'పరాశక్తి'... పవర్ ఫుల్ టైటిల్! సాధారణంగా ఫిమేల్ ఓరియంటెడ్ సినిమాలకు ఇటువంటి టైటిల్ పెడితే ప్రేక్షకులు ఎవరు పెద్దగా ఆశ్చర్యం వ్యక్తం చేయరు. ఏదో భక్తి సినిమా అని భావిస్తారు. కానీ, ప్రేక్షకులలో విపరీతమైన పాపులారిటీ ఉన్న హీరో ల్యాండ్ మార్క్ 25వ సినిమాకు ఆ టైటిల్ అంటే కాస్త క్యూరియాసిటీ పెరుగుతుంది. అదే ఇద్దరు హీరోలు తమ తమ 25వ సినిమాలకు ఆ టైటిల్ అనౌన్స్ చేస్తే... గొడవ ఉన్నట్టే లెక్క! ఆడియన్స్ మధ్య డిస్కషన్ జరగడానికి కారణం అయినట్టే! తమిళ సినిమా ఇండస్ట్రీలో అటువంటి గొడవ జరుగుతోంది.


పరాశక్తి... ఇద్దరి సినిమాలకు సేమ్ టైటిల్!?
సంగీత దర్శకుడిగా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత కథానాయకుడిగా విజయాలు సాధించిన వ్యక్తి విజయ్ ఆంటోని. 'బిచ్చగాడు'తో హీరోగా తెలుగులోనూ బ్లాక్ బస్టర్ అందుకున్నారు. అటు తమిళ ప్రేక్షకులలో కూడా మంచి గుర్తింపు పొందారు. హీరోగా ఆయన పాతిక సినిమాల మైలురాయిని చేరుకోబోతున్నారు. తన 25వ సినిమా టైటిల్ 'పరాశక్తి' అని బుధవారం జనవరి 29న ఉదయం అనౌన్స్ చేశారు.






విజయ్ ఆంటోని సినిమాకు 'పరాశక్తి' అనే టైటిల్ అనౌన్స్ చేయడం తమిళ ప్రేక్షకులలోనూ, చిత్ర పరిశ్రమ వర్గాలలోనూ కాస్త చర్చకు దారి తీసింది. ఎందుకంటే... శివ కార్తికేయన్ కథానాయకుడిగా 'గురు', 'ఆకాశమే నీ హద్దురా' సినిమాలు తీసిన సుధా కొంగర దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది. ఆ చిత్రానికి 'పరాశక్తి' టైటిల్ ఖరారు చేసినట్లు సమాచారం ఉంది. విజయ్ ఆంటోనీ ఆ టైటిల్ ప్రకటించగా... శివ కార్తికేయన్ సినిమా టైటిల్ అనౌన్స్ చేసి, టీజర్ కూడా రిలీజ్ చేశారు. ఇందులో శ్రీలీల, అథర్వ నటించారు. రవి మోహన్‌ (జయం రవి) విలన్ రోల్ చేశారు. అయితే, విజయ్ ఆంటోనీ సినిమాకు ఆ టైటిల్ ఏమిటి? అని డిస్కషన్ జరిగింది. ఎందుకంటే...






ఇంతకీ 'పరాశక్తి' టైటిల్ ఎవరిది? అది ఎవరి సొంతం?
శివ కార్తికేయన్, విజయ్ ఆంటోనీ... ఇద్దరూ తమ తమ సినిమాలకు తెలుగులో 'పరాశక్తి' టైటిల్ ఖరారు చేసినట్లు అనౌన్స్ చేశారు. తెలుగు స్పెల్లింగ్ రెండు సినిమాలకూ ఒక్కటే ఉంది. ఇంగ్లీష్ విషయానికి వచ్చేసరికి శివ కార్తికేయన్ సినిమా Parasakthi టైటిల్ అయితే విజయ్ ఆంటోని సినిమా టైటిల్ Parashakthi అని రాశారు. దాంతో టైటిల్ రైట్స్ ఎవరి దగ్గర ఉన్నాయి? అనే క్వశ్చన్ మొదలైంది.


Also Readస్టార్ హీరోయిన్ కెరీర్ నాశనం చేసిన ఒక్క తప్పు... ఆ రాత్రంతా జైల్లోనే... ఇప్పుడు ఛాన్సుల్లేవ్, ఆవిడ ఎవరో తెలుసా?


శివ కార్తికేయన్ సినిమాకు 'పరాశక్తి' టైటిల్ అనుకుంటున్న సంగతి ముందు నుంచి ప్రచారంలో ఉండడంతో విజయ్ ఆంటోనీ ఆ టైటిల్ అనౌన్స్ చేయడం తప్పు అన్నట్లు కొందరు సోషల్ మీడియాలో కామెంట్ చేశారు. అయితే 2024లోనే తాను టైటిల్ రిజిస్టర్ చేయించినట్లు విజయ్ ఆంటోని ట్వీట్ చేశారు. అయితే ఈ టైటిల్ ఇష్యూ గురించి శివ కార్తికేయన్ ఇప్పటివరకు ఎటువంటి కామెంట్ చేయలేదు. చివరకు ఎవరి సినిమాకు ఈ టైటిల్ ఉంటుందో చూడాలి. విచిత్రం ఏమిటంటే... ఇటు శివ కార్తికేయన్, అటు విజయ్ అంటోనీ ఇద్దరికీ హీరోగా ఇది 25వ సినిమా కావడం. ఎవరికి వారు‌ దీనిని ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకున్నట్లు అర్థం‌ అవుతోంది. 


Also Read: పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరాతో పంజా సీక్వెల్... దర్శకుడు విష్ణువర్ధన్ ఏమన్నారంటే?