అఖిల్ అక్కినేని పెళ్లి సందడి (Akhil Akkineni Wedding) ముగిసింది. జైనాబ్ రావ్జీ (Zainab Ravdjee)తో ఆయన ఏడు అడుగులు వేశారు. వివాహ వేడుక కుటుంబ సభ్యుల మధ్య జరిగినప్పటికీ... రిసెప్షన్‌కు మాత్రం ఇండస్ట్రీ ప్రముఖులు అందరిని ఆహ్వానించారు. రాజకీయ నాయకుల సైతం విచ్చేసి కొత్త జంటకు శుభాకాంక్షలు చెప్పారు. అందులో అక్కినేని నాగచైతన్య - శోభిత ధూళిపాళ జంట ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇప్పుడు శోభిత గురించి ఒక కొత్త డిస్కషన్ జరుగుతోంది.
శోభిత చేతిలో బ్యాగ్ రేట్ ఎంతో తెలుసా?
అఖిల్ వెడ్డింగ్ రిసెప్షన్‌లో రెడ్ కలర్ శారీ కట్టుకుని శోభిత ధూళిపాళ (Sobhita Dhulipala) సందడి చేశారు. అసలే హీరోయిన్. పైగా తెలుగు అమ్మాయి. మన ట్రెడిషన్ తెలిసిన అమ్మాయి. మోడ్రన్ లుక్ ఇచ్చే సారీ కట్టుకుని చాలా సాంప్రదాయబద్ధంగా కనిపించారు. ఆ సమయంలో ఆవిడ చేతిలో ఒక హ్యాండ్ బ్యాగ్ ఉంది. చేతిలో బ్యాగ్ కదా అని తీసిపారేయకండి. దాని రేటు తెలిస్తే ఔరా అని నోరు వెళ్ళబెడతారు.
క్రిస్టియన్ డియర్ కంపెనీకి చెందిన హ్యాండ్ బ్యాగ్ (Christian Dior black leather medium shoulder bag) శోభిత చేతిలో ఉంది. దాని రేటు అక్షరాల మూడు లక్షల 37 వేల రూపాయలు. కింగ్ అక్కినేని నాగార్జున పెద్ద కోడలు అంటే ఆ మాత్రం ఉంటుంది కదా మరి. బాలీవుడ్ హీరోయిన్లకు ధీటుగా ఖరీదైన హ్యాండ్ బ్యాగ్ పట్టుకుని శోభిత కనిపించారు. ఆవిడ తెలుగు అమ్మాయి అయినా బాలీవుడ్ హీరోయిన్ కదా. హిందీలో సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేశారు.
Also Read: అలప్పూజా జింఖానా రివ్యూ: సోనీ లివ్ ఓటీటీలో మలయాళ స్పోర్ట్స్ డ్రామా - తెలుగులోనూ స్ట్రీమింగ్
పెళ్లిలో అతిథులను ఆహ్వానించిన వదిన!
అఖిల్ పెళ్లితో పాటు రిసెప్షన్‌లోనూ అక్కినేని ఇంటి పెద్ద కోడలు బాధ్యతలు నిర్వహించారు శోభిత. అతిధులను ఆహ్వానించారు. సోషల్ మీడియాలో చాలా మంది ఆవిడను వదిన అని కామెంట్ చేయడం చూడవచ్చు. నిజంగానే వదిన గారు మరిది పెళ్లి పనుల్లో బిజీ బిజీగా గడిపారని తెలిసింది.