సినిమాలపై రాజకీయాల ప్రభావం ఎలా ఉంటుందో.. రాజకీయాలపై కూడా సినిమాల ప్రభావం అలాగే ఉంటుంది. అందుకే తన సినిమాలతో రాజకీయాల్లో దుమారం సృష్టించాలని అనుకున్నాడేమో కాంట్రవర్షియల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. ఈమధ్యకాలంలో ఆర్జీవీ చేస్తున్న సినిమాలు చూస్తుంటే.. అదే నిజమని అనిపిస్తోంది. ఒకప్పుడు తన డిఫరెంట్ కథలతో, క్రైమ్ డ్రామాలతో టాలీవుడ్‌లోనే కాకుండా బాలీవుడ్‌లో కూడా ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిన వర్మ.. ఇప్పుడు తన సినిమాల్లో పూర్తిగా రాజకీయాన్ని మాత్రమే చూపించడానికి ఇష్టపడుతున్నాడు. అలా వర్మ తాజాగా తెరకెక్కించిన మూవీ ‘వ్యూహం’. ఈ సినిమా నుండి రాహుల్ సిప్లిగంజ్ పాడిన ఒక కాంట్రవర్షియల్ పాట గ్లింప్స్‌ను సోషల్ మీడియాలో విడుదల చేశాడు రామ్ గోపాల్ వర్మ.


ఆంధ్రప్రదేశ్ రాజకీయాల ఆధారంగా ‘వ్యూహం’..
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో నడుస్తున్న రాజకీయాలు.. సినిమాలకంటే ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయని, క్రికెట్ మ్యాచ్‌లను మించి ఎగ్జైటింగ్‌గా సాగుతున్నాయని ఆంధ్ర ప్రజలు అంటున్నారు. అందుకే రామ్ గోపాల్ వర్మ ఫోకస్ కూడా పూర్తిగా ఆంధ్ర పాలిటిక్స్‌పైనే ఉన్నట్టు అనిపిస్తోంది. అసలు తన సినిమాల ద్వారా వర్మ.. ఏ రాజకీయనాయకుడిని సపోర్ట్ చేస్తున్నాడో, అసలు ఆ సినిమాలతో తన ప్రజలకు ఏం చెప్పాలని అనుకుంటున్నాడో అన్న విషయం ఎప్పుడూ ఒక కన్ఫ్యూజన్‌గానే మిగిలిపోతుంది. ఇప్పటికే ఆంధ్ర పాలిటిక్స్‌పై, అక్కడి పొలిటీషియన్స్‌పై పలు సినిమాలు తెరకెక్కించిన వర్మ.. త్వరలోనే ‘వ్యూహం’ అనే చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.


అప్పుడు ట్రైలర్స్.. ఇప్పుడు సాంగ్స్..
రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘వ్యూహం’ చిత్రం పూర్తిగా ఆంధ్రప్రదేశ్‌లోని రాజకీయాలపై, 2024 ఎన్నికలపైనే ఆధారపడి ఉంటుందని ఇప్పటికే వాటి టీజర్, ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. చంద్రబాబు, వైఎస్ జగన్, పవన్ కళ్యాణ్ లాంటి రాజకీయనాయకులను టార్గెట్ చేస్తూ.. ఆర్జీవీ ఈ సినిమాలకు సంబంధించిన ప్రతీ అప్డేట్‌ను విడుదల చేస్తున్నాడు. అంతే కాకుండా తన సోషల్ మీడియాలోని చాలావరకు పోస్టులు కూడా ‘వ్యూహం’ సినిమాతో ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్‌ను పోలుస్తూనే కనిపిస్తున్నాయి. అయితే ఇప్పటివరకు కేవలం టీజర్స్, ట్రైలర్స్‌తో వ్యూహాన్ని చూపించిన ఆర్జీవీ.. ఇప్పుడు ఏకంగా ఒక పాటను విడుదల చేశాడు. అది విన్న ప్రేక్షకులంతా ఒక్కసారిగా షాకవుతున్నారు.


‘వ్యూహం’ నుంచి ‘వైఎస్సార్సీపీ’ పాట..
తన స్వరంతో ఒక పాటకు స్పెషల్ క్రేజ్‌ను తీసుకొచ్చి ఆస్కార్ వరకు వెళ్లిన రాహుల్ సిప్లిగంజ్‌ను ‘వ్యూహం’లోని అతి ముఖ్యమైన పాటను పాడడానికి ఎంపిక చేశాడు రామ్ గోపాల్ వర్మ. ఆ పాట పేరు ‘వైఎస్సార్సీపీ’. ‘ఢీ కొట్టే మా పార్టీ వచ్చింది చూడు, దమ్మున్న మా పార్టీ వచ్చింది చూడు’ అంటూ ఈ పాట ప్రారంభం అయ్యింది. ‘ఆంధ్ర ప్రాంతంలో పుట్టింది, సీమ సింగంలాగా తొడకొట్టింది’ అంటూ పాటలోని లిరిక్స్ ఒక పార్టీని ఉద్దేశించినట్టుగా రాశారు లిరిసిస్ట్. ఇది విన్న ఆంధ్ర ప్రజలు, ఒక పార్టీ నేతలు అసలు రామ్ గోపాల్ వర్మ ఎందుకు ఇలా చేస్తున్నారు అంటూ అయోమయంలో పడ్డారు. తమపైనే ఫోకస్ చేస్తున్నారంటూ ఆ పార్టీ నేతలు, అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘వ్యూహం’లో అజ్మల్ అమర్, మానసా రాధాకృష్ణన్ లీడ్ రోల్స్ చేస్తున్నారు. ధనుంజయ్ ప్రభూన్, సురభి ప్రభావతి, రేఖా సురేఖా, వాసు ఇంటూరి, కోటా జయరామ్ వంటి వారు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.






Also Read: చంద్రబాబు అరెస్ట్ భయమేసేలా చేసింది - హీరో విశాల్ కీలక వ్యాఖ్యలు !


Join Us on Telegram: https://t.me/abpdesamofficial