Skanda Movie Song : డుమ్మారే డుమా డుమ్మారే - 'స్కంద'లో ఫ్యామిలీ సాంగ్ వచ్చిందిరోయ్! 

Ram Saiee Manjrekar Song : రామ్ హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కించిన సినిమా 'స్కంద'. ఇందులో కొత్త పాట 'డుమ్మారే డుమ్మా డుమ్మారే'ను ఈ రోజు విడుదల చేశారు. 

Continues below advertisement

ఉస్తాద్ రామ్ పోతినేని (Ram Pothineni) కథానాయకుడిగా మాస్ కమర్షియల్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'స్కంద' (Skanda Movie). శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి ఉన్నత సాంకేతిక విలువలు, భారీ నిర్మాణ వ్యయంతో రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో 'డుమ్మారే డుమ్మా డుమ్మారే...' పాటను ఈ రోజు విడుదల చేశారు. 

Continues below advertisement

కుటుంబ అనుబంధాలు...
సంతోషాలే ప్రధానాంశంగా!
దర్శకుడు బోయపాటి శ్రీను సినిమాల్లో కుటుంబ సభ్యుల మధ్య బంధాలు, వాళ్ళ అనుబంధాలను తప్పకుండా చూపిస్తారు. ఆయన సినిమాల్లో యాక్షన్ ఎంత ఉంటుందో... ఫ్యామిలీ ఎమోషన్స్, సెంటిమెంట్ కూడా అదే స్థాయిలో ఉంటుంది. ఫ్యామిలీ నేపథ్యంలో ఒక్క పాట అయినా సరే తప్పకుండా ఉంటుంది. ఇప్పుడీ 'డుమ్మారే డుమ్మా డుమ్మారే...' పాటను చూస్తే అదే అనిపిస్తోంది.  

'స్కంద'లో శ్రీ లీల మెయిన్ హీరోయిన్. అయితే... ఆమెతో పాటు సినిమాలో మరో కథానాయికకు కూడా చోటు ఉంది. తెలుగులో 'మేజర్', 'గని' సినిమాల్లో నటించిన ఉత్తరాది భామ, ప్రముఖ దర్శక - నటుడు మహేష్ మంజ్రేకర్ కుమార్తె సయీ మంజ్రేకర్ ఆ అవకాశం అందుకున్నారు. 

'డుమ్మారే డుమ్మా డుమ్మారే...' పాటను రామ్, సయీ మంజ్రేకర్, ఇతర కుటుంబ సభ్యులపై అందమైన లొకేషన్లలో చిత్రీకరించారు. పాట ప్రారంభంలో శ్రీకాంత్ కూడా కనిపించారు. కల్యాణ చక్రవర్తి త్రిపురనేని రాసిన ఈ పాటను అర్మాన్ మాలిక్, అయ్యాన్ ప్రణతి ఆలపించారు. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.

Also Read బాలయ్య వస్తే తీన్మార్ కాదు, సౌమార్ కొట్టాల్సిందే - 'భగవంత్ కేసరి' ఫస్ట్ సాంగ్ ప్రోమో చూశారా?
 

'స్కంద' ట్రైలర్ ఎలా ఉందంటే?
ఇటీవల 'స్కంద' ట్రైలర్ విడుదల చేశారు. అందులో బోయపాటి మాస్ హీరోయిజం కనిపించింది. ఆల్రెడీ టీజర్‌లో మాస్ మూమెంట్స్ ఏ స్థాయిలో ఉంటాయో? రామ్ క్యారెక్టర్ ఎలా ఉంటుందో? హింట్ ఇచ్చిన బోయపాటి... ట్రైలర్‌లో మరింత మాస్ చూపించారు. ఫ్యామిలీ ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు ఉంటాయని కూడా చూపించారు. 

Also Read 'ఖుషి' ప్రీ రిలీజ్ డీటెయిల్స్ - విజయ్ దేవరకొండ ముందున్న టార్గెట్ ఎంత?

ఐదు భాషల్లో 'స్కంద - ది ఎటాకర్' విడుదల
తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సెప్టెంబర్ 15న వినాయక చవితి కానుకగా ఈ సినిమా విడుదల కానుంది. రామ్ హీరోగా నటించిన చిత్రాలను హిందీలో డబ్ చేసిన యూట్యూబ్ లో రిలీజ్ విడుదల చేయగా... రికార్డ్ స్థాయిలో వ్యూస్ వచ్చాయి. అలాగే, బోయపాటి శ్రీను సినిమాలకు కూడా! ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి ఫస్ట్ టైమ్ పాన్ ఇండియా సినిమా చేశారు. అందువల్ల, 'స్కంద' మీద పాన్ ఇండియా ప్రేక్షకుల దృష్టి పడింది.  

రామ్ పోతినేని, శ్రీ లీల జంటగా నటించిన ఈ సినిమాలో సయీ మంజ్రేకర్ రెండో కథానాయిక. శ్రీకాంత్, ఇంద్రజ, గౌతమి, పృథ్వీరాజ్, ప్రిన్స్ ప్రధాన తారాగణం.  బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా స్పెషల్ సాంగ్ చేశారు. 'స్కంద' చిత్రానికి కూర్పు : తమ్మిరాజు, ఛాయాగ్రహణం : సంతోష్ డిటాకే, సమర్పణ : జీ స్టూడియోస్ సౌత్, పవన్ కుమార్, సంగీతం : ఎస్ తమన్, నిర్మాత : శ్రీనివాస చిట్టూరి, రచన - దర్శకత్వం : బోయపాటి శ్రీను.

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Continues below advertisement