యువ కథానాయకులలో సిద్ధూ జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda)ది టిపికల్ స్టైల్. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. సిద్ధూ అంటే టిల్లు, టిల్లు అంటే సిద్ధూ. ఆయనకు కామెడీ విజయాలు అందించింది. అయితే 'జాక్', 'తెలుసు కదా' సినిమాలు సిద్ధూ జొన్నలగడ్డ జోరుకు బ్రేకులు వేశాయి. దాంతో ఇప్పుడు హిట్ కోసం మళ్ళీ కామెడీని నమ్ముకున్నారట. యువ దర్శకుడితో ఆయన ఓ సినిమా ఓకే చేశారు. ఆ వివరాల్లోకి వెళితే...
ఓటీటీ కోసం కాదు... థియేట్రికల్ రిలీజ్'డీజే టిల్లు'కు సీక్వెల్ 'టిల్లు క్యూబ్' స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. అది కాకుండా మరో రెండు ప్రాజెక్టులు ఓకే చేశారు సిద్ధూ జొన్నలగడ్డ. అందులో ఒకటి ఓటీటీ కోసం! 'లక్కీ భాస్కర్' వంటి హిట్ సినిమా చేయడంతో పాటు ప్రజెంట్ సూర్య హీరోగా పాన్ ఇండియా సినిమా చేస్తున్న వెంకీ అట్లూరి దర్శకత్వంలో నెట్‌ఫ్లిక్స్ ఓటీటీకి ఓ ప్రాజెక్ట్ ఓకే చేశారు. అది వెబ్ సిరీస్.
వెంకీ అట్లూరి ప్రాజెక్ట్ కాకుండా మరొక సినిమా ఓకే చేశారు సిద్ధూ జొన్నలగడ్డ. ఆ చిత్రానికి 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' దర్శకుడు స్వరూప్ ఆర్ఎస్‌జే డైరెక్టర్.
Also Read: Ayesha Khan: ఐటమ్ సాంగ్ నుంచి స్టార్ హీరోకు జంటగా... బాలీవుడ్‌లో ఆయేషాకు భారీ ఆఫర్
'రాంబో'గా సిద్ధూ - స్వరూప్ సినిమాసిద్ధూ జొన్నలగడ్డ కథానాయకుడిగా స్వరూప్ ఆర్‌ఎస్‌జే దర్శకత్వం వహిస్తున్న సినిమాకు 'రాంబో' టైటిల్ ఖరారు చేశారని తెలిసింది. 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' సినిమాలో హీరో నవీన్ పోలిశెట్టి డిటెక్టివ్ రోల్ చేశారు. ఈసారి 'రాంబో'లో హీరో సిద్ధూ జొన్నలగడ్డ కూడా డిటెక్టివ్ రోల్ చేస్తున్నారని తెలిసింది.
Also Read: Tollywood Flashback: పాన్ ఇండియా హీరో ఫస్ట్ మాస్ హిట్... ప్రేమ కథ ప్లేసులో ఫ్యాక్షన్ సినిమా
Rambo Telugu Movie Story: ఓ స్పెషల్ పర్పస్ మీద సామాన్య బ్రాహ్మణ యువకుడు డిటెక్టివ్ ఏజెంట్ అవుతాడు. ఆ తర్వాత ఏమైంది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. ప్రజెంట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. వెంకీ అట్లూరితో నెట్‌ఫ్లిక్స్ ప్రాజెంట్, 'బ్యాడాస్' సినిమాలు పూర్తి అయ్యాక ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉందట. ఈ సినిమాను సిద్ధూతో 'డీజే టిల్లు', 'టిల్లు స్క్వేర్' ప్రొడ్యూస్ చేసిన సితార నాగవంశీ, సాయి సౌజన్య ప్రొడ్యూస్ చేస్తున్నారు.
