Allu Arjun: అట్లీ సినిమాతో రేర్ రికార్డ్ క్రియేట్ చేసిన అల్లు అర్జున్... ప్రజెంట్ ఇండియాలో టాప్ అతనేనా!?

Allu Arjun Atlee movie update: పుష్ప విజయం తర్వాత అట్లీతో చేయడానికి అల్లు అర్జున్ ఇంట్రెస్ట్ చూపించారు. ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్లడానికి ముందు రేర్ రికార్డ్ క్రియేట్ చేశారు... అది రెమ్యూనరేషన్ పరంగా!

Continues below advertisement

నో మోర్ డౌట్స్... డిస్కషన్స్ కూడా అవసరం లేదు... ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) నెక్స్ట్ సినిమా కన్ఫర్మ్ అయ్యింది.‌ 'పుష్ప ‌2 ది‌ రూల్' విజయం తర్వాత అట్లీ దర్శకత్వంలో సినిమా చేయడానికి ఆయన ఇంట్రెస్ట్ చూపించారు.‌ గురూజీ - మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కథను పక్కనపెట్టి అట్లీ కథను పట్టాలు ఎక్కించనున్నారు (Allu Arjun next movie after Pushpa 2). ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్లడానికి ముందు రెమ్యూనరేషన్ పరంగా రేర్ రికార్డ్ క్రియేట్ చేస్తున్నారు. 

Continues below advertisement

అక్షరాల 175 కోట్లు... లాభాల్లో 10 శాతం!
Allu Arjun remuneration for Atlee movie: అట్లీ సినిమా కోసం అల్లు అర్జున్ అక్షరాల 175 కోట్ల రూపాయలను రెమ్యూనరేషన్ కింద తీసుకుంటున్నారని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా కోసం 300 కోట్ల రూపాయలను ఐకాన్ స్టార్ డిమాండ్ చేసినట్లు ఆ మధ్య సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అదంతా అబద్ధం అని తాజా వార్తలతో వెల్లడి అయింది. అల్లు అర్జున్ కథానాయకుడిగా అట్లీ దర్శకత్వం వహించనున్న సినిమాను సన్ పిక్చర్స్ పతాకం మీద కళానిధి మారన్ ప్రొడ్యూస్ చేయనున్నారు.

బన్నీకి 175 కోట్లు ఇవ్వడంతో పాటు లాభాలలో 10 శాతం వాటా ఇవ్వడానికి కూడా సన్ పిక్చర్స్ సంస్థ అంగీకరించిందని‌ చెన్నై సినీ వర్గాలు చెబుతున్నాయి. దర్శకుడు అట్లీ సైతం ఈ సినిమాకు 100 కోట్లు డిమాండ్ చేసినట్లు ప్రచారం జరిగింది. అయితే... ఆయన ఎంత తీసుకుంటున్నారు? అనేది ఇంకా బయటకు రాలేదు. కింగ్ ఖాన్ షారుఖ్ కథానాయకుడిగా అట్లీ దర్శకత్వం వహించిన జవాన్ సినిమా పాన్ ఇండియా సక్సెస్ సాధించింది. భారీ వసూళ్లు‌ రాబట్టింది. దాంతో ఆయనకు క్రేజ్ ఏర్పడింది.

ఆగస్టు... లేదంటే అక్టోబర్... సెట్స్ మీదకు!
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులలో అట్లీ బిజీగా ఉన్నారు. ఆగస్టులో సినిమాను సెట్స్ మీదకు తీసుకువెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నారట. ఒకవేళ ఆగస్టులో గనక షూటింగ్ మొదలు కాకపోతే అక్టోబర్ నెలలో మొదలు అయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుతుంది.

Also Readఎవరీ మహీరా శర్మ? సిరాజ్‌తో డేటింగ్ రూమర్లతో వైరల్... ఆవిడ ఏం చేసిందో తెలుసా?

ఈ సినిమాలో అల్లు అర్జున్ డ్యూయల్ రోల్ చేస్తారనేది లేటెస్ట్ టాక్. అందులో ఒక రోల్ నెగిటివ్ షెడ్ అట. హీరోతో పాటు విలన్ కూడా అల్లు అర్జున్ అనుకోవాలి. ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించనున్నారు. అట్లీ ఇప్పటి వరకు చేసిన సినిమాలతో కంపేర్ చేస్తే ఈ మూవీ చాలా కొత్తగా ఉంటుందట. అదే సమయంలో ఆయన నుంచి ఆశించే మాస్ కమర్షియల్ అంశాలు అన్నీ ఉంటాయట. హీరో ఇంట్రడక్షన్, ఇంటర్వెల్, క్లైమాక్స్ హై ఇస్తాయట. త్వరలో ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి. ఈ సినిమాతో తమిళంలో అల్లు అర్జున్ మార్కెట్ మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పవచ్చు.

Also Readమీనాను అవమానించిన నయనతార... రెజీనా సెల్ఫీ తీయడంతో అసంతృప్తి, అలక?

Continues below advertisement