Sreeleela at Guntur Kaaram Pre Release Event: సంక్రాంతి రేసుకు ‘గుంటూరు కారం’ సిద్ధమయ్యింది. మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ హ్యాట్రిక్ మూవీ జనవరి 12న విడుదల కానుంది. అందుకే మూవీ ప్రమోషన్స్ విషయంలో జోరు పెంచారు మేకర్స్. ఇక మూవీకి ‘గుంటూరు కారం’ అని టైటిల్ పెట్టినందుకు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గుంటూరులో ప్లాన్ చేశారు. ఈ ఈవెంట్‌లో మహేశ్ ఎంత హ్యాండ్‌సమ్‌గా కనిపించాడో.. శ్రీలీల కూడా అంతే క్యూట్‌గా, అందంగా కనిపించింది. ఇక ఈ ఈవెంట్‌ను చూసినవారిలో చాలామంది దృష్టి శ్రీలీల కట్టిన చీరపై పడింది. ఇప్పుడు దాని ధర గురించే సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది.


ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో శ్రీలీలే హైలెట్


హీరోహీరోయిన్లు ఆన్ స్క్రీన్ మాత్రమే కాదు.. ఆఫ్ స్క్రీన్ ఫాలో అయ్యే ఫ్యాషన్ సెన్స్ కూడా ప్రేక్షకులను ఆకర్షిస్తుంది. సింపుల్‌గా కనిపించినా కూడా కొందరు నటీనటులు వేసుకునే బట్టలు చాలా కాస్ట్‌లీ ఉంటాయి. దానికి ఉదాహరణ మహేశ్ బాబే. మహేశ్.. ఏ ఈవెంట్‌కు వెళ్లినా సింపుల్ టీషర్ట్ లేదా షర్ట్‌తో వెళ్తాడు. కానీ దాని ధర మాత్రం ఒక రేంజ్‌లో ఉంటుంది. ఇక ‘గుంటూరు కారం’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు శ్రీలీల కూడా సింపుల్‌గా శారీలో వచ్చేసింది. కానీ ఈ చీర ధర ఏకంగా లక్షల్లో ఉంటుందనే విషయం బయటికి రావడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇది హాట్ టాపిక్‌గా మారింది.


లక్షల్లో చీర


‘గుంటూరు కారం’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో శ్రీలీల కట్టుకున్న చీర చూసి చాలామంది మహిళలు ముచ్చటపడ్డారు. తమరి దగ్గర కూడా అలాంటి ఒక శారీ ఉంటే బాగుంటుందని అనుకున్నారు. కానీ ధర తెలిసిన తర్వాత మాత్రం ఆలోచనలో పడ్డారు. శ్రీలీల కట్టిన చీర పేరు ‘బాటిల్ గ్రీన్ కట్ వర్క్ శారీ’. ఇక ఈ చీర ధర ఏకంగా రూ.1,59,000. అంటే దాదాపుగా రూ.2 లక్షలు. చీరపై వర్క్‌లాంటిది ఏమీ లేకుండా సింపుల్‌గా ఉన్నా కూడా గడుల్లా ఉన్న దీని డిజైన్ చాలామందికి డిఫరెంట్‌గా అనిపించింది. అంతే కాకుండా ఇప్పుడు దీని ధర కూడా అందరినీ షాక్ అయ్యేలా చేస్తోంది. ఇక ‘గుంటూరు కారం’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో శ్రీలీలను చూసి ఫిదా అయిన ఫ్యాన్స్.. తన ఫోటోలను సోషల్ మీడియాలో తెగ షేర్ చేసేస్తున్నారు.


మీనాక్షి చౌదరిని పక్కన పెట్టేశారు


‘గుంటూరు కారం’లో మహేశ్ బాబుకు జోడీగా శ్రీలీల నటించగా.. మరో హీరోయిన్‌గా మీనాక్షి చౌదరి కనిపించనుంది. కానీ పోస్టర్ల దగ్గర నుంచి టీజర్, ట్రైలర్, సాంగ్స్ అన్నింటిలో శ్రీలీలనే హైలెట్ చేసి చూపించాడు దర్శకుడు త్రివిక్రమ్. ఇక ‘గుంటూరు కారం’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ ముగిసిన తర్వాత కూడా శ్రీలీల గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. దీంతో త్రివిక్రమ్ ఇతర సినిమాల్లో సెకండ్ హీరోయిన్స్ ఎంత తక్కువ సమయం స్క్రీన్‌పై కనిపిస్తారో గుర్తుచేసుకుంటూ.. మీనాక్షిది కూడా అదే పరిస్థితి అవుతుందేమో అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ప్రేక్షకులు. ఇప్పటికీ ఈ మూవీ నుంచి మీనాక్షి చౌదరికి సంబంధించిన ఒక్క పోస్టర్ మాత్రమే రిలీజ్ అయ్యింది.


Also Read: బంగారు విగ్రహానికి ప్రాణం పోస్తే మహేశ్ బాబు, అందుకే దేవుడు ఇలాంటి అవకాశం ఇచ్చాడేమో - శ్రీలీల