శతాధిక చిత్ర కథానాయకుడు శ్రీకాంత్ (Srikanth)కు ఫ్యామిలీ మెన్ ఇమేజ్ ఉంది. హీరోగా ఆయన చేసిన సినిమాల్లో యాక్షన్ ఫిలిమ్స్ ఉన్నా... ఫ్యామిలీ కథలతో ఎక్కువ విజయాలు అందుకున్నారు. ఈ హీరో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత రూటు మార్చారు. కొత్త కొత్త క్యారెక్టర్లలో కనిపిస్తున్నారు. లుక్స్ పరంగా వేరియేషన్స్ చూపిస్తున్నారు. సుప్రీం స్టార్ సాయి దుర్గా తేజ్ (Sai Durgha Tej) హీరోగా రూపొందుతున్న పాన్ ఇండియా సినిమా 'సంబరాల ఏటిగట్టు' (Sambarala Yeti Gattu movie)లో ఆయన మరొక డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తున్నారని లుక్ చూస్తే అర్థమవుతోంది.


శ్రీకాంత్‌ను ఎట్టా మార్చేశారో చూశారా!?
Srikanth first look in SYG movie: శ్రీకాంత్ పుట్టిన రోజు (మార్చి 23) ఇవాళ. ఈ సందర్భంగా సాయి దుర్గ తేజ్ ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. తమ సినిమా 'ఎస్.వై.జి - సంబరాల ఏటిగట్టు'లో ఫస్ట్ లుక్ విడుదల చేశారు. బ్రిటిషు అనే పాత్రలో శ్రీకాంత్ నటిస్తున్నారని తెలిపారు.


Also Read: అట్లీ సినిమాతో రేర్ రికార్డ్ క్రియేట్ చేసిన అల్లు అర్జున్... ప్రజెంట్ ఇండియాలో టాప్ అతనేనా!?






పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ విడుదల చేసిన పోస్టర్ గమనిస్తే... బ్రిటిషు అక్షరాలలో ఆ దేశపు జెండా రంగులు కనిపిస్తాయి. శ్రీకాంత్ వేసుకున్న కోటు చూస్తే... బ్రిటిష్ అధికారులు ధరించే కోటు అని అర్థం అవుతోంది. మరి ఆయన కొండల్లో ఎందుకు ఉన్నారు? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.


Also Readఎవరీ మహీరా శర్మ? సిరాజ్‌తో డేటింగ్ రూమర్లతో వైరల్... ఆవిడ ఏం చేసిందో తెలుసా?


'సంబరాల ఏటిగట్టు' చిత్రానికి రోహిత్ కెపి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఆయనకు మొదటిది. హనుమాన్ వంటి పాన్ ఇండియా సినిమా ప్రొడ్యూస్ చేసిన ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ అధినేతలు కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ సినిమాను సైతం ప్రొడ్యూస్ చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం విడుదల చేసిన ప్రచార చిత్రాల్లో సినిమాపై అంచనాల పెంచాయి. త్వరలో ఈ చిత్రాన్ని థియేటర్లలకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం అందుతోంది.