Sivakarthikeyan Ayalaan Telugu OTT Release Date and Streaming Update: తమిళ్‌ స్టార్‌ హీరో శివకార్తీకేయకు ప్రత్యేకమైన ఫ్యాన్స్‌ బేస్‌ ఉంది. తనదైన నటనతో ఎంతోమంది అభిమానులను సంతోషం చేసుకున్నారు. డిబ్బింగ్‌ చిత్రాలతో తెలుగులోనూ ఆయన మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ సంపాదించుకున్నాడు. రొటిన్‌కు భిన్నంగా కథలు ఎంచుకంటూ ఎప్పుడు సరికొత్త కంటెంట్‌ ఆడియన్స్‌ని ఆకట్టుకుంటాడు. ఒక్కో సినిమాకు సంబంధం లేకుండా ప్రతిసారి ఓ కొత్త జానర్‌తో వస్తాడు. రీసెంట్‌గా అతడు ఏలియన్‌ కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సైన్స్‌ ఫిక్స్‌న్‌ డ్రామాగా తెరకెక్కిన 'అయలాన్‌' ఈ సంక్రాంతికి తమిళ్‌ థియేటర్లో విడుదలైంది.


ఓటీటీకి అయలాన్ తెలుగు వెర్షన్


Ayalaan Telugu OTT Release: తెలుగు వెర్షన్‌ కూడా అప్పుడే రిలీజ్‌ కావాల్సి ఉండగా టాలీవుడ్‌ స్టార్స్‌ స్ట్రయిట్‌ సినిమాలు ఉండటంతో వెనక్కి తగ్గింది. ఆ తర్వాత ఫిబ్రవరి రిలీజ్‌ చేయాలనుకున్న కొన్ని కారణాల వల్ల అది వాయిదా పడింది. అప్పటి నుంచి అయలాన్‌ తెలుగు వెర్షన్‌కి అటంకాలు వస్తూనే ఉన్నాయి. ఓటీటీలో తెలుగు వెర్షన్‌ వస్తుందనుకుంటే తమిళ్‌ వెర్షన్‌నే స్ట్రీమ్‌ చేశారు. దీంతో శివకార్తికేయన్‌ తెలుగు ఫ్యాన్స్‌, ఆడియన్స్‌ అంతా హర్ట్‌ అయ్యారు. ఎప్పుడో ఫిబ్రవరి 19న 'అయలాన్‌' తెలుగు వెర్షన్‌ ఓటీటీలోకి వస్తుందని ప్రచారం జరిగింది. కానీ అందరికి షాకిస్తూ ఒక్క తమిళ భాషలోనే స్ట్రీమింగ్‌ అయ్యింది. దీంతో ఈ మూవీ తెలుగు వెర్షన్‌ కోసం తెలుగు ఆడియన్స్‌ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్‌కు సంబంధించి ఓ అప్‌డేట్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది.


త్వరలోనే 'అయలాన్‌' తెలుగు వెర్షన్‌ ఓటీటీలో స్ట్రీమింగ్‌ వచ్చేస్తుందంటూ అప్‌డేట్‌ బయటకు వచ్చింది. ఏప్రిల్‌ 19 నుంచి అయలాన్‌ తెలుగు వెర్షన్‌ సన్‌ నెక్ట్స్‌ స్ట్రీమింగ్‌ కానుందటూ ప్రచారం జరుగుతుంది. అయితే, ఇది ఆఫీషియల్‌ కాదు. దీనిపై మూవీ టీం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరి ఈ వార్తల్లో నిజమెంత అనేది తెలియాలంటే సదరు సంస్థ నుంచి ఆఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ వచ్చేవరకు వెయిట్‌ చేయాల్సిందే. చాలా గ్యాప్‌ తర్వాత ఈ మూవీ తెలుగు వెర్షన్‌ అప్‌డేట్‌ రావడంతో మూవీ లవర్స్‌ అంత నిజమని ఫిక్స్‌ అయిపోతున్నారు. ఈ మధ్య వస్తున్న రూమర్స్‌ అని నిజం అవుతున్నాయి. ఇప్పుడు ఈ గాసిప్‌ కూడా నిజమై ఏప్రిల్‌ 19న అయలాన్‌ తెలుగులో స్ట్రీమింగ్‌ వచ్చేస్తే బాగుండు అంటున్నారు. 


Also Read: 'దేవర'పై క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చిన విశ్వక్‌ సేన్‌ - మ్యూజిక్‌ అదిరిపోతుందంటూ ఇలా హింట్‌ ఇచ్చేశాడు!


'అయలాన్‌' కథేంటంటే!


ఒక మిషన్‌లో భాగంగా భూమి మీదకు వచ్చిన ఏలియన్‌ హీరో శివ కార్తికేయన్‌ కలుస్తుంది. వ్యవసాయం చేసుకునే హీరో ఈ అయాలన్‌ సాయం చేస్తుంది. ఈ క్రమంలో కొద్ది రోజులకే వారి మధ్య మంచి స్నేహం ఏర్పడుతుంది. దానిని హీరో టట్టూ అనే పేరుతో పిలుచుకుంటాడు. కొన్ని సంఘటనల వల్ల టట్టూ కొంతమంది వ్యక్తుల చేతుల్లో చిక్కుకుంటుంది. దాన్ని కాపాడటం కోసం హీరో ఏం చేశాడు? అసలు ఈ ఏలియన  భూమి మీదకు రావడానికి కారణం ఏంటన్నదే కథ. తన మిషన్‌ పూర్తి చేసుకుని అది తిరిగి తన లోకనాకిఇ ఎలా వెళ్లింది? అనేది ఆసక్తికర అంశాలతో ఈ సినిమా సిద్ధమైంది. ఏలియన్‌ పాత్రకు సిద్ధార్థ్‌ వాయిస్‌ ఓవర్‌ ఇవ్వగా.. ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందించారు.