Vijay Deverakonda Team Reaction About Wedding Invitation Card Leak : యంగ్ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మికల వివాహం ఈ నెల 26న జరగనుందనే ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. వీరి వెడ్డింగ్ కార్డు లీకై సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యింది. దీనిపై తాజాగా విజయ్ దేవరకొండ టీం స్పందించింది.
'సంయమనం పాటించండి'
విజయ్ దేవరకొండ, రష్మికల పెళ్లి, రిసెప్షన్లకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం కరెక్ట్ కాదంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. 'హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక వివాహం ప్రచార విషయంలో కొందరు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. పెళ్లి, రిసెప్షన్‌కు సంబంధించిన అన్ని వివరాలు తమ పోస్ట్‌ల్లో వెల్లడిస్తున్నారు. దీని వల్ల వివాహ వేడుకలకు హాజరయ్యే ప్రముఖులైన అతిథులకు ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వేడుకకు బాలీవుడ్, టాలీవుడ్‌కు చెందిన ప్రముఖులతో పాటు పలువురు రాజకీయ నేతలు హాజరు కానున్నారు.
ఈ నేపథ్యంలో సోషల్ మీడియా ఆ వివరాలన్నీ వెల్లడి చేయడం కరెక్ట్ కాదు. వెడ్డింగ్ కార్డులో ఉన్న కాంటాక్ట్ నెంబర్ కూడా సోషల్ మీడియా ద్వారా వెల్లడించడం అనేది ఇబ్బందికరంగా మారే అవకాశాలున్నాయి. అతిథులు కాంటాక్ట్ కావాల్సిన నెంబర్‌ను వెడ్డింగ్ కార్డుపై ప్రింట్ చేశారు. ఆ నెంబర్ కూడా పోస్ట్ చేశారు. దీంతో ప్రైవసీకి ఇబ్బంది కలగొచ్చు. కాబట్టి ఈ విషయంలో సోషల్ మీడియా పోస్టులు చేసేవారు సంయమనం పాటించాల్సిన అవసరం ఉంది. పెళ్లి అనేది పూర్తిగా వ్యక్తిగత విషయం. అలాంటి పర్సనల్ ఈవెంట్‌కు సంబంధించి పోస్ట్‌లు చేసే ముందు ఆ పోస్ట్‌ల ద్వారా ఎలాంటి ఇబ్బందులు వస్తాయనేది చూసుకోవాలి.' అంటూ విజయ్ టీం పేర్కొంది.
Also Read : ఓటీటీలోకి సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్ 'డాటరాఫ్ ప్రసాదరావు' - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
హైదరాబాద్‌లో రిసెప్షన్
రాజస్థాన్‌లోని ఉదయపూర్ ప్యాలెస్‌లో ఈ నెల 26న విజయ్, రష్మికల పెళ్లి జరగనుందని ప్రచారం సాగుతోంది. తాజాగా టీం రియాక్షన్‌తో అది కన్ఫర్మ్ అయిపోయింది. కుటుంబ సభ్యులు, అతి కొద్ది మంది అతిథుల సమక్షంలో వివాహం జరగనున్నట్లు తెలుస్తుండగా... హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ లగ్జరీ హోటల్‌లో మార్చి 4న రిసెప్షన్ నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ ఈవెంట్‌కు టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు పొలిటికల్ లీడర్స్ హాజరు కానున్నట్లు తెలుస్తోంది.
