‘‘నాకు ఆ కోకే కావాలి.. వేరేది వద్దు పో’’ అన్నట్లు ఉంది ఇప్పుడు టాలీవుడ్ డైరెక్టర్లు, ప్రొడ్యూసర్ల పరిస్థితి. అందరికీ హీరోయిన్ గా ఇప్పుడు శ్రీలీలే కావాలంటున్నారు. జెర్సీ లాంటి సూపర్ హిట్ సినిమా తీసిన గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ హీరోగా సినిమా మొదలైంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండకు హీరోయిన్ గా శ్రీలీల నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమం బుధవారం జరిగింది. అయితే ఇప్పుడు శ్రీలీల ఎన్ని సినిమాలకు చేస్తోంది అనేది పెద్ద డిబేట్. ఎందుకంటే శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా ‘పెళ్లి సందD’ సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల.. రవితేజ తో ‘దమాఖా’ సినిమాలో హీరోయిన్ గా నటించి వందకోట్ల క్లబ్ హీరోయిన్ గా మారిపోయింది. ఆ సినిమాలో శ్రీ లీల యాక్టింగ్ అండ్ డాన్స్ కి చాలా మంచి పేరు రావటంతో ఇప్పుడు శ్రీలీలే హీరోయిన్ గా కావాలనుకుంటున్న హీరోల జాబితా చాంతాడంత తయారైంది. ఇప్పటికిప్పుడు శ్రీలీల చేతిలో తొమ్మిది సినిమాలు ఉన్నాయి. పైగా అన్నీ పెద్ద సినిమాలే. బడా ప్రొడక్షన్స్ హౌస్ సినిమాల అన్నింటిలో శ్రీలీలే హీరోయిన్ ఇప్పుడు.
❤ విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి సినిమాను నాగవంశీ సితార ఎంటర్ట్మైనెంట్స్ మీద ప్రొడ్యూస్ చేస్తుంటే.. శ్రీలీల హీరోయిన్.
❤ ఇదే ప్రొడ్యూసర్ ప్రొడక్షన్ హౌస్ హారికా హాసినీ క్రియేషన్స్ త్రివిక్రమ్-మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న SSMB28లో మహేష్ సరసన కూడా శ్రీలీలా హీరోయిన్ గా నటిస్తోంది. పూజాహెగ్డే, శ్రీలీల ఇద్దరూ ఫస్ట్ అండ్ సెకండ్ హీరోయిన్స్ కాదు.. ఇద్దరూ హీరోయిన్లే అని నాగవంశీ గతంలో క్లారిటీ కూడా ఇచ్చారు.
❤ ఇక మూడో సినిమా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’. హరీశ్ శంకర్-పీఎస్పీకే కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాలో శ్రీలీలే హీరోయిన్.
❤ నాలుగో సినిమా NBK 108. నందమూరి బాలకృష్ణ-అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాలో బాలయ్యబాబు చెల్లెలిగా నటిస్తోంది శ్రీలీల.
❤ ఐదో సినిమా బోయపాటి శ్రీను- రామ్ పోతినేని. మాస్ ఫ్యాన్స్ అంత చాలా ఇంట్రెస్ట్ గా ఎదురు చూస్తున్న ఈ సినిమాలో శ్రీలీలే హీరోయిన్ గా రామ్ సరసన నటించనుంది.❤ ఆరో సినిమా నితిన్ 32. వక్కంతం వంశీ డైరెక్షన్ లో నితిన్ ఓన్ ప్రొడక్షన్ శ్రేష్ఠమూవీస్ లో వస్తున్న ఈ సినిమాలో శ్రీలీలను హీరోయిన్ గా తీసుకున్నారు.
❤ ఏడో సినిమా ‘అనగనగా ఒకరాజు’. నవీన్ పోలిశెట్టి హీరోగా వస్తున్న ఈ సినిమాలో శ్రీలీలే హీరోయిన్.
❤ ఎనిమిదో సినిమా పంజా వైష్ణవ్ తేజ్. ‘ఉప్పెన’, ‘కొండపొలం’ హిట్స్ తర్వాత వైష్ణవ్ నుంచి వస్తున్న ఈ సినిమాలోనూ శ్రీలీల లీడ్ రోల్.
❤ తొమ్మిదో సినిమా కన్నడ నుంచి వస్తున్న ప్యాన్ ఇండియా సినిమా. రాధా కృష్ణ డైరెక్షన్ లో వారాహీ మూవీస్ లో సాయికొర్రపాటి ప్రొడ్యూస్ చేస్తున్న ‘జూనియర్’ సినిమా వస్తోంది. ఈ సినిమాలో హీరో గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు కిరీటీ రెడ్డి. ఎస్ఎస్ రాజమౌళి పూజా కార్యక్రమానికి అటెండయ్యారు. ఈ సినిమాలోనూ హీరోయిన్ గా శ్రీలీలే నటిస్తోంది.
ఇంకా శ్రీలీల కోసం వెయిట్ చేస్తున్న సినిమాలు నాలుగైదు దాకా ఉన్నాయి. అయితే, అగ్రీమెంట్ కావల్సి ఉంది. ప్రస్తుతం శ్రీలీల అంగీకరించిన సినిమాలన్నీ షూటింగ్‌లో ఉన్నాయి. దీంతో ఆమె కాల్ షీట్స్ కూడా ఖాళీగా లేవు. మొత్తంగా ఒక్కటే శ్రీలీల.. తొమ్మిది బడా సినిమాలు. స్టార్ హీరోలకు కూడా లేనన్ని బడా ప్రాజెక్టుల్లో బిజీ బిజీగా గడుపుతోందన్న మాట శ్రీలీల. ఈ తొమ్మిది సినిమాల్లో కనీసం 5 హిట్లు కొట్టినా.. శ్రీలీలా టాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్‌గా స్థిరపడిపోవడం ఖాయం.