కొందరు నటీనటులు తమ మొండితనంతో, ఎవరికీ వినని వైఖరితో తమ కెరీర్‌ను తప్పుదోవలో తీసుకెళ్తుంటారు. అలా చేసి తమ కెరీర్‌ను నాశనం చేసుకున్నవారు ఎంతోమంది ఉంటారు. తాజాగా మణిపూర్‌కు చెందిన ఒక నటికి కూడా అదే జరిగింది. మణిపూర్‌కు చెందిన సోమ లైష్రామ్ అనే నటిని మూడేళ్లు సినిమాల్లో నటించకుండా, అసలు ఎలాంటి ఈవెంట్స్‌కు అటెండ్ అవ్వకుండా ఒక సంస్థ బ్యాన్ చేసింది. తను ఢిల్లీలో జరిగిన ఒక ఫ్యాషన్ షోలో పాల్గొనడమే దీనికి కారణమని తెలుస్తోంది. అయితే అందులో పాల్గొనడంలో తప్పేముంది అని చాలామంది ప్రేక్షకులకు అనిపించినా.. దీని వెనుక చాలా పెద్ద కథే ఉంది.
మణిపూర్‌కు చెందిన కంగ్లేపాక్ కంబా లప్ (కేకేఎల్) అనే సంస్థ.. ఫిల్మ్ ఇండస్ట్రీకి పలు ఆదేశాలు పంపి వారిని షాక్‌కు గురిచేసింది. అందులోనూ సోమ లైష్రామ్‌కు సినిమాలోని బ్యాన్ విధించడం అనేది ఇండస్ట్రీ సైతం వెనుదిరిగేలా చేసింది. మణిపూర్‌కు చెందిన ఫిల్మ్ ఫారమ్ మణిపూర్ (ఎఫ్ఎఫ్ఎమ్) అనే సంస్థ.. ఆ రాష్ట్రంలోని సినీ వ్యవహారాలు అన్నీ చూసుకుంటోంది. ఇక కేకేఎల్ చేస్తున్న పనులకు కచ్చితంగా సమాధానం చెప్పి తీరాలని ఎఫ్ఎఫ్ఎమ్ రివర్స్ అయ్యింది. దీనికి ఎలాగైనా పరిష్కారం తీసుకురావాలని నిర్ణయించుకుంది. ఒక నటి కెరీర్‌ను ఫిల్మ్ బాడీ కాపాడాల్సిన బాధ్యత ఉందని ఇతర నటీనటులు వాపోతున్నారు.
150 చిత్రాల్లో నటి..
ఇప్పటివరకు సోమ.. 150 మణిపూరీ చిత్రాల్లో నటించింది. అంతే కాకుండా తన నటనకు ఎన్నో అవార్డులను కూడా అందుకుంది. తను ఢిల్లీలో బ్యూటీ కాంటెస్ట్‌లో పాల్గొనే విషయంలో పలు మనస్పర్థలను చోటుచేసుకున్నాయని క్లారిటీ ఇచ్చింది. ఢిల్లీలోని తాల్కతోరా స్టేడియంలో జరిగిన నార్త్ ఈస్ట్ స్టూడెంట్స్ ఫెస్టివల్‌లో సోమ.. షో స్టాపర్‌గా వ్యవహరించింది. అక్కడ మణిపూర్‌లో జరుగుతున్న విధ్వంసం గురించి స్పీచ్‌లో కూడా చెప్పింది. మణిపూర్‌లో పరిస్థితులు మామూలుగా అవ్వాలని, అక్కడవారికి శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్టుగా ఆ వేదిక మీద తెలిపింది.
ఫ్యాషన్ షో కాదు..
‘‘ఒక ప్రొఫెషనల్ యాక్టర్‌గా, సోషల్ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మణిపూర్‌లో జరుగుతున్న ఇబ్బందుల గురించి మాట్లాడడం నా బాధ్యత. దానికోసం నేను ఈ వేదికను ఎంచుకుంటున్నాను. నేను మై హోమ్ ఇండియా అనే ఎన్జీవో నిర్వహించిన నార్త్ ఈస్ట్ ఫెస్టివల్‌లో పాల్గొన్నాను. అది ఒక కల్చర్ ప్రోగ్రామ్. నాగాల్యాండ్, మిజోరమ్, అస్సామ్, అరుణాచల్ ప్రదేశ్ లాంటి తదితర రాష్ట్రాలు పాల్గొన్న కల్చర్ ఈవెంట్ అది. మణిపూర్ నుండి అక్కడికి వెళ్లే అవకాశం నాకు దక్కింది. వారు నన్ను ఆహ్వానించారు. అందుకే నేను ఆ అవకాశాన్ని వదులుకోవాలని అనుకోలేదు’’ అంటూ అసలు తన వెళ్లింది ఫ్యాషన్ షోకు కాదని, కల్చర్ ఈవెంట్‌కు అని క్లారిటీ ఇచ్చింది సోమ.
సోమకే సపోర్ట్..
సోమపై బ్యాన్ విధించిన కెకెఎల్ సంస్థ మాత్రం తనను ముందే కలిశామని, ఢిల్లీలోని కార్యక్రమంలో పాల్గొవద్దని చెప్పామని, అయినా తను వినలేదని వెల్లడించారు. అందుకే తనపై బ్యాన్ విధించాల్సి వచ్చిందని అన్నారు. మణిపూర్ సినీ పరిశ్రమకు సంబంధించిన బోర్డ్ కూడా సోమకు అక్కడికి వెళ్లవద్దు అని చెప్పినా.. తను వినకపోవడంతో పర్యావసనాలు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపింది. ఫ్యాషన్ షోలపై తమకు మంచి అభిప్రాయం లేదని, అందుకే వ్యతిరేకిస్తామని ఎఫ్ఎఫ్ఎమ్ వెల్లడించింది. అయినా కూడా సోమ కోసం స్టాండ్ తీసుకుంటామని క్లారిటీ ఇచ్చింది. కెకెఎల్‌ను ఎదిరిస్తామని చెప్పింది.
Also Read: వైసీపీ సాంగ్ పాడిన రాహుల్ సిప్లిగంజ్ - ఇదంతా ఆర్జీవీ ‘వ్యూహం’ కోసమే!
Join Us on Telegram: https://t.me/abpdesamofficial