Vishal : హైదరాబాద్‌లో తన కొత్త సినిమా ప్రమోషన్ కోసం వచ్చిన ఆయన హీరో విశాల్  చంద్రబాబు అరెస్టుపై స్పందించించారు.   “అరెస్టుకు ముందు కొంచెం అలోచించి ఉంటే బాగుండేది. అలాంటి వ్యక్తిని అరెస్ట్ చేస్తే మాలాంటి సామాన్యులకు ఒక భయం కలుగుతుంది. పక్కా ఆధారాలతో అరెస్ట్ చేసి ఉంటే బాగుండేది” అంటూ విశాల్ కామెంట్ చేశాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. కాగా విశాల్ చిన్నతనం చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలోనే సాగింది. గతంలో విశాల్ కుప్పం రాజకీయంలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడని, వైసీపీ నుంచి బరిలోకి దిగి చంద్రబాబు పై పోటీ చేయనున్నాడని ప్రచారం జరిగింది. కానీ ఆయన ఖండించారు. రాజకీయాల్లోకి రావట్లేదన్నారు. 

  


టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు   ని సీఐడీ అధికారులు అరెస్ట్ చేయడం పై అభిమానులు, ఐటీ ఉద్యోగులు, పలువురు ప్రముఖులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.  సినీ పరిశ్రమ వ్యక్తులు కూడా కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ లోని పలువురు ప్రముఖులు స్పదించగా.. అటు తమిళ సినీ పరిశ్రమకు చెందిన సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా రియాక్ట్ అయ్యారు. చంద్రబాబు పోరాటయోధుడని.. త్వరలోనే బయటకు వచ్చి మళ్లీ  యాక్టివ్ అవుతారన్నరు.   విశాల్ నటించిన ‘మార్క్ ఆంటోనీ’   చిత్రం  తెలుగులో కూడా రిలీజ్ అయిన ఈ మూవీ మంచి విజయం అందుకుంది.   హైదరాబాద్ లో సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కి విశాల్ కూడా హాజరయ్యాడు. ఇక ఈ కార్యక్రమంలో విశాల్ చంద్రబాబు అరెస్ట్ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా మారాయి.


 


తెలుగుచిత్ర సీమలో ఇతర పెద్దలు పెద్దగా స్పందించలేదు.   తెలుగు సినీ పరిశ్రమ రాజకీయాలకు, మతపరమైన అంశాలకు ఎప్పుడూ దూరంగానే ఉందని నిర్మాత దుగ్గుబాటి సురేష్ బాబు తెలిపారు.  అందుకే సెన్సిటివ్ విషయాలపై చిత్ర పరిశ్రమ నుంచి స్పందన  ఉండదన్నారు.  తెలంగాణ, ఆంధ్ర విషయంలోనూ సినీ పరిశ్రమ స్పందించలేదని గుర్తు చేశారు.   రాఘవేంద్రరావు, అశ్వనీదత్,  కేఎస్ రామారావు, నట్టికుమార్, సూపర్ స్టార్ రజినీకాంత్‌లు స్పందించారు. చంద్రబాబు నాయుడు పోరాట మోధుడు అని ఆయనను అక్రమ కేసులు ఏమీ చేయలేదని రాఘవేంద్రరావు అన్నారు.  ‘శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కృపా కటాక్షాలతో అలిపిరి బాంబ్ బ్లాస్ట్ నుంచి ఆనాడు నారా చంద్రబాబు నాయుడు క్షేమంగా ఎలా అయితే బ్రతికి బయట పడ్డారో ఇప్పుడు కూడా ఆ స్వామి వారి ఆశీస్సులతోనే ఎలాంటి బ్లాక్ మార్క్ లేకుండా జైలు నుంచి తప్పకుండ బయటకు వస్తారు’ అని దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు ఆశాభావం వ్యక్తం చేశారు.


సినీ నిర్మాత అశ్వినీదత్.. చంద్రబాబు అరెస్టును తీవ్రంగా ఖండించారు. చంద్రబాబును అరెస్టు చేసిన వారికి పుట్టగతులు ఉండవంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు అశ్వినీదత్ వీడియోను విడుదల చేశారు.ఈ దేశానికి గొప్ప ప్రధాని, స్పీకర్‌తోపాటు గొప్ప రాష్ట్రపతిని అందించిన ఘనత చంద్రబాబుదని అన్నారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు ప్రమేయం లేకపోయిన దుర్మార్గకరంగా అరెస్టు చేసి లేనిపోని విమర్శలు చేస్తున్నారని, వారెవరికి పుట్టగతులు ఉండవని అన్నారు.  



ప్రధాని మోదీకి టాలీవుడ్ సీనియర్ నిర్మాత కె.ఎస్ రామారావు లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న పరిణామాల పట్ల కేఏ ఎస్ రామారావు ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ లేఖ రాశారు. మోదీకి తెలియకుండానే చంద్రబాబును జగన్ అరెస్ట్ చేయించారా? అని లేఖలో ప్రశ్నించారు. ఏపీలో ప్రస్తుత పరిస్థితుల్ని చూసి బాగా విసిగిపోయానని.. ప్రజావేదిక కూల్చివేతతో జగన్ విధ్వంసక పాలన మొదలుపెట్టారని అన్నారు. ఏపీలో మళ్లీ అసెంబ్లీ ఎన్నికలు జరిపే వరకు రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్దరించాలని కేఎస్ రామారావు ప్రధాని మోదీని కోరారు.