యువ కథానాయకుడు ఉస్తాద్ రామ్ పోతినేని (Ram Pothineni) హుషారుకు, ఎనర్జీకి నో లిమిట్స్! తెలుగు చిత్రసీమలో డ్యాన్స్ ఇరగదీసే యువ కథానాయకులలో ఆయన పేరు తప్పకుండా ముందు వరుసలో ఉంటుంది. మరి, కథానాయికల్లో? అందంతో మాత్రమే కాకుండా నృత్యంతోనూ ఆకట్టుకున్న భామల్లో శ్రీ లీల (Sreeleela) పేరు సైతం ముందు వరుసలో ఉంటుంది. 


రామ్, శ్రీ లీల తొలిసారి జంటగా నటిస్తున్న సినిమా 'స్కంద - ది ఎటాకర్' (Skanda The Attacker Movie). ఆల్రెడీ సినిమాలో ఓ పాట విడుదల చేశారు, ఇప్పుడు రెండో పాటను విడుదల చేయడానికి రెడీ అయ్యారు. 


గందారబాయ్... మాస్ నంబరోయ్!
GandaraBai Song : 'స్కంద - ది ఎటాకర్' సినిమాలో రెండో పాట 'గందారబాయ్' ప్రోమోను గురువారం సాయంత్రం 6.21 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తెలియజేసింది. ఫుల్ సాంగ్ / లిరికల్ వీడియో ఈ నెల 18న సాయంత్రం 5.49 గంటలకు విడుదల చేయనున్నారు. 


Also Read చిరంజీవి అభిమాని సినిమా - ట్రైలర్ విడుదల చేసిన రామ్ చరణ్ 






బ్లాక్ బస్టర్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను సినిమాల్లో భారీ తనానికీ లిమిట్స్ ఉండవు. ఆయన దర్శకత్వానికి రామ్ ఎనర్జీ కలిస్తే... స్క్రీన్ మీద ఆటంబాంబు తరహాలో ఫైట్లు, సీన్లు ఉంటాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందుకు చక్కటి ఉదాహరణ 'స్కంద' ఫస్ట్ థండర్. రామ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన చిన్న వీడియో గ్లింప్స్ ఆ గ్రాండియర్ చూపించింది. ఆల్రెడీ విడుదలైన పాట కూడా ప్రేక్షకాదరణ అందుకుంది. 


Also Read 'గుంటూరు కారం'లో మహేష్ బాబు షర్ట్ మహా కాస్ట్లీ గురూ - రేటెంతో తెలుసా?


రామ్, బోయపాటి శ్రీను... ఇద్దరికీ తమన్ సూపర్ హిట్ ఆల్బమ్స్, రీ రికార్డింగ్స్ ఇచ్చారు. ఇప్పుడు ఇద్దరితో కలిసి పని చేస్తున్నారు. బోయపాటి శ్రీను లాస్ట్ సినిమా 'అఖండ'కు తమన్ అద్భుతమైన నేపథ్య సంగీతం అందించడంతో... 'స్కంద' సంగీతంపై అంచనాలు నెలకొన్నాయి. 


సెప్టెంబర్ 15న 'స్కంద' పాన్‌ ఇండియా రిలీజ్‌!
'స్కంద' చిత్రీకరణ కొన్ని రోజుల క్రితం పూర్తి అయ్యింది. హీరో హీరోయిన్లు రామ్, శ్రీ లీలపై పాటను చిత్రీకరించారు. ఆ పాటనే ఇప్పుడు విడుదల చేస్తున్నారు. 'స్కంద' సినిమాను పవన్ కుమార్, జీ స్టూడియోస్ సంస్థ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సినిమా విడుదల కానుంది. ఈ సినిమా సెప్టెంబర్ 15న విడుదల కానుంది. 
 
ఆల్రెడీ విడుదలైన ఫస్ట్ థండర్‌లో ''నీ స్టేటు దాటలేనన్నావ్... దాటా! నీ గేటు దాటలేనన్నావ్... దాటా! నీ పవర్ దాటలేనన్నావ్... దాటా! ఇంకేంటి దాటేది... నా బొంగులో లిమిట్స్!'' అంటూ రామ్ చెప్పిన డైలాగ్ పాపులర్ అయ్యింది. లిమిట్స్ ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ సోషల్ మీడియాలో యూత్ ఈ డైలాగ్ చెబుతున్నారు. సంగీత దర్శకుడు తమన్ అందించిన నేపథ్య సంగీతానికి ప్రశంసలు లభిస్తున్నాయి. హీరో పేరు (రాపో - రామ్ పోతినేని) పేరు వచ్చేలా కంపోజ్ చేసిన బీజీఎమ్ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది. యంగ్ హీరోల్లో హీరో పేరు మీద ఈ స్థాయిలో మాస్ బీజీఎమ్  చేయడం ఇదే తొలిసారి అని చెప్పాలి. ఈ సినిమాలో కూడా ఊర్వశి రౌతేలా ఓ స్పెషల్ సాంగ్ చేశారు.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial