కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ శ్రీ విష్ణు (Sree Vishnu) డిఫరెంట్ & యూనిక్ స్టోరీలు ఎంపిక చేసుకుంటూ ప్రేక్షకులకు ప్రతి సినిమాతో అద్భుతమైన ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తున్నారు. యువ దర్శకులకు ఎక్కువగా అవకాశాలు ఇచ్చే ఆయన... కొత్త దర్శకుడు యదునాథ్ మారుతీ రావు (Yadunaath Maruthi Rao) దర్శకత్వంలో ఓ యూనిక్ ఎంటర్టైనర్ చేస్తున్నారు. ఈ సినిమా టైటిల్ వెల్లడించడంతో పాటు రిలీజ్ అప్డేట్ ఇచ్చారు.
ఫిబ్రవరిలో 'విష్ణు విన్యాసం' విడుదల!శ్రీ విష్ణు హీరోగా యదునాథ్ మారుతీ రావు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు 'విష్ణు విన్యాసం' (Vishnu Vinyasam Movie) టైటిల్ ఖరారు చేశారు. No Brakes – Just Laughs... అనేది ఉపశీర్షిక. ఈ చిత్రాన్ని హేమ - షాలిని సమర్పణలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ పతాకంపై సుమంత్ నాయుడు జి ప్రొడ్యూస్ చేస్తున్నారు. సాయి కృష్ణ బొబ్బా, రామాచారి ఎం సహ నిర్మాతలు. 'విష్ణు విన్యాసం' టైటిల్ అనౌన్స్ చేశాక... ఫిబ్రవరి 2026లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామని తెలిపారు.
శ్రీ విష్ణు జంటగా నయన్ సారిక... ఇంకా?'విష్ణు విన్యాసం'లో శ్రీవిష్ణు సరసన నయన్ సారిక కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమా టాకీ పార్ట్ మొత్తం పూర్తి అయ్యిందని, కేవలం రెండు పాటల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉందని దర్శక నిర్మాతలు తెలిపారు.
శ్రీ విష్ణు, నయన్ సారిక జంటగా నటిస్తున్న 'విష్ణు విన్యాసం' సినిమాలో సత్య, బ్రహ్మాజీ, ప్రవీణ్, మురళి శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, 'సత్యం' రాజేష్, శ్రీనివాస్ వడ్లమాని, గోపరాజు రమణ ఇతర కీలక తారాగణం. ఈ చిత్రానికి రచన - దర్శకత్వం: యదునాథ్ మారుతీ రావు, నిర్మాణ సంస్థ: శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్, నిర్మాత: సుమంత్ నాయుడు జి, సమర్పణ: హేమ & షాలిని జి, సహ నిర్మాతలు: సాయికృష్ణ బొబ్బా & రామాచారి ఎం, ఛాయాగ్రహణం: సాయి శ్రీరామ్, సంగీతం: రధన్, కళా దర్శకుడు: ఎ రామాంజనేయులు, సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి.