో సూపర్ స్టార్‌గా వెలిగిపోతున్నాడు ఈ హీరో. అందుకే డిసెంబర్ 27న తన పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో సల్మాన్ ఫ్యాన్స్ రచ్చ మొదలుపెట్టారు. తన పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్‌లోని పలు విషయాలను గుర్తుచేసుకుంటూ తనకు విషెస్‌ను చెప్తున్నారు. సల్మాన్ ఖాన్ గురించి దాదాపుగా అన్ని విషయాలు తన ఫ్యాన్స్‌కు తెలుసు. కానీ తెలియని విషయాలు కూడా కొన్ని ఉన్నాయి.


1. సల్మాన్ ఖాన్ ఒక రైటర్. నటనతో పాటు రైటింగ్ అంటూ ప్యాషన్ ఉన్న వ్యక్తి. తన ఖాళీ సమయాల్లో ఏదో ఒకటి రాస్తూ ఉంటాడని సన్నిహితులు చెప్తుంటారు.


2. ‘మేనే ప్యార్ కియా’తో హీరోగా తన కెరీర్‌ను ప్రారంభించాడు సల్మాన్ ఖాన్. కానీ అంతకంటే ముందే 1988లో విడుదలయిన ‘బీవీ హోతో ఐసీ’ అనే చిత్రంలో ఒక చిన్న సపోర్టింగ్ రోల్ చేసి మొదటిసారి వెండితెరపై మెరిశాడు.


3. సల్మాన్ ఖాన్‌కు సబ్బులు అంటే చాలా ఇష్టం. రకరకాల సబ్బులను ట్రై చేయడం తనకు సరదా అని ఫ్రెండ్స్ అంటుంటారు. తన బాత్రూమ్ పూర్తిగా రకరకాల సబ్బులతో నిండిపోయి ఉంటుందట.


4. నటుడిగా తెరపై అలరించడంతో పాటు తెరవెనుక కథలు కూడా రాశాడు సల్మాన్ ఖాన్. ‘వీర్’, ‘చంద్రముఖి’ చిత్రాలకు రైటర్‌గా పనిచేశాడు. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యాయి. కానీ వీటి వెనుక సల్మాన్ రైటింగ్ ఉందని చాలామందికి తెలియదు.


5. సల్మాన్ ఖాన్‌కు స్విమ్మింగ్ అంటే చాలా ఇష్టం. తను చాలా గొప్ప స్విమ్మర్ అని సన్నిహితులు చెప్తున్నారు. ఒకవేళ హీరో కాకపోయింటే.. సల్మాన్ స్విమ్మింగ్ కెరీర్‌లోనే పైస్థాయికి వెళ్లేవాడట.


6. సల్మాన్ ఖాన్‌కు ట్రిజెమినల్ న్యూరల్జియా అనే అరుదైన వ్యాధి ఉంది. ఇది ముఖనరాలకు సంబంధించిన ఒక డిజార్డర్. దీనిని సూసైడ్ డిసీజ్ అని కూడా అంటారు. 


7. కండల వీరుడికి ఫుడ్ అంటే అమితమైన ఇష్టం. అందులోనూ చైనీస్ ఫుడ్ అంటే మరింత ఎక్కువగా ఇష్టపడి తింటాడు. ముంబాయ్‌లోని చైనీ గార్డెన్‌లోని చైనీస్ ఫుడ్ సల్మాన్ ఖాన్‌కు ఫేవరెట్.


8. షారుఖ్ ఖాన్ కెరీర్‌ను మలుపుతిప్పిన ‘బాజీగర్’ సినిమా ఆఫర్ ముందుగా సల్మాన్ చేతికి వచ్చింది. కానీ నెగిటివ్ రోల్‌లో కనిపించడం ఇష్టం లేక తను ఆ సినిమా అవకాశాన్ని వదులుకున్నాడు.


9. ఇప్పుడు ఫ్యాన్స్ అంతా కండల వీరుడు అని ప్రేమగా పిలుచుకుంటున్న సల్మాన్.. ఒకప్పుడు చాలా బక్కగా ఉండేవాడు. 1991లో విడుదలయిన ‘సాజన్’ సినిమా సమయంలో సల్మాన్ చాలా బక్కగా ఉన్నా.. రోజుకు 35 రోటీలు తినేవాడట.


10. సల్మాన్ ఖాన్ రైటర్, యాక్టర్ మాత్రమే కాదు.. పెయింటింగ్‌లో కూడా టాప్. ఒక ప్రొఫెషనల్ పెయింటర్‌లాగా పెయింట్ చేసే టాలెంట్ ఆయన సొంతం. బాలీవుడ్ సీనియర్ హీరో అమీర్ ఖాన్ ఇంట్లో సల్మాన్ చేసిన పెయింటింగ్ ఉంటుందని సమాచారం.


Also Read: హాలీవుడ్‌కు షాకిచ్చిన ‘సలార్’, ‘డంకీ’ - గ్లోబల్ బాక్సాఫీస్‌ బాక్స్ బద్దలు