రంజాన్ పండక్కి సల్మాన్ ఖాన్ (Salman Khan) సినిమా రిలీజ్ అయితే సూపర్ హిట్ అనే సెంటిమెంట్ ఉంది. 'సికిందర్' (Sikandar Movie) కలెక్షన్స్ చూస్తే ఆ మాట నిజం కాదని చెప్పాలి. ఓపెనింగ్ డే కలెక్షన్లలో ఇప్పటి వరకు విడుదలైన హిందీ సినిమాలతో కంపేర్ చేస్తే బిగ్గెస్ట్ రికార్డ్ క్రియేట్ చేస్తుందని భాయ్ అభిమానులతో పాటు ప్రేక్షకులు భావించిన సినిమా...‌‌ సల్మాన్ ఖాన్ హిస్టరీలో చెత్త రికార్డు క్రియేట్ చేసింది. 


ప్రేక్షకులు లేక పలు చోట్ల షోలు క్యాన్సిల్!
సాధారణంగా సినిమాలో శుక్రవారం రిలీజ్ అవుతాయి. కానీ, సల్మాన్ ఖాన్ తన 'సికిందర్' సినిమాను ఆదివారం విడుదల చేశారు. ఫ్యాన్స్ అలాగే ప్రేక్షకులు అందరికీ రంజాన్ సందర్భంగా కొత్త సినిమాను చూపించారు. బాక్సాఫీస్ కలెక్షన్స్ మీద సండే రిలీజ్ ఎఫెక్ట్ ఉందని కొంత మంది అంటుంటే... సినిమాలో కంటెంట్ లేకపోవడం కూడా కలెక్షన్స్ నిల్ కావడానికి మరొక కారణం అంటున్నారు. మొత్తం మీద మొదటి రోజు ఈ సినిమా 30 కోట్ల రూపాయల వసూళ్లు మాత్రమే సాధించింది. 


రంజాన్ బరిలో సల్మాన్ ఖాన్ ట్రాక్ రికార్డు దృష్టిలో పెట్టుకున్న సింగిల్ స్క్రీన్ థియేటర్స్ యాజమాన్యాలు, అలాగే మల్టీప్లెక్స్ మేనేజ్మెంట్లు భారీ ఎత్తున షోలు షెడ్యూల్ చేశారు. అయితే... మొదటి రోజు నుంచి ప్రేక్షకులు వెలవెల పోవడంతో సండే నైట్ నుంచి కొన్ని థియేటర్లలో షోలు క్యాన్సిల్ చేయాల్సి వచ్చిందని సమాచారం. టెక్నికల్ ఇష్యూస్ అంటూ హైదరాబాద్ ప్లాటినం మూవీ మల్టీప్లెక్స్ సహా కొన్ని స్క్రీన్లలో ఉదయం ఆటలు కూడా క్యాన్సిల్ అయ్యాయి. సల్మాన్ ఖాన్ హిస్టరీలో విడుదలైన రోజు ఒక సినిమా షోలు క్యాన్సిల్ కావడం అనేది ఇప్పటి వరకు ఎప్పుడూ జరగలేదు. భాయ్ ఫ్యాన్స్ అందరికీ ఇది డిజప్పాయింట్ చేసే అంశం. సల్మాన్ కెరీర్లో ఇదొక చెత్త రికార్డు.






విక్కీ కౌశల్ 'ఛావా' కంటే తక్కువ...
షారుక్ ఖాన్ రంజాన్ రికార్డు బ్రేక్ కాలేదు!
విక్కీ కౌశల్, రష్మిక జంటగా నటించిన 'ఛావా' సినిమా ఈ ఏడాది బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్ల సాధించింది. మొదటి రోజు ఆ సినిమా 33 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దాంతో కంపేర్ చేస్తే సల్మాన్ ఖాన్ సినిమా ఫస్ట్ డే కలెక్షన్లు తక్కువ. సికిందర్ కేవలం 30 కోట్లతో సరిపెట్టుకుంది.


Also Readసల్మాన్ భాయ్ సినిమా హిట్టా? ఫట్టా? రంజాన్‌ సెంటిమెంట్ వర్కవుట్ అయ్యేనా?


రంజాన్ బరిలో విడుదలైన హిందీ సినిమాలలో టాప్ టెన్ ఓపెనింగ్స్ లిస్ట్ తీస్తే తొమ్మిది సినిమాలు సల్మాన్ ఖాన్ నటించినవే. పదిలో ఒక్కటి మాత్రం బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, దీపికా పదుకోన్ జంటగా నటించిన 'చెన్నై ఎక్స్ ప్రెస్'. ఆ సినిమా ఓపెనింగ్ రికార్డు కూడా 'సికిందర్' బ్రేక్ చేయలేదు. సినిమా విడుదలైన రెండో రోజు... అంటే సోమవారం మార్నింగ్ షోస్ చూడడానికి ప్రేక్షకులు ఎవరు ఆసక్తి చూపించలేదని ట్రేడ్ వర్గాలు స్పష్టం చేశాయి.


'సికిందర్' సినిమా కంటే ఆమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్, శ్రీదేవి కుమార్తె ఖుషి కపూర్ జంటగా నటించిన 'లవ్ యాపా' రెండో రోజు మార్నింగ్ షోస్ ఆక్యుపెన్సీ ఎక్కువ ఉందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఇంకా చెప్పాలంటే రంజాన్ సందర్భంగా విడుదలైన మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ 'లూసిఫర్ 2' సినిమాకు ప్రేక్షకులు ఎక్కువ మంది వెళుతున్నారు. సల్మాన్ ఖాన్ సినిమాకు ఇటువంటి పరిస్థితి వస్తుందని ఎవరు ఊహించలేదు.


Also Read: తెలుగు, తమిళ్‌లో హిట్... హిందీలో ఫట్... ఈ వారమే ఓటీటీలో స్టార్‌ కిడ్స్‌ సినిమా స్ట్రీమింగ్