Singer Kenishaa Reaction On Jayam Ravi Divorce: సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తమిళ స్టార్ హీరో జయం రవి విడాకుల వ్యవహారం గత కొద్ది రోజుల తీవ్ర దుమారం రేపుతోంది. విడాకుల గురించి భార్య భర్తలు రవి, ఆర్తి పరస్పర విరుద్ధ ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన విడాకులకు ఓ బెంగళూరు సింగర్ కారణమంటూ వార్తలు వచ్చాయి. ఆమెతో జయం రవి ఎపైర్ కొనసాగిస్తున్నారని, అందుకే భార్యకు విడాకులు ఇస్తున్నారంటూ ఓ తమిళ మ్యాగజైన్ వార్తలు రాసింది. ఈ వార్తలను జయం రవి తీవ్రంగా ఖండించారు. ఓ ఆధ్యాత్మిక కేంద్ర ఏర్పాటుకు సంబంధించిన విషయాలు మాట్లాడేందుకే ఆమెను కలిసినట్లు వెల్లడించారు. అనవసరంగా ఈ వివాదంలోకి తనను లాగకూడదని హితవు పలికారు.
ఇది వేరొకరి ఇంటి సమస్య- సింగర్ కెనిషా
'జయం' రవి తనతో ఎఫైర్ కొనసాగిస్తున్నట్లు వస్తున్న వార్తలను సింగర్ కెనిషా ఫ్రాన్సిస్ తప్పుబట్టింది. అవన్నీ కేవలం పుకార్లు మాత్రమే అని కొట్టిపారేసింది. “ముందుగా మీ అందరికీ వినయ పూర్వకంగా ఓ విషయాన్ని చెప్తున్నాను. దయచేసి ఈ వివాదానికి కాస్త దూరంగా ఉండండి. ఎందుకంటే, ఇది మీ ఇంటి సమస్య కాదు. వేరొకరి ఇంటి సమస్య. ఈ విషయంలో మీ అభిప్రాయాలు అవసరం లేదు. నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఇతరుల పట్ల మంచిగా వ్యవహరించండి. ఇదొక్కటే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఈ విషయానికి సంబంధించి ఇకపై మరే మీడియా సంస్థతో మాట్లాడను” అని కెనిషా వెల్లడించింది. ప్రస్తుతం ఆమె పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
DT Nxt ఇంటర్వ్యూలో కీలక విషయాలు వెల్లడి
'జయం' రవి వివాదం గురించి సింగర్ కెనిషా ఫ్రాన్సిస్ కీలక విషయాలు వెల్లడించింది. మానసిక సమస్యల నుంచి బయపడేందుకు రవి తన సాయం కోరాడని చెప్పింది. ఆర్తి రవితో పెళ్లి తర్వాత ఆయన ఎన్నో మానసిక సమస్యలను ఎదుర్కొన్నట్లు వివరించింది. “జయం రవి జీవితాన్ని పెళ్లి చాలా ఇబ్బందులకు గురి చేసింది. మానసిక క్షోభకు గురయ్యాడు. జూన్ లో అతడు నా సాయం కోరాడు. మానసిక సమస్యల నుంచి ఉపశమనం కలిగేలా థెరపీ తీసుకున్నారు. సంసార జీవితంలో ఆయన ఎదుర్కొన్న మానసిక సమస్యలను థెరపీ సెషన్‌లో వెల్లడించారు. వాటిని నేను రికార్డు చేశాను. అవసరం అయితే, ఆ రికార్డులను కోర్టుకు సమర్పిస్తాను. ఆర్తికి వ్యతిరేకంగా అన్ని సాక్ష్యాలను అందిస్తాను. తల్లిదండ్రులను కోల్పోయిన బాధ కంటే భార్య ఆర్తి, ఆమె కుటుంబ సభ్యుల నుంచి పడ్డ కష్టాలు వింటుంటే నాకు చాలా బాధ కలిగింది. తప్పు చేసిన వాళ్లకు జెండర్‌తో సంబంధం లేకుండా శిక్ష పడాలి” అని వెల్లడించింది.
రీసెంట్‌గా విడాకుల ప్రకటన చేసిన జయం రవి
తమిళ సినిమా పరిశ్రమలో అగ్ర హీరోగా గుర్తింపు తెచ్చుకున్న రవి, ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ప్రస్తుం వరుస సినిమాలు చేస్తున్నారు. 15 ఏండ్ల సంసార జీవితానికి రీసెంట్ గా స్వస్తి పలుకుతున్నట్లు చెప్పారు. అయితే, తనకు తెలియకుండానే రవి ఏకపక్షంగా విడాకుల ప్రకటన చేశాడంటూ ఆర్తి షాకింగ్ కామెంట్స్ చేసింది. ఈ నేపథ్యంలో వీరి విడాకుల వ్యవహారం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.