Sri Simha Koduri : భాగ్ సాలే - ప్రేమ, నేరం, పరుగు? కీరవాణి కుమారుడి కొత్త సినిమా లుక్

ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి రెండో కుమారుడు శ్రీ సింహ కోడూరి హీరోగా నటించిన రూపొందుతోన్న సినిమా 'భాగ్ సాలే'. ఈ రోజు ఫస్ట్ లుక్ విడుదల చేశారు.  

Continues below advertisement

ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి రెండో కుమారుడు, యువ హీరో శ్రీ సింహా కోడూరి (Sri Simha Koduri) నటించిన తాజా సినిమా 'భాగ్ సాలే' (Bhaag Saale Movie). నేడు టైటిల్ వెల్లడించారు. అలాగే, ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. నిజం చెప్పాలంటే... ఫస్ట్ లుక్స్ అని చెప్పాలి. ఎందుకంటే... హీరో సోలో లుక్ ఒకటి, హీరో హీరోయిన్స్ లుక్ ఒకటి, సినిమాలో ప్రధాన తారాగణం లుక్ మరొకటి విడుదల చేశారు. 

Continues below advertisement

ఉంగరం వెనుక కథేంటి?
'బాగ్ సాలే' ఫస్ట్ లుక్ (Bhaag Saale First Look) చూస్తే... ఒక ఉంగరం మెయిన్‌గా కనిపిస్తూ ఉంటుంది. హీరో చేతిలో ఉంగరం... ఆ వెనుక ఉంగరం... అతని కథేంటో తెలియాలంటే త్వరలో విడుదల కానున్న సినిమా చూడాలి. సినిమాలో ఉంగరం హైలైట్ అవుతుందని టాక్. ''ప్రేమ కోసం చేసే ఒక సరదా ప్రయాణం ఈ సినిమా'' అని శ్రీ సింహా కోడూరి సోషల్ మీడియాలో పేర్కొన్నారు.

భాగ్ సాలే...
క్రైమ్ కామెడీ!
ప్రణీత్ సాయి దర్శకత్వంలో వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్, బిగ్ బెన్, సినీ వ్యాలీ మూవీస్ సినిమా పతాకాలపై అర్జున్ దాస్యన్, యష్ రంగినేని, కళ్యాణ్ సింగనమల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇదొక క్రైమ్ కామెడీ సినిమా అని దర్శకుడు ప్రణీత్  తెలిపారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తి అయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

నిర్మాత అర్జున్ దాస్యన్ మాట్లాడుతూ "ఈతరం ప్రేక్షకులను అలరించే కథతో థ్రిల్లింగ్ క్రైమ్ కామెడీగా 'భాగ్ సాలే' సినిమా రూపొందుతోంది. ఏం చేసైనా అనుకున్నది సాధించాలనుకునే ఒక యువకుడి పాత్రలో హీరో శ్రీ సింహా కోడూరి కనిపిస్తారు. ఆయన పాత్ర చుట్టూ కథ అంతా తిరుగుతుంది. సినిమా ఆద్యంతం థ్రిల్ చేస్తుంది'' అని తెలిపారు. 

శ్రీ సింహ, కాల భైరవ...
కాంబినేషన్ రిపీట్!
శ్రీ సింహ నటించిన సినిమాలకు అతని అన్నయ్య, కీరవాణి పెద్ద కుమారుడు కాల భైరవ (Kala Bhairava) సంగీతం అందించడం కామన్ అయ్యింది. ముందుగా అనుకున్నా... అనుకోకపోయినా... వాళ్ళిద్దరి కాంబినేషన్ అలా సెట్ అవుతుంది. మరోసారి ఈ సినిమాకు వాళ్ళిద్దరూ కలిసి పని చేస్తున్నారు. తమ్ముడి కోసం ఈసారి అన్నయ్య ఎలాంటి ట్యూన్స్ అందించారో చూడాలి.  

Also Read : 'గుడ్ బై' రివ్యూ : రష్మిక ఫస్ట్ హిందీ సినిమా ఎలా ఉందంటే?

ఇందులో హీరో క్యారెక్టర్ పేరు అర్జున్. అతనికి జోడీగా నేహా సోలంకి నటించారు. జాన్ విజయ్, నందిని రాయ్ (Nandini Rai) విలన్ రోల్స్  చేస్తున్నారు. ఇంకా రాజీవ్ కనకాల, 'వైవా' హర్ష, సత్య, సుదర్శన్, వర్షిణి సౌందర్ రాజన్ (Varshini Sounderajan), ఆర్జే హేమంత్, బిందు చంద్రమౌళి తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఎడిటింగ్ : కార్తీక ఆర్ శ్రీనివాస్, సినిమాటోగ్రఫీ : రమేష్ కుషేందర్, ఆర్ట్ డైరెక్టర్: శృతి నూకల, ఫైట్ మాస్టర్: రామ కృష్ణ, కొరియోగ్రాఫర్: భాను, విజయ్ పోలకి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: అశ్వత్థామ, గిఫ్ట్సన్ కొరబండి, నిర్మాతలు: అర్జున్ దాస్యన్, యష్ రంగినేని, కళ్యాణ్ సింగనమల, దర్శకుడు: ప్రణీత్ సాయి. 

Also Read : చిరంజీవికి బేషరతుగా క్షమాపణ చెప్పాలి - గరికపాటిపై మెగా ఫ్యాన్స్ ఆగ్రహం

Continues below advertisement