Sivakarthikeyan's Madharaasi OTT Deal Locked: కోలీవుడ్ స్టార్ శివకార్తికేయన్ హీరోగా స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురగదాస్ దర్శకత్వంలో రాబోతోన్న పాన్ ఇండియా మూవీ 'మదరాసి'. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన సాంగ్స్, లుక్స్ భారీ హైప్ క్రియేట్ చేస్తున్నాయి. సెప్టెంబర్ 5న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండగా... రిలీజ్‌కు ముందే ఓటీటీ డీల్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.

ఆ ఓటీటీకే డిజిటల్ రైట్స్!

లేటెస్ట్ బజ్ ప్రకారం 'మదరాసి' మూవీ డిజిటల్, శాటిలైట్ డీల్ క్లోజ్ అయినట్లు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ 'అమెజాన్ ప్రైమ్ వీడియో' డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇక శాటిలైట్ రైట్స్‌ను Zee నెట్వర్క్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. అయితే, ఈ విషయాన్ని నిర్మాతలు అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. థియేట్రికల్ రన్ తర్వాత ఈ మూవీ ఓటీటీలోకి వచ్చే ఛాన్స్ ఉంది. మూవీ రిలీజ్ అయిన తర్వాత దాదాపు 6 నుంచి 8 వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read: పవన్ కళ్యాణ్ 'ఓజీ'లో రెండో పాట రెడీ... 'ఫైర్ స్ట్రోమ్' రేంజ్‌లో ఉంటుందా? రిలీజ్ ఎప్పుడంటే?

ఈ మూవీలో శివకార్తికేయన్ సరసన రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. హై యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా మూవీ తెరకెక్కుతుండగా పవర్ ఫుల్ రోల్‌లో శివకార్తికేయన్ కనిపించబోతున్నారు. వీరితో పాటే విద్యుత్ జమ్వాల్, బిజు మేనన్, విక్రాంత్, షబీర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీలక్ష్మీ మూవీస్ బ్యానర్‌పై నిర్మిస్తుండగా... అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నారు. రీసెంట్‌గా రిలీజ్ చేసిన 'వర... వర... వరదల్లే' సాంగ్ ఆకట్టుకుంటోంది. సెప్టెంబర్ 5న తెలుగు, తమిళంతో పాటు ఇతర భాషల్లోనూ రిలీజ్ చేయనున్నారు.

రజినీకాంత్ 'దర్బార్' మూవీ తర్వాత డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రాబోతోన్న హై యాక్షన్ ఎంటర్‌టైనర్‌పై భారీ హైప్ క్రియేట్ అవుతోంది. ఇక గతేడాది 'అమరన్'తో మంచి విజయం అందుకున్నారు. ఈ మూవీతో ఆ జోష్ కొనసాగించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.