నిర్మాత కె.ఇ. జ్ఞానవేల్ రాజా తన పారితోషికం ఇవ్వలేదని శివ కార్తికేయన్ మద్రాస్ హైకోర్టుకు వెళ్లారు. తనకు ఇవ్వవలసిన మొత్తంలో నాలుగు కోట్ల రూపాయలు ఎగొట్టారని ఆరోపించారు. ఇచ్చిన డబ్బులకు కూడా టీడీఎస్ కట్టలేదని పేర్కొన్నారు. అసలు, ఈ గొడవ ఏంటి? అనే వివరాల్లోకి వెళితే...


శివ కార్తికేయన్, నయనతార జంటగా నటించిన సినిమా 'మిస్టర్ లోకల్'. దీనికి కె.ఇ. జ్ఞానవేల్ రాజా. స్టూడియో గ్రీన్ ఫిలిమ్స్ పతాకంపై నిర్మించారు. మే 17, 2019న విడుదలైంది. మూడేళ్ళ క్రితం విడుదలైన సినిమాకు ఇప్పుడు గొడవ ఏంటి? అంటే... ఆ సినిమాలో హీరో శివ కార్తికేయన్‌కు 15 కోట్ల రూపాయలు పారితోషికం ఇస్తామని జ్ఞానవేల్ రాజా ఒప్పందం చేసుకున్నారట. తనకు రూ. 15 కోట్లలో రూ. 11 కోట్లు మాత్రమే ఇచ్చారని, దానికి కూడా టీడీఎస్ కట్టలేదని, మిగతా నాలుగు కోట్లు ఇవ్వలేదని మద్రాస్ హైకోర్టులో శివ కార్తికేయన్ కేస్ వేశారు. ఆ రూ. 11 కోట్లకు రూ. 91 లక్షలు టీడీఎస్ కట్ అయ్యిందట.


Also Read: విశ్వామిత్రగా విశ్వక్ సేన్, ఆ సినిమాలో స్పెషల్ రోల్!


ప్రస్తుతం జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న 'రెబల్', 'చియాన్ 61', 'పత్తు తల' సినిమాల్లో ఎటువంటి పెట్టుబడులు పెట్టకుండా, అలాగే థియేట్రికల్ అండ్ ఓటీటీ రైట్స్ అమ్మకుండా ఇంజెక్షన్ ఆర్డర్ ఇవ్వాలని కోర్టును శివ కార్తికేయన్ కోరారు.


'రెమో', 'శక్తి', 'సీమ రాజా', 'వరుణ్ డాక్టర్' తదితర అనువాద సినిమాలతో తెలుగులో కూడా విజయాలు అందుకున్న శివ కార్తికేయన్, ఇప్పుడు 'జాతిరత్నాలు' ఫేమ్ కె.వి. అనుదీప్ దర్శకత్వంలో తెలుగు - తమిళ బైలింగ్వల్ సినిమా చేస్తున్నారు. 



Also Read: శ్రీరామనవమికి ప్రభాస్ ఫ్యాన్స్‌కు డ‌బుల్ ధమాకా! ఆ రోజు 'ఆదిపురుష్' అప్‌డేట్ ఏంటంటే?