Sonakshi Sinha's First Look From Jatadhara Movie Unveiled: టాలీవుడ్ హీరో సుధీర్ బాబు (Sudheer Babu) నటిస్తోన్న లేటెస్ట్ మైథలాజికల్, నేచురల్ మథ్రిల్లర్ మూవీ 'జటాధర' (Jatadhara). ఈ సినిమాతోనే బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా (Sonakshi Sinha) టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారని గత కొద్ది రోజులుగా ప్రచారం సాగగా.. తాజాగా దాన్ని మేకర్స్ నిజం చేశారు. ఈ సినిమాలో ఆమె లుక్‌ను రివీల్ చేశారు. 'వుమెన్స్ డే' సందర్భంగా.. 'ఈ మహిళా దినోత్సవం జటాధారలో బలం, శక్తి దీపస్తంభం ఉదయిస్తుంది!. సోనాక్షిసిన్హాకు స్వాగతం' అంటూ సోషల్ మీడియా వేదికగా సోనాక్షి లుక్‌ను రివీల్ చేశారు.


పవర్ ఫుల్ రోల్‌లో ఆమె కనిపించబోతున్నట్లు లుక్‌ను బట్టి తెలుస్తోంది. నల్లటి కళ్లతో జుట్టు విరబూసుకొని భయపెట్టేలా ఉన్న లుక్ ఆకట్టుకుంటోంది. 'జటాధర' మూవీకి వెంకట్ కల్యాణ్ దర్శకత్వం వహిస్తుండగా.. రైన్ అంజలి, శిల్పా శిరోడ్కర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జీ స్టూడియో సమర్పణలో కె.ఆర్.బన్సాల్, ప్రేరణ అరోరా సంయుక్తంగా మూవీని నిర్మిస్తున్నారు. అనంత పద్మనాభ స్వామి ఆలయం కథాంశంతో మైథలాజికల్ థ్రిల్లర్‌గా సినిమా తెరకెక్కినట్లు తెలుస్తోంది. విభిన్న చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు నటి సోనాక్షి సిన్హా. ఇటీవలే 'హీరామండి'తో అలరించిన ఆమె.. తాజాగా 'జటాధర'లో డిఫరెంట్ లుక్‌తో ఆకట్టుకుంటున్నారు.






Also Read: 'కోర్ట్' మూవీ నచ్చకుంటే నా 'హిట్ 3' చూడొద్దు - ఆ రెండింటికీ లింక్ పెట్టిన నేచురల్ స్టార్ 'నాని'.. ఎందుకో తెలుసా..?


విభిన్న కథాంశాలతో తన నటనతో మెప్పించే యంగ్ హీరో సుధీర్ బాబు. ఆయన తాజా మూవీ 'మా నాన్న సూపర్ హీరో' ఫాదర్ ఎమోషన్‌తో ఆకట్టుకుంది. ప్రేమకథా చిత్రమ్, హరోంహర వంటి చిత్రాల్లో తనలోని మాస్ కోణాన్ని చూపించి. అలరించారు. వీటన్నింటికీ డిఫరెంట్‌గా లేటేస్ట్‌గా మైథలాజికల్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్‌లో 'జటాధర'తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. 'శాస్త్రీయం, పౌరాణిక అంశాల మేళవింపుతో ఈ స్టోరీ రాశారు. ఈ రెండు జానర్స్‌కు చెందిన ప్రపంచాల్ని సిల్వర్ స్క్రీన్‌పై చూస్తున్నప్పుడు ప్రేక్షకులు ఓ సరికొత్త అనుభూతిని పొందుతారు.' అని సుధీర్ బాబు గతంలో ఈ మూవీని ఉద్దేశించి కామెంట్ చేశారు. సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ హైప్ పెంచేసింది. సుధీర్ బాబు కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా విజువల్ ఎఫెక్ట్స్‌తో అద్భుతంగా మూవీ ఉంటుందని సినీ వర్గాల టాక్. 


Also Read: 'అమ్మకు నాకంటే నాగబాబు అంటేనే ఇష్టం' - అల్లరోడిని కాదంటూ అమ్మతో సరదాగా మెగాస్టార్ చిరంజీవి, ఆ క్షణం ఇప్పటికే బాధే అంటూ ఎమోషన్